మరో ద్విభాషా చిత్రంలో విజయ్ దేవరకొండ !

Published on Dec 12, 2018 3:32 pm IST

యువ హీరో విజయ్ దేవరకొండ మరో ద్విభాషా చిత్రానికి ఓకే చెప్పాడని సమాచారం. ఇటీవల ‘నోటా’ తో కోలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చిన విజయ్ ఆ చిత్రంతో పరాజయం చవిచూశాడు. ఇక తాజాగా ఆయన డ్రీం వారియర్ పిక్చర్స్ అధినేత ఎస్ ఆర్ ప్రభు నిర్మాణంలో రెండో చిత్రంలో నటించనున్నాడట. నూతన దర్శకుడు శ్రీ కార్తీక్ తెరకెక్కించనున్న ఈ చిత్రం తెలుగు , తమిళ భాషల్లో రూపొందనుంది. ఈచిత్రంలో ‘పెళ్లిచూపులు’ ఫేమ్ ప్రియదర్శి , ‘అర్జున్ రెడ్డి’ ఫేమ్ రాహుల్ రామకృష్ణ అలాగే తమిళ రైజింగ్ కమెడియన్ యోగిబాబు నటించనున్నారు. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ స్టేజ్ లో వున్న ఈ చిత్రం గురించి త్వరలోనే అధికారిక ప్రకటన వెలుబడనుంది.

ఇక విజయ్ ప్రస్తుతం ‘డియర్ కామ్రేడ్’ అనే చిత్రంలో నటిస్తున్నాడు. ఈచిత్రం తోపాటు ఆయన ‘మళ్ళీ మళ్ళీ ఇది రాని రోజు’ ఫేమ్ క్రాంతి మాధవ్ దర్శకత్వంలో నటించనున్నాడు. త్వరలోనే ఈ చిత్రం సెట్స్ మీదకు వెళ్లనుంది.

సంబంధిత సమాచారం :