బన్నీతో మరోసారి.. హిట్ కాంబినేషన్ లో క్రేజీ సినిమా ?

Published on Oct 2, 2022 11:03 pm IST

స్టార్ డైరెక్టర్ త్రివిక్రమ్, బన్నీతో మరో సినిమా చేయనున్నాడని గతంలోనే వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. అయితే, ఈ సినిమాకి సంబంధించి లేటెస్ట్ గా మరో గాసిప్ వినిపిస్తోంది. మహేష్ బాబు తో సినిమా పూర్తి అయిన తర్వాత, త్రివిక్రమ్ బన్నీతోనే సినిమాని ప్లాన్ చేస్తున్నాడని.. 2023 సమ్మర్ తర్వాత ఈ సినిమా మొదలయ్యే అవకాశం ఉందని తెలుస్తోంది. గతంలోనే బన్నీకి త్రివిక్రమ్ ఓ కథ చెప్పాడని, ఆ కథనే ఇప్పుడు సినిమాగా చేయాలనుకుంటున్నాడని తెలుస్తోంది.

బన్నీ – త్రివిక్రమ్ కాంబినేషన్ అంటే.. ఈ సినిమా పై భారీ అంచనాలు ఉండే అవకాశం ఉంది. పైగా గతంలో అల్లు అర్జున్ తో జులాయి ‘అల వైకుంఠపురములో’ వంటి వరుస హిట్ చిత్రాలు తీశాడు త్రివిక్రమ్. ఇక బన్నీ – త్రివిక్రమ్ చిత్రాన్ని హారిక హాసిని క్రియేషన్స్ నిర్మించబోతుందని తెలుస్తోంది.

సంబంధిత సమాచారం :