జెర్సీ లో లోకల్ ప్లేయర్స్ !

Published on Jan 30, 2019 2:01 am IST

‘మళ్ళీరావా’ ఫేమ్ గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో న్యాచురల్ స్టార్ నాని నటిస్తున్న చిత్రం జెర్సీ. క్రికెట్ నేపథ్యంలో స్పోర్ట్స్ డ్రామా గా తెరకెక్కుతున్న ఈ చిత్రం శరవేగంగా షూటింగ్ ను జరుపుకుంటుంది. ఇక ఈ చిత్రం కోసం లోకల్ ప్రొఫెషనల్ ఆటగాళ్లను తీసుకుంటున్నారట. స్టేట్ లెవెల్ లో ఆడిన ప్లేయర్స్ అయితే ఇంకా రియలిస్టిక్ గా వుంటుందని డైరెక్టర్ ఈ నిర్ణయం తీసుకున్నాడట. ఈచిత్రంలో నాని ,అర్జున్ గా మిడిల్ ఏజ్డ్ క్రికెటర్ గా కనిపించనుండగా కన్నడ నటి శ్రద్ధ శ్రీనాథ్ హీరోయిన్ గా నటిస్తుంది. ఈచిత్రం రంజీ క్రికెటర్ లైఫ్ ను బేస్ చేసుకుని తెరకెక్కుతుంది.

సితార ఎంటెర్టైన్మెంట్స్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి అనిరుధ్ రవి చంద్రన్ సంగీతం అందిస్తున్నారు. ఏప్రిల్ 19న ప్రేక్షకులముందుకు రానున్న ఈ చిత్రం ఫై ఇప్పటికే మంచి అంచనాలు నెలకొన్నాయి.

సంబంధిత సమాచారం :