తన పెళ్లి వార్తల పై సీరియస్ అయిన హీరోయిన్ !
Published on Oct 10, 2018 6:01 pm IST

సీనియర్ నటుడు శరత్‌ కుమార్‌ వారసురాలిగా సినీ రంగ ప్రవేశం చేసిన వరలక్ష్మీ శరత్‌కుమార్‌ ఇటు హీరోయిన్ గానే కాకుండా అటు వైవిధ్యమైన పాత్రలను పోషించే నటిగా కూడా మంచి గుర్తింపు తెచుకుంది. అయితే సోషల్ మీడియాలో ఆమె త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నారని, ఇప్పటికే నిశ్చితార్ధం కూడా అయిపోయిందని రకరకాలు రూమర్స్ వస్తుండగా.. వాటి పై ఆమె సీరియస్ అయింది. ఆ రూమర్స్ అన్ని పచ్చి అబద్దాలు అని వరలక్ష్మి క్లారిటీ ఇచ్చింది.

ఆమె ఇంకా మాట్లాడుతూ ప్రస్తుతం తన దృష్టి అంతా సినిమాల పై మాత్రమే ఉందని స్పష్టం చేసింది. తానూ నటిగా ఇంకా ఎదగాలని.. ఇప్పట్లో తనకు పెళ్లి చేసుకున్నే ఆలోచన లేదని.. ఇలాంటి వార్తలు నమ్మాల్సిన ఆవరసం లేదని వరలక్ష్మి తెలిపింది.

ప్రస్తుతం ఆమె విశాల్ హీరోగా లింగు సామి తెరకెక్కించిన ‘పందెంకోడి 2’ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. విజయదశమి కానుకగా అక్టోబర్ 18న తెలుగు, తమిళ భాషల్లో ఒకేసారి విడుదల కానుంది ఈ చిత్రం.

  •  
  •  
  •  
  •  

 
Subscribe to our Youtube Channel
 
Like us on Facebook