అవైటెడ్ “వలిమై” గ్లింప్స్ లాంచ్ కి టైం ఫిక్స్.?

Published on Sep 23, 2021 3:16 pm IST

కోలీవుడ్ స్టార్ హీరో థలా అజిత్ కుమార్ హీరోగా నటిస్తున్న భారీ యాక్షన్ ఎంటర్టైనర్ చిత్రం “వలిమై” పై సర్వత్రా ఆసక్తి నెలకొన్న సంగతి తెలిసిందే. భారీ హైప్ తో ఈ సినిమా నుంచి రానున్న గ్లింప్స్ కోసం అంతా చాలా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. మరి ఈరోజు ఎట్టకేలకు మోస్ట్ అవైటెడ్ వీడియోని మేకర్స్ రిలీజ్ చేయడానికి సిద్ధం అయ్యారని టాక్ బయటకి రాగా టైం అనేది మాత్రం ఇంకా సరైన క్లారిటీ లేకుండా పోయింది.

కానీ ఇప్పుడు కోలీవుడ్ వర్గాలు చెబుతున్న దాని ప్రకారం ఈ సినిమా గ్లింప్స్ ఈరోజు సాయంత్రం 6 గంటల సమయంలో రిలీజ్ కానున్నట్టుగా తెలుస్తుంది. దీనితో అజిత్ అభిమానులు ఈ సమయానికి రంగం సిద్ధం చేసుకుంటున్నారు. హెచ్ వినోత్ దర్శకత్వంలో ప్లాన్ చేసిన ఈ సినిమా నుంచి రానున్న ఈ గ్లింప్స్ చాలా మాసివ్ గా గ్రాండ్ విజువల్స్ ఉండనుంది ఇండస్ట్రీ వగలు చెబుతున్నాయి. అంతే కాకుండా దీనితో భారీ రికార్డులు నెలకొల్పడం ఖాయమని కూడా అంతా ఆశిస్తున్నారు. మరి ఈ గ్లింప్స్ ఎలా ఉంటుందో చూడాలి.

సంబంధిత సమాచారం :