ఓటీటీలో సైలెంట్ గా స్ట్రీమింగ్ కి వచ్చేసిన ‘ఆపరేషన్ వాలెంటైన్”

ఓటీటీలో సైలెంట్ గా స్ట్రీమింగ్ కి వచ్చేసిన ‘ఆపరేషన్ వాలెంటైన్”

Published on Mar 22, 2024 8:00 AM IST


మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ సినిమాల ఫలితంతో సంబంధం లేకుండా పలు ప్రయోగాత్మక చిత్రాలు వరుసగా చేస్తూ వస్తున్నాడు. అలా తను చేసిన లేటెస్ట్ సినిమానే “ఆపరేషన్ వాలెంటైన్”. కొత్త దర్శకుడు శక్తి ప్రతాప్ సింగ్ తెరకెక్కించిన ఈ భారీ యాక్షన్ డ్రామా అనుకున్న స్థాయిలో అయితే రాణించలేదు. దీనితో ఈ చిత్రం ఓటీటీలో కూడా త్వరగానే వచ్చేస్తుంది అని అంతా అనుకున్నారు. రీసెంట్ గా ఈ సినిమా ఈ మార్చ్ 29నుంచి స్ట్రీమింగ్ కి రావచ్చని బజ్ వచ్చింది.

కానీ సర్ప్రైజింగ్ గా ఈ చిత్రం మరో వారం ముందే వచ్చేసింది. ప్రముఖ స్ట్రీమింగ్ యాప్ ప్రైమ్ వీడియో ఈ సినిమా హక్కులు సొంతం చేసుకోగా అందులో ఈ చిత్రం నేటి నుంచి తెలుగు సహా తమిళ్ భాషల్లో అందుబాటులోకి వచ్చేసింది. మరి ఈ సినిమాని అప్పుడు మిస్ అయ్యి ఇప్పుడు చూడాలి అనుకునేవారు ప్రైమ్ వీడియోలో ట్రై చేయవచ్చు. ఇక ఈ చిత్రానికి మిక్కీ జే మేయర్ సంగీతం అందించగా బాలీవుడ్ నటి మానుషి చిల్లర్ వరుణ్ తేజ్ సరసన నటించింది.

సమీక్ష కోసం ఇక్కడ క్లిక్ చేయండి

సంబంధిత సమాచారం

తాజా వార్తలు