మెగాస్టార్ చిరంజీవి నటించిన ‘సైరా’ చిత్రం తెలుగు రాష్ట్రాల్లో రికార్డ్ స్థాయి వసూళ్లు సాధిస్తున్న సంగతి తెలిసిందే. దీంతో చిత్ర పిఆర్ టీమ్ సినిమాను ప్రేక్షకులకు మరింత దగ్గర చేయడానికి ప్రచార కార్యక్రమాల్ని వినూత్నంగా ప్లాన్ చేశారు. వాటిలో భాగంగానే విజయదశమి పండుగ ప్రత్యేకంగా ఒక ముఖాముఖి ఇంటర్వ్యూ సెట్ చేశారు.
ఈ ఇంటర్వ్యూలో చిరంజీవి, రామ్ చరణ్ ఇద్దరూ పాల్గొననున్నారు. ఇక ఈ ఇంటర్వ్యూకు యాంకర్‍గా వ్యవహరించబోయేది ఎవరో కాదు స్టార్ డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్. త్రివిక్రమ్ ప్రస్తుతం ‘అల వైకుంఠపురములో’ చిత్రీకరణలో బిజీగా ఉన్నారు. అంత బిజీలో కూడా ఆయన చిరు కోసం సమయం కేటాయించి వ్యాఖ్యాతగా మారడం నిజంగా విశేషమనే అనాలి.
మరి ఒక స్టార్ డైరెక్టర్ స్టార్ హీరోను, స్టార్ నిర్మాతను ఇంటర్వ్యూ చేస్తే ఎలా ఉంటుంది, వారి మధ్య ఎలాంటి అంశాలు ప్రస్తావనకు వస్తాయో చూడాలంటే కాస్త వెయిట్ చేయాల్సిందే.


