ఆ ఇద్దరు స్టార్ హీరోల ఫ్యాన్స్ కలిసి ముందుకెళ్తారట.

Published on Apr 2, 2020 9:00 pm IST

సౌత్ ఇండియాలో భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ కలిగిన ఇద్దరు హీరో ఫ్యాన్స్ కలిసి ఓ మ్యూచ్యువల్ ఫ్యాన్ పేజ్ ఏర్పాటు చేయనున్నారట. దానికి ముహూర్తంగా నేటి సాయంత్రం 7:00 గంటలుగా ఫిక్స్ చేశారు. తమిళ సూపర్ స్టార్ విజయ్, కన్నడ సూపర్ స్టార్ యష్ ఫ్యాన్స్ కలిసి ఈ నిర్ణయం తీసుకున్నారు. ఈ ఇద్దరు హీరోల ఫ్యాన్స్ కలిసి మొదలుపెట్టనున్న సోషల్ మాధ్యమాల ద్వారా ఇద్దరు హీరోల అప్డేట్స్ పంచుకుంటూ ఒకరికి ఒకరు అన్నట్లుగా పనిచేస్తారట. ఇద్దరు స్టార్ హీరో ఫ్యాన్స్ కలిసి పనిచేయాలి నిశ్చయించుకోవడం బహుశా ఇదే మొదటిసారి కావచ్చు.

ఇక విజయ్ నటిస్తున్న మాస్టర్ మూవీ ఏప్రిల్ లో విడుదల కావాల్సివుండగా, కరోనా కర్ఫ్యూ కారణంగా వాయిదా పడింది. ఈ చిత్రానికి దర్శకత్వం లోకేష్ కనకరాజ్ వహిస్తున్నారు. దేశవ్యాప్తంగా అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్న యష్ కెజిఫ్ 2, అక్టోబర్ లో విడుదల కానుంది. ఈ మూవీకి దర్శకత్వం ప్రశాంత్ నీల్ వహిస్తున్న సంగతి తెలిసిందే.

సంబంధిత సమాచారం :

X
More