నాని 24 కి పవర్ ఫుల్ టైటిల్ !

Published on Feb 24, 2019 6:10 pm IST

నాని పుట్టిన రోజు సందర్భంగా తను నటిస్తున్న 24 వచిత్రం యొక్క టైటిల్ ను విడుదలచేశారు, మెగా స్టార్ చిరంజీవి నటించిన సినిమా గ్యాంగ్ లీడర్ ఎంత పెద్ద హిట్ అయ్యిందో ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు . ఇప్పుడు అదే టైటిల్ ను ఈ సినిమాకు పెట్టారు. ఈ రఫ్ టైటిల్ సినిమా కు యాప్ట్ అవుతుందో లేదో తెలియాలంటే విడుదలవరకు ఆగాల్సిందే.

మనం ఫేమ్ విక్రమ్ కుమార్ తెరకెక్కిస్తున్న ఈ చిత్రంలో మోడల్ ప్రియాంక అరుళ్ ఒక హీరోయిన్ గా నటిస్తుంది. ఆర్ఎక్స్ 100 ఫేమ్ కార్తికేయ నెగిటివ్ రోల్ లో నటిస్తున్న ఈ చిత్రానికి అనిరుద్ సంగీతం అందిస్తున్నాడు. మైత్రి మూవీ మేకర్స్ ఈ చిత్రాన్ని నిర్మిస్తుంది. డిఫ్రెంట్ స్క్రీన్ ప్లే తో రానున్న ఈ చిత్రంలో నాని డిఫ్రెంట్ గెటప్స్ లో కనిపించనున్నాడు.

సంబంధిత సమాచారం :