తన పెళ్లి వార్తలపై స్పందించిన విశాల్ !

Published on Jan 11, 2019 6:00 pm IST

యాక్షన్ హీరో విశాల్ తన పెళ్లి గురించి వస్తున్న వార్తలపై స్పందించాడు. నా పెళ్లి గురించి కొన్ని ఆర్టికల్స్ చూసి ఆశ్చర్యం వేసింది. ఇలాచేయడం కరెక్ట్ కాదు. నా వ్యక్తిగత విషయం ఇది . నా పెళ్లి గురించి త్వరలోనే అధికారికంగా ప్రకటిస్తాను గాడ్ బ్లెస్ అని విశాల్ తన ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. ఇక ఇటీవల విశాల్ నాన్నగారు ఒక ఇంటర్వ్యూ లో మాట్లాడుతూ తన కొడుకు తెలుగు అమ్మాయి అనిషా ను పెళ్లి చేసుకోనున్నాడని త్వరలోనే వాళ్ళిద్దరి ఎంగేజ్మెంట్ హైదరాబాద్లో జరుగనుందని అన్నారు.

ప్రస్తుతం విశాల్ తెలుగు సూపర్ హిట్ మూవీ టెంపర్ రీమేక్ లో నటిస్తూ బిజీగా వున్నాడు. అయోగ్య అనేటైటిల్ తో తెరకెక్కుతున్న ఈచిత్రం ఫిబ్రవరి లో విడుదలకానుంది.

సంబంధిత సమాచారం :

More