తన కష్టానికి ఫలితం వస్తుందంటున్న హీరోయిన్ !

Published on Oct 12, 2018 8:51 am IST

ఒకప్పటి హీరో శరత్‌ కుమార్‌ నట వారసురాలిగా సినీ ఎంట్రీ ఇచ్చిన వరలక్ష్మీ శరత్‌కుమార్‌, హీరోయిన్ గానే కాకుండా విలన్ పాత్రలను కూడా పోషించే నటిగా మంచి గుర్తింపు తెచుకున్నారు. తాజాగా వరలక్ష్మీ తెలుగు ప్రేక్షకులకు తన గొంతును వినిపించబోతుంది. ఆమె నటించిన ‘సర్కార్‌ మరియు విశాల్‌ ‘పందెం కోడి 2’ చిత్రాలకు తెలుగులో ఆమె పాత్రకు ఆమెనే డబ్బింగ్‌ చెప్పుకున్నారు. ‘ తెలుగులో డబ్బింగ్‌ చెప్పి చెప్పి తన గొంతు కూడా నెప్పి పుడుతుందని.. కానీ నా కష్టానికి తగ్గ ఫలితం ఉంటుందని వరలక్ష్మీ చెప్పుకొచ్చారు.

వరలక్ష్మీ కీలక పాత్రలో.. విశాల్ హీరోగా లింగు సామి తెరకెక్కించిన ‘పందెంకోడి 2’ చిత్రంతో ఆమె ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. విజయదశమి కానుకగా అక్టోబర్ 18న తెలుగు, తమిళ భాషల్లో ఈ చిత్రం ఒకేసారి విడుదల కానుంది.

సంబంధిత సమాచారం :