“కస్టడీ” టీజర్ తో యూనానిమస్ పాజిటివ్ హైప్.!

Published on Mar 17, 2023 12:00 pm IST

మన టాలీవుడ్ లో ఉన్నటువంటి టాలెంటెడ్ మరియు మంచి ఫైనెస్ట్ హీరోస్ లో అక్కినేని నవయువ సామ్రాట్ అక్కినేని నాగ చైతన్య కూడా ఒకరు. మరి ఎలాంటి పాత్రలో అయినా కూడా చైతు తనదైన శైలిలో ఇమిడిపోతాడు. మరి అలా తాను లేటెస్ట్ గా చేసిన మొదటి బై లాంగువల్ థ్రిల్లర్ చిత్రమే “కస్టడీ”. కోలీవుడ్ దర్శకుడు వెంకట్ ప్రభు తెరకెక్కించిన ఈ సినిమా నుంచి మేకర్స్ నిన్ననే ఫస్ట్ టీజర్ ని అయితే రిలీజ్ చేశారు.

మరి ఈ టీజర్ చూసాక అయితే ఎలాంటి మిక్సిడ్ రెస్పాన్స్ దీనికి రాలేదు. కంప్లీట్ గా పాజిటివ్ రెస్పాన్స్ తో టీజర్ కి యూనానిమస్ టాక్ వచ్చింది. మరి దీనితో అయితే థాంక్ యూ ప్లాప్ తర్వాత చై మంచి హిట్ అందుకునేలా ఉన్నాడని చెప్పొచు. అలాగే మంచి కం బ్యాక్ అయ్యే లక్షణాలు పుష్కలంగా ఈ సినిమాకి ఉన్నాయని చెప్పడంలో సందేహం లేదు. ఇక ఈ మే 12న వచ్చే సినిమా అయితే ఎలా ఉంటుందో చూడాల్సిందే.

సంబంధిత సమాచారం :