వెంకటేష్ తేజ సినిమా షూటింగ్ అప్డేట్ !

విక్ట‌రీ వెంక‌టేష్‌, సంచ‌ల‌న ద‌ర్శ‌కుడు తేజ కాంబినేష‌న్‌లో రూపొందుతున్న చిత్రం పూజా కార్యక్రమాలు ఇటివల జరిగిన సంగతి తెలిసిందే. ‍‍‍‍‍‌ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ ఈ నెల మూడో వారం నుండి ప్రారంభం కానుంది. నారా రోహిత్ ఈ మూవీలో ముఖ్య పాత్రలో కనిపించబోతున్నాడు. అనుప్ రూబెన్స్ ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నాడు.

మంచి కథ కథనాలతో ఈ సినిమా తెరకేక్కబోతోంది. చాలా గ్యాప్ తరువాత వెంకటేష్ ఒకే చేసిన సబ్జెక్టు ఇదేఅవ్వడం విశేషం. ప్రస్తుతం ఈ మూవీ ప్రీ ప్రొడక్షన్ స్టేజ్ లో ఉంది. త్వరలో ఈ చిత్రంలో నటించబోయే నటీనటుల వివరాలు వెల్లడి కానున్నాయి. రామానుజం సినిమాటోగ్రఫీ అందిస్తున్న ఈ సినిమాను ప్రతిస్టాత్మకంగా తియ్యబోతున్నాడు దర్శకుడు తేజ.