పవన్, నితిన్ ల సినిమా ఎంతవరకు వచ్చిందంటే !
Published on Nov 22, 2017 9:45 am IST

హీరో నితిన్ తన అభిమాన హీరో పవన్ కళ్యాణ్ నిర్మాణంలో ఒక సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. పవన్ కళ్యాణ్ క్రియేటివ్ వర్క్స్, నితిన్ యొక్క శ్రేష్ట్ మూవీస్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి. ‘రౌడీ ఫెలో’ తో దర్శకుడిగా మారిన పాతాళ రచయిత కృష్ణ చైతన్య ఈ సినిమాను డైరెక్ట్ చేస్తున్నారు.

జూలై 24న మొదలైన ఈ చిత్ర రెగ్యులర్ షూటింగ్ ప్రస్తుతం ఊటీలో జరుగుతోంది. నితిన్, హీరోయిన్ మేఘా ఆకాష్ లపై కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. పవన్ కు అత్యంత సన్నిహితుడు, దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ ఈ చిత్రానికి కథను అందించగా ఎస్. ఎస్ థమన్ సంగీతాన్ని అందిస్తున్నారు. పవన్, నితిన్ లు కలిసి చేస్తున్న మొదటి ప్రాజెక్ట్ కావడం, ఇందులో త్రివిక్రమ్ హస్తం కూడా ఉండటంతో ప్రాజెక్ట్ పై ప్రేక్షకుల్లో మంచి క్రేజ్ నెలకొని ఉంది.

 
Like us on Facebook