11 రోజుల్లో ఏకంగా 250కోట్లకు కొల్లగొట్టారు

11 రోజుల్లో ఏకంగా 250కోట్లకు కొల్లగొట్టారు

Published on Oct 13, 2019 4:32 PM IST

బాలీవుడ్ స్టార్ హీరో హృతిక్ రోషన్ ఈ ఏడాది బ్యాక్ టు బ్యాక్ హిట్స్ అందుకున్నాడు. రెండు నెలల క్రితం సూపర్ 30మూవీతో 150కోట్ల వసూళ్లు సాధించిన ఆయన, వార్ చిత్రంతో రికార్డు వసూళ్లు కొల్లగొడుతున్నారు. మొదటి రోజే 50కోట్లకు పైగా వసూళ్లు సాధించిన వార్ మూవీ విడుదలైన 11రోజులకు 250కోట్ల మార్కు చేరుకుంది. దీనితో 2019 సవత్సరానికి గాను సెకండ్ హైయెస్ట్ గ్రాస్సింగ్ మూవీగా వార్ నిలిచింది. చిన్న చిత్రంగా విడుదలై భారీ విజయాన్ని అందుకున్న ఉరి మూవీ వసూళ్లను వార్ మూవీ దాటివేయడం గమనార్హం.

షాహిద్ కపూర్, కియారా అద్వానీ జంటగా సందీప్ రెడ్డి వంగా తెరకెక్కించిన కబీర్ సింగ్ 300కోట్లకు పైగా వసూళ్లతో ఈ ఏడాది హైయెస్ట్ కలెక్షన్స్ రాబట్టిన మూవీగా నిలిచింది. వార్ వసూళ్ల జోరు ఇంకా కొనసాగడంతో కబీర్ సింగ్ కలెక్షన్స్ కూడా వార్ దాటేసే అవకాశం కలదు. టైగర్ ష్రాఫ్ మరో హీరోగా నటించిన ఈ మూవీని సిద్దార్థ ఆనంద్ తెరకెక్కించగా యష్ రాజ్ ఫిలిమ్స్ నిర్మించారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు