సెన్సార్ పూర్తి చేసుకున్న విశ్వాసం!

Published on Dec 24, 2018 2:28 pm IST

తల అజిత్ నటించిన ‘విశ్వాసం’ ఫై కోలీవుడ్ లో భారీ అంచనాలు వున్నాయి. ఇక ఈ చిత్రం యొక్క టీజర్ వచ్చే ఏడాది న్యూ ఇయర్ రోజున జనవరి 1కి విడుదలచేయనున్నారని సమాచారం. యాక్షన్ చిత్రాల దర్శకుడు శివ తెరకెక్కిస్తున్న ఈ చిత్రంలో లేడీ సూపర్ స్టార్ నయనతార కథానాయికగా నటించింది. యాక్షన్ ఎంటర్టైనేర్ నేపథ్యంలో వస్తున్న ఈ చిత్రం 2019 జనవరి 10 న ప్రేక్షకులముందుకు రానుంది. ఇప్పటికే ఈ చిత్రం ప్రీ రిలీజ్ బిజినెస్ ను పూర్తి చేసుకుంది. ఒక్క తమిళనాడులోనే 48కోట్ల బిజినెస్ చేసిందని సమాచారం. అయితే ఈ చిత్రం అదే డేట్ కు తెలుగులో విడుదలవుతుందన్న విషయం ఫై ఇంకా క్లారిటీ రాలేదు.

సత్యజ్యోతి ఫిలిమ్స్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి ఇమ్మన్ సంగీతం అందిస్తున్నారు. ఇక ఈ చిత్రానికి ఒక్క రోజు ఆలస్యంగా సూపర్ స్టార్ రజినీకాంత్ నటిస్తున్న ‘పెట్టా’ విడుదలవుతుండంతో ఈ పొంగల్ కు కోలీవుడ్ లో బాక్సాఫీస్ వద్ద ఆసక్తికర పోరు జరుగనుంది.

సంబంధిత సమాచారం :