కమల్ హాసన్ ‘విశ్వరూపం-2’ మళ్ళీ మొదలైంది !
Published on Apr 20, 2017 12:25 pm IST


2013లో కమల్ హాసన్ ప్రధాన పాత్రలో నటించిన ‘విశ్వరూపం’ చిత్రమే ఎంతటి ఘన విజయాన్ని సాధించిందో వేరే చెప్పనక్కర్లేదు. అందులో కమల్ నటనకు గాను ప్రేక్షకులు నీరాజనాలు పట్టారు. ఆ చిత్రం విడుదలైన కొద్దిరోజులకే దానికి సీక్వెల్ తీస్తానని కమల్ ప్రటించారు. దాదాపు షూటింగ్ చాలా వరకు పూర్తి చేశారు కూడ. కానీ కొన్ని రాజకీయ, ఇతర కారణాల వలన ఆ సీక్వెల్ ఆగిపోయింది. ఇక ఆ ప్రాజెక్ట్ లేనట్టే అని అందరూ అనుకున్నారు.

ఆ తర్వాత చాలా కాలానికి ఈ మధ్యే ఒక రెండు నెలల క్రితం కమల్ ‘విశ్వరూపం 2 కోసం చూస్తున్న అందరికీ ఒక శుభవార్త. ఈ అంశాన్ని పర్సనల్ గా తీసుకుని సినిమాకున్న అడ్డంకులన్నీ తొలగించేశాను. సినిమా తిరిగి మొదలవుతుంది’ అన్నారు. ఆయన చెప్పిన మాట ప్రకారమే ప్రస్తుతం డబ్బింగ్, పోస్ట్ ప్రొడక్షన్ పనులు మొదలై నిరాటంకంగా జరుగుతున్నాయని తమిళ సినీ వర్గాల ద్వారా తెలిసింది. ఈ వార్తను బట్టి చూస్తే కమల్ ‘విశ్వరూపం 2’ ను థియేటర్లలోకి తీసుకురావడానికి అట్టే ఎక్కువ సమయం పట్టదని అర్థమవుతోంది.

 
Like us on Facebook