“గేమ్ ఛేంజర్” కి కూడా ఇదే రేంజ్ లో శంకర్ ఇస్తారా?

“గేమ్ ఛేంజర్” కి కూడా ఇదే రేంజ్ లో శంకర్ ఇస్తారా?

Published on May 24, 2024 8:57 AM IST


గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ (Ram Charan) హీరోగా నటిస్తున్న లేటెస్ట్ అవైటెడ్ సినిమా ఏదన్నా ఉంది అంటే అది మావెరిక్ దర్శకుడు శంకర్ కాంబినేషన్ లో చేస్తున్న సెన్సేషనల్ ప్రాజెక్ట్ “గేమ్ ఛేంజర్” కోసం అందరికీ తెలిసిందే. మరి చాలా కాలం తర్వాత శంకర్ నుంచి వస్తున్నా తన మార్క్ పొలిటికల్ అండ్ కమర్షియల్ ఎంటర్టైనర్ అంటూ ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి.

అయితే ఈ సినిమా విషయంలో మొదటి నుంచీ ఒక్క అంశంలో అందరికీ డౌట్ ఉంది. అసలు శంకర్ సినిమాలు అంటేనే భారీతనంతో కూడిన గ్రాండ్ పాటలు అందులోని ప్రతి ఆల్బమ్ కూడా ఒక చార్ట్ బస్టర్. ఇక తనకి తగ్గట్టే రెహమాన్, హరీష్ జైరాజ్ లు కూడా క్రేజీ ట్యూన్స్ అందించేవారు. మరి ఇప్పుడు గేమ్ ఛేంజర్ కి థమన్ ని అనౌన్స్ చేసిన నాటి నుంచే కొంచెం కంగారు లేకపోలేదు.

శంకర్ రేంజ్ ని థమన్ మ్యాచ్ చేస్తాడా అనే డౌట్ అందరిలో ఉంది. అయితే ఫస్ట్ సింగిల్ జరగండి వచ్చింది బాగానే ఉంది కానీ లేటెస్ట్ గా “భారతీయుడు 2” (Bharateeeyudu 2) ఫస్ట్ సింగిల్ వచ్చింది. దీనికి మన తెలుగు ఆడియెన్స్ నుంచి కూడా సాలిడ్ ఫీడ్ బ్యాక్ వస్తుండడం విశేషం. మళ్ళీ వింటేజ్ శంకర్ మార్క్ లో సాంగ్ ఉందని అంటున్నారు. మరి ఇదే తరహాలో గేమ్ ఛేంజర్ కి కూడా శంకర్ అవుట్ పుట్ రాబట్టారా లేదా అనేది ప్రశ్నగా మారింది. మరి థమన్ మిగతా పాటలు ఎలా అందించాడో వేచి చూడాలి.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు