దసరాకు పోటీ పడనున్న ముగ్గురు హీరోలు

rams
ఈసారి దసరాకు టాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద రసవత్తరమైన పోటీ నెలకొననుంది . ఒకే పేరు గాళ్ ముగ్గురు యంగ్ హీరోలు ఈ పోటీలో ఉన్నారు. వాళ్లలో ఒకరు రామ్ చరణ్ కాగా మరొకరు రామ్ పోతినేని, మరొకరు కళ్యాణ్ రామ్. వీరు ముగ్గురూ తమ సినిమాల రిలీజ్ డేట్ ను ఈ దసరాకు లాక్ చేసుకున్నారు.

రామ్ చరణ్ తన ధృవను అక్టోబర్ 7 కు ఫిక్స్ చేసుకోగా, కళ్యాణ్ రామ్ తాను పూరి దర్శకత్వంలో చేస్తున్న ‘ఇజం’ సినిమాను సెప్టెంబర్ 29 కి ఫిక్స్ చేసుకున్నాడు. అలాగే రామ్ పోతినేని కూడా సంతోష్ శ్రీనివాస్ తో చేస్తున్న కొత్త సినిమా రిలీజ్ ముహుర్తాన్ని సెప్టెంబర్ కె ఫిక్స్ చేసుకున్నాడు. ఇలా ముగ్గురు యంగ్ హీరోలు దసరాకు పోటీ పడటంతో పరిశ్రమలో పాత వాతావరణం రిపీట్ అయినట్టు కనిపిస్తోయింది.