తొలిప్రేమలో ఆకట్టుకున్న వరుణ్ తేజ్ లుక్!
Published on Oct 5, 2017 3:10 pm IST

ఫిదా సూపర్ హిట్ తో మంచి జోష్ మీద ఉన్న మెగా హీరో వరుజ్ తేజ్ వెంటనే మరో ప్రేమ కథకి రెడీ అయిపోయాడు. ఇప్పుడు ఈ సినిమా షూటింగ్ చాలా స్పీడ్ గా జరుగుతుంది. వెంకి అట్లూరి దర్శకత్వం లో తెరకెక్కుతున్న ఈ సినిమాకి పవన్ కళ్యాణ్ సూపర్ హిట్ సినిమా అయిన తొలిప్రేమ పేరుని ఉపయోగించుకోవడం విశేషం.

ఈ పేరుతోనే సినిమా మీద కొంత పాజిటివ్ బజ్ తెచ్చుకున్న వరుణ్ తాజా తన లుక్ తో కూడా మంచి రెస్పాన్స్ అందుకున్నాడు. తొలిప్రేమ సినిమాలో ఒక లుక్ ని హీరోయిన్ రాశి ఖన్నా ఈ మధ్య సోషల్ మీడియా ద్వారా షేర్ చేసింది.ఆ ఫోటో ఒక్క సారిగా వైరల్ అయ్యి అందరిని ఆకట్టుకుంది.

 
Like us on Facebook