నవ్వించడమే ధ్యేయంగా పెట్టుకున్న సునీల్ !
Published on Mar 20, 2017 9:18 am IST


‘జక్కన్న, ఈడు గోల్డ్ ఎహే’ వంటి చిత్రాలతో పర్వాలేదనిపించినా ఆశించిన విజయం దక్కకపోవడంతో హీరో సునీల్ ఈసారి మాత్రం ఖచ్చితమైన హిట్ అందుకోవాలని ఉద్దేశ్యంతో తన ఎంటర్టైన్మెంట్ జోనర్ నే నమ్ముకుని దర్శకుడు క్రాంతి మాధవన్ దర్శకత్వంలో ‘ఉంగరాల రాంబాబు’ అనే చిత్రం చేస్తున్నాడు. నాలుగు రోజుల క్రితమే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటూఈ వేసవి విడుదలకు సిద్ధమవుతోంది.

ఈ సందర్బంగా నిర్మాత పరుచూరి కిరీటి మాట్లాడుతూ ‘ఈ చిత్రం పాత సునీల్ ను గుర్తు చేస్తుంది. ఆయన పాత్ర చాలా కొత్తగా ఉంటుంది. థియేటర్లోకి వచ్చిన ప్రేక్షకుల్ని నవ్వించడమే ధ్యేయంగా ఈ సినిమాను రూపొందించారు దర్శకుడు క్రాంతి మాధవన్’ అన్నారు. సునీల్ సరసన మియా జార్జ్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ చిత్రంలో రావు రమేష్, ప్రకాష్ రాజ్, పోసాని కృష్ణమురళి, అలీ, వెన్నెల కిశోర్ లు పలు కీలక పాత్రలు చేస్తుండగా జిబ్రాన్ సంగీతం అందిస్తున్నారు.

 
Like us on Facebook