ఫిబ్రవరి ని టార్గెట్ చేసిన అర్జున్ రెడ్డి తమిళ రీమేక్ !

Published on Dec 16, 2018 9:45 am IST

సెన్సేషనల్ హీరో విజయ్ దేవరకొండ నటించిన ‘అర్జున్ రెడ్డి’ తమిళ భాషలో చియాన్ విక్రమ్ తనయుడు ధృవ్ విక్రమ్ హీరోగా ‘వర్మ’ అనే టైటిల్ తో రీమేక్ అవుతున్న విషయం తెలిసిందే. ఇటీవలే ఈ చిత్ర షూటింగ్ కూడా పూర్తయింది. ఈచిత్రాన్ని వచ్చే ఏడాది ఫిబ్రవరిలో విడుదల చేయనున్నారు. విలక్షణ దర్శకుడు బాలా తెరకెక్కిస్తున్న ఈ చిత్రంలో ధృవ్ విక్రమ్ కు జోడిగా బెంగాలీ భామ మేఘ చౌదరి నటిస్తుంది.

ఇక ఇటీవల విడుదలైన ఈ చిత్ర టీజర్ కు తమిళంలో మంచి రెస్పాన్స్ రాగా తెలుగులో మాత్రం మిశ్రమ స్పందన వచ్చింది. ఈ4 ఎంటర్టైన్మెంట్స్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి ఒరిజినల్ వర్షన్ కు సంగీతం అందించిన రధాన్ సంగీతం అందిస్తున్నారు. ప్రముఖ తెలుగు నటి ఈశ్వరీ రావు ఈ చిత్రంలో ముఖ్య పాత్రలో నటిస్తుంది.

సంబంధిత సమాచారం :