మరింత సూపర్ కూల్ గా “వారసుడు” సెకండ్ లుక్.!

మరింత సూపర్ కూల్ గా “వారసుడు” సెకండ్ లుక్.!

Published on Jun 22, 2022 1:56 PM IST

ఇళయ దళపతి విజయ్ జోసెఫ్ హీరోగా ప్రస్తుతం మన తెలుగు మరియు తమిళ భాషల్లో ఎకకకాలంలో చేస్తున్న లేటెస్ట్ సాలిడ్ ప్రాజెక్ట్ “వారసుడు”. ఈరోజు విజయ్ బర్త్ డే కానుకగా దర్శకుడు వంశీ పైడిపల్లి తెరకెక్కిస్తున్న ఈ చిత్ర యూనిట్ నుంచి నిన్న సాయంత్రమే ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్ అయ్యింది. సూపర్ స్టైలిష్ గా కనిపిస్తున్న విజయ్ ఫస్ట్ లుక్ మేకర్స్ అయితే రిలీజ్ చేశారు.

మరి గతంలో లానే విజయ్ సినిమాల నుంచి ఫస్ట్ లుక్ తర్వాత సెకండ్, థర్డ్ లుక్ పోస్టర్స్ కూడా ఉన్నాయని మేకర్స్ అనౌన్స్ చేశారు. మరి ఇప్పుడు చెప్పినట్టుగానే ఆ సెకండ్ లుక్ పోస్టర్ ని కూడా రిలీజ్ చేశారు. మరి ఇది కూడా మంచి ఇంప్రెసివ్ గా ఉందని చెప్పాలి.

సినిమా రిలీజ్ టైం సంక్రాంతికి అన్నట్టుగా విజయ్ సూపర్ కూల్ గా కనిపిస్తూ పిల్లలు గాలిపటం, చెరుకులు వంటివి కనిపిస్తూ ఎక్కడికో బయలుదేరినట్టుగా కనిపిస్తున్నాడు. మరీ ముఖ్యంగా విజయ్ మంచి యంగ్ గా కూడా కనిపిస్తున్నాడు. ఇక ఈ చిత్రానికి థమన్ సంగీతం అందిస్తుండగా శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ వారు నిర్మాణం వహిస్తున్నారు. మరి సాయంత్రం వచ్చే మూడో లుక్ ఎలా ఉంటుందో చూడాల్సిందే.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు