ఈరోజు ప్రపంచ వ్యాప్తంగా విడుదలైన తొలిప్రేమ సినిమాకు మొదటి ఆట నుండే మంచి టాక్ రావడంతో మూవీ టీం సక్సెస్ సంబరాలు చేసుకున్నారు. ఈ సందర్భగా నిర్మాత బివిఎస్ఎన్ ప్రసాద్ తన ఆఫీస్ లో కేక్ కట్ చేసి ఆనందం వక్తం చేశారు. నిర్మాత శిరీష్ రెడ్డి ఈ వేడుకలో పాల్గొనడం జరిగింది.
వరుణ్ తేజ్ నటన, రాశి ఖన్నా అభినయం సినిమాకు మరింత ప్లస్ అయ్యింది. నూతన దర్శకుడు వెంకీ అట్లూరి సినిమాను తెరకెక్కించిన విధానం ప్రేక్షకులను కట్టి పడేసింది. ఫీల్ గుడ్ లవ్ స్టోరీగా తెరకెక్కిన ఈ సినిమా లవర్స్ కు వాలెంటైన్ డే గిఫ్ట్ గా మారింది. సినిమా ప్రదర్శింపబడే అన్ని ఏరియస్ నుండి పాజిటివ్ టాక్ రావడం విశేషం. ఫిదా సినిమా తరువాత వరుణ్ మరోసారి హిట్ ను తన ఖాతాలో వేసుకున్నాడు.


