ఆన్లైన్ మూవీ టికెట్స్ పై తెలుగు రాష్ట్రాల వినూత్న నిర్ణయం?

Published on Sep 8, 2021 6:22 pm IST

దేశంలో అతి పెద్ద పరిశ్రమలో సినీ పరిశ్రమ కూడా ఒకటి. ఎన్నో వేల కోట్ల టర్నోవర్ ప్రతి ఏటా కూడా ఇండియన్ సినిమా నుంచి నడుస్తుంది.. అయితే కరోనా మూలాన గత రెండేళ్లలో ఎన్నో ఊహించని పరిణామాలు చోటు చేసుకున్నాయి. మరి మళ్ళీ థియేటర్స్ తెరుచుకుంటున్నాయి అనగా ఏపీలో టికెట్ ధరల సమస్య ఫ్రెష్ గా తలనొప్పి తెచ్చింది..

సరే ఇదంతా పక్కన పెడితే రెండు తెలుగు రాష్ట్రాలు కూడా ఒక కీలక నిర్ణయం తీసుకోనున్నట్టు తెలుస్తుంది. ఇక నుంచి ఆన్లైన్ టికెటింగ్ సర్వీస్ ని స్వయంగా ప్రభుత్వాలే స్టార్ట్ చేస్తాయట.. దానిపైనే ఒక పోర్టల్ ని కూడా సిద్ధం చేస్తున్నట్టుగా టాక్. అయితే ఇది వరకే చాలానే ఆన్లైన్ బుకింగ్ యాప్స్ మాధ్యమాలు ఉన్నాయి. మరి ఈ సమయంలో ఈ వినూత్న నిర్ణయం ఎటు వైపు తీసుకెళ్తుందో అన్నది ఆసక్తిగా మారింది.

సంబంధిత సమాచారం :