మారుతి సినిమాలో వింటేజ్ లుక్స్ తో ప్రభాస్..!

మారుతి సినిమాలో వింటేజ్ లుక్స్ తో ప్రభాస్..!

Published on Dec 25, 2022 7:02 AM IST

ఏ సినిమా హీరో అభిమాని తన హీరోని మళ్లీ పాత సినిమాల్లో లా అప్పటి లుక్స్ అండ్ ఎనర్జీ తో చూడాలని కోరుకోడు. అయితే ఈ మ్యాజిక్ అన్నిసార్లు రిపీట్ కాదు అని చెప్పాలి. కాలం మారే కొద్దీ హీరోల లుక్స్ తో తేడా ఖచ్చితంగా వస్తుంది. మరి అలా ఉన్నప్పటికీ డైరెక్టర్స్ చేసే ప్రెజెంటేషన్ డిజైన్ చేసే కాస్ట్యూమ్స్ డెఫినెట్ గా ప్రభావం చూపుతాయి.

మరి అలానే ఇప్పుడు పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ అయితే మళ్లీ చాలా కాలం తర్వాత వింటేజ్ ట్రీట్ డెఫినెట్ గా ఇచ్చేలా కనిపిస్తున్నాడు. తాను ప్రస్తుతం చేస్తున్న చిత్రాల్లో దర్శకుడు మారుతి తో చేస్తున్నా ఇంట్రెస్టింగ్ ప్రాజెక్ట్ కూడా ఒకటి. మరి ఈ సినిమాలో అయితే మళ్లీ పాత ప్రభాస్ ని తాను చూపిస్తానని తెలిపాడు. ఇక అందుకు తగ్గట్టుగానే సినిమా సెట్స్ నుంచి ఓ పిక్ వైరల్ గా మారింది. మరి ఇది చూస్తే వింటేజ్ ప్రభాస్ గుర్తు రాక మానడు. దీనితో అయితే ఫ్యాన్స్ కి డెఫినెట్ గా మంచి ట్రీట్ ప్రభాస్ లుక్స్ అండ్ ఎనర్జీ పరంగా దొరికే ఛాన్స్ ఉందని చెప్పొచ్చు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు