‘వార్ – 2’ : ఎన్టీఆర్, హృతిక్ పిక్స్ లీక్

‘వార్ – 2’ : ఎన్టీఆర్, హృతిక్ పిక్స్ లీక్

Published on Apr 16, 2024 8:00 PM IST

బాలీవుడ్ స్టార్ నటుడు హృతిక్ రోషన్, టాలీవుడ్ గ్లోబల్ స్టార్ ఎన్టీఆర్ ప్రధాన పాత్రల్లో అయాన్ ముఖర్జీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న లేటెస్ట్ యాక్షన్ థ్రిల్లర్ మూవీ వార్ 2. ఈ మూవీని యష్ రాజ్ ఫిలిమ్స్ సంస్థ గ్రాండ్ లెవెల్లో నిర్మిస్తుండగా కియారా అద్వానీ హీరోయిన్ గా నటిస్తున్నారు. ఇప్పటికే కొంతమేర షూటింగ్ జరుపుకున్న ఈ మూవీ యొక్క తాజా షెడ్యూల్ ముంబైలో వేగంగా జరుగుతోంది. ఇక ప్రస్తుతం జరుగుతున్న షెడ్యూల్ లో ఎన్టీఆర్, హృతిక్ ఇద్దరూ పాల్గొంటుండగా పలు కీలక సీన్స్ చిత్రీకరిస్తోంది యూనిట్.

విషయం ఏమిటంటే, తాజాగా ఈ మూవీ షూటింగ్ సెట్స్ నుండి ఎన్టీఆర్, హృతిక్ ల పిక్స్ లీక్ అయి సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నాయి. ఎన్టీఆర్, హృతిక్ ఇద్దరూ కూడా లేటెస్ట్ స్టైలిష్ లుక్స్ లో ఈ పిక్స్ లో కనిపిస్తున్నారు. అయితే లీక్ అయిన పిక్స్ పోస్ట్ చేయడం కరెక్ట్ కాదు కాబట్టి మేము వాటిని అందించడం లేదు. కాగా వార్ 2 మూవీని వచ్చే ఏడాది ఆగష్టు 15న విడుదల చేయనున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు