“హను మాన్” ఓటిటి రిలీజ్ ఎప్పుడంటే.!

“హను మాన్” ఓటిటి రిలీజ్ ఎప్పుడంటే.!

Published on Jan 29, 2024 4:59 PM IST


యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో తేజ సజ్జ హీరోగా దర్శకుడు ప్రశాంత్ వర్మ కాంబినేషన్ లో లేటెస్ట్ గా రిలీజ్ కి వచ్చిన చిత్రం “హను మాన్”. మరి ఎన్నో అంచనాలు నడుమ వచ్చిన ఈ చిత్రం టాలీవుడ్ లో ఎన్నో చిత్రాలు సెట్ చెయ్యని రేర్ రికార్డులు కూడా సెట్ చేసి మాసివ్ రన్ ని అయితే కొనసాగిస్తుంది. ఇక ఈ చిత్రం ఇప్పటికీ థియేటర్స్ లో సాలిడ్ రన్ తో దూసుకెళ్తుండగా ఇక హను మాన్ ఓటిటి రిలీజ్ ఎప్పుడు అనే దానిపై క్లారిటీ తెలుస్తుంది.

ఈ చిత్రం ఓటిటి హక్కులని ప్రముఖ సంస్థ జీ 5 వారు కొనుగోలు చేయగా ఈ చిత్రం అందులో ఎప్పుడు నుంచి స్ట్రీమింగ్ కి వస్తుంది అనేది ఇప్పుడు దాదాపు ఖరారు అయ్యింది. మరి లేటెస్ట్ సమాచారం ప్రకారం “హను మాన్” చిత్రం మార్చ్ రెండో వారం నుంచి జీ 5 లో స్ట్రీమింగ్ కి రాబోతుంది అట. సో హను మాన్ ని ఓటిటి లో వీక్షించాలి అనుకునేవారు అప్పటి వరకు ఆగక తప్పదు. ఇక ఈ చిత్రానికి గౌర హరీష్ సంగీతం అందించగా నిరన్జన్ రెడ్డి నిర్మాణం వహించారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు