త్రివిక్రమ్ – బన్నీ సినిమా ఉందా ? లేదా ?

Published on Dec 11, 2018 3:57 am IST

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా, స్టార్ డైరెక్టర్ త్రివిక్రమ్ తన తరువాత చిత్రాన్ని చేయబోతున్నారని, త్వరలోనే అధికారిక ప్రకటన రానుందని గత కొంత కాలంగా సోషల్ మీడియాలో అనేక వార్తలు వచ్చాయి. కానీ ఇంతవరకు ఈ సినిమా గురించి ఎలాంటి అప్ డేట్ లేదు. అసలు ఈ సినిమా ఉందా లేదా అని, ఉంటే ఎప్పటి నుంచి ఉంటుందని బన్నీ ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

కాగా తాజాగా సినీ వర్గాల సమాచారం ప్రకారం ఇప్పటికే త్రివిక్రమ్ వినిపించిన స్క్రిప్ట్ లో బన్నీ కొన్ని మార్పులు కోరారట. ప్రస్తుతం త్రివిక్రమ్ ఆ మార్పులు పైనే స్క్రిప్ట్ వర్క్ చేస్తున్నారని తెలుస్తోంది. స్క్రిప్ట్ వర్క్ పూర్తీ అయ్యాక అధికారికంగా ఈ సినిమాని ప్రకటించాలని త్రివిక్రమ్ భావిస్తున్నారట. అయితే ఈ చిత్రానికి నిర్మాత ఎవరనేది ఇంకా తెలియాల్సి ఉంది.

సంబంధిత సమాచారం :