చివరి దశకు చేరుకున్న విశాల్ కొత్త చిత్రం !
Published on Nov 3, 2016 9:33 am IST

vishal
‘పందెం కోడి, పొగరు’ వంటి మాస్ మసాలా సినిమాలతో తెలుగు ప్రేక్షకులకు బాగా దగ్గరైన తమిళ హీరో విశాల్ ఈ మధ్య ‘రాయుడు’ చిత్రంతో కూడా తెలుగులో మంచి విజయాన్నందుకున్నాడు. ప్రస్తుతం విశాల్ తమిళంలో చేస్తున్న ‘కత్తి సందై’ చిత్రం తెలుగులో ‘ఒక్కడొచ్చాడు’ గా విడుదలకానుంది. ట్రైలర్ ఆకట్టుకోవడంతో ఈ చిత్రంపై మంచి అంచనాలున్నాయి. తమన్నా హీరోయిన్ గా నటిస్తున్న ఈ చిత్రం ప్రస్తుతం హైదరాబాద్ లో డబ్బింగ్ పనులు జరుపుకుంటోంది. ఇప్పటికే సినిమాలో ముఖ్య పాత్రధారులైన జగపతిబాబు, బ్రహ్మానందం, జె.పి తమ పాత్రలకు డబ్బింగ్ పూర్తి చేసేశారు.

అలాగే ఆడియోని నవంబర్ 7న విడుదల చేసి, సినిమాని నవంబర్ 18న ప్రపంచవ్యాప్తంగా విడుదలచేయనున్నారు. విశాల్ కెరీర్లోనే అత్యంత భారీ బడ్జెట్ చిత్రంగా రూపొందుతున్న ఈ సినిమాలో జగపతిబాబు విలన్ గా నటిస్తున్నారు. విశాల్ తన సొంత బ్యానర్‌పై నిర్మిస్తోన్న ఈ సినిమాను తెలుగులో హరి వెంకటేశ్వర ఫిల్మ్ బ్యానర్ పై జి.హరి నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. హిపాప్ తమీజా సంగీతం అందిస్తున్న ఈ కమర్షియల్ ఎంటర్టైనర్ ను సురాజ్ డైరెక్ట్ చేస్తున్నారు.

 
Like us on Facebook