బన్నీతో మల్టీస్టారర్ ప్లాన్ చేస్తున్నాడా ?

Published on Feb 20, 2023 9:48 pm IST

టాలీవుడ్ స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్.. బాలీవుడ్ స్టార్ షాహిద్ కపూర్ కలయికలో సినిమా రాబోతుందని.. తాజాగా కొత్త రూమర్ వినిపిస్తోంది. స్టార్ డైరెక్టర్ త్రివిక్రమ్, బన్నీతో మరో సినిమా చేయనున్నాడని గతంలోనే వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. ఇందులో బాగా వినిపించిన వార్త.. మహేష్ బాబుతో సినిమా పూర్తి అయిన తర్వాత, త్రివిక్రమ్ బన్నీతోనే సినిమాని ప్లాన్ చేస్తున్నాడని.. 2023 సమ్మర్ తర్వాత ఈ సినిమా మొదలయ్యే అవకాశం ఉందని బాగా టాక్ నడిచింది.

అయితే, ఈ సినిమా మల్టీస్టారర్ అని, హిందీ హీరో షాహిద్ కపూర్ కూడా ఈ సినిమాలో ఉంటాడని.. ఇద్దరి ఫ్రెండ్స్ మధ్య జరిగే ఎమోషనల్ యాక్షన్ ఎంటర్ టైనర్ ఈ సినిమా అని తెలుస్తోంది. గతంలోనే బన్నీకి త్రివిక్రమ్ ఈ కథ చెప్పాడని, ఆ కథనే ఇప్పుడు సినిమాగా చేయాలనుకుంటున్నాడని తెలుస్తోంది. బన్నీ – త్రివిక్రమ్ – షాహిద్ కపూర్ కాంబినేషన్ అంటే.. ఈ సినిమా పై భారీ అంచనాలు ఉండే అవకాశం ఉంది. పైగా గతంలో అల్లు అర్జున్ తో జులాయి ‘అల వైకుంఠపురములో’ వంటి వరుస హిట్ చిత్రాలు తీశాడు త్రివిక్రమ్.

సంబంధిత సమాచారం :