మహేష్, కొరటాల సినిమా ఫస్ట్ లుక్ రిలీజ్ డేట్ !
Published on Dec 6, 2017 10:43 am IST

మహేష్ బాబు కెరీర్‌లోనే బిగ్గెస్ట్ హిట్‌గా నిలిచిన సినిమా ‘శ్రీమంతుడు’. ఈ చిత్రానికి కొర‌టాల శివ ద‌ర్శ‌క‌త్వం వహించిన సంగ‌తి తెలిసిందే. ఇప్పుడు మళ్ళీ కొరటాల శివ, మహేష్ బాబు కాంబినేష‌న్లో ఒక సినిమా రూపుదిద్దుకుంటోంది. ఈ సినిమాపై ప్రేక్షకులం సినీ వర్గాల్లో భారీ అంచనాలున్నాయి. ఈ మూవీకి మొదట ‘భరత్ అనే నేను’ టైటిల్ ఖరారు చేసినట్లు వార్తలు వచ్చినా ఇంకో టైటిల్ ను ఈ సినిమాకు పెట్టొచ్చని సమాచారం.

లేటెస్ట్ న్యూస్ ఏంటంటే.. ఈ సినిమా టైటిల్ మరియు ఫస్ట్ లుక్ ను డిసెంబర్ 31 రాత్రి విడుదల చెయ్యబోతున్నారట చిత్ర యూనిట్. అయితే ఈ వార్తపై ఇంకా అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది. నిన్న హైదరాబాద్ షెడ్యూల్ పూర్తిచేసిన చిత్ర యూనిట్ ఈనెల రెండో వారంలో తమిళనాడులోని కారైకుడిలో కొన్ని కీలక సన్నివేశాలు చిత్రీకరించబోతున్నారు. దేవిశ్రీప్రసాద్ సంగీతం అందిస్తున్న ఈ మూవీని డివివి దానయ్య నిర్మిస్తున్నారు.

 
Like us on Facebook