తేజ్ ను వినాయక్ అయినా గట్టెక్కిస్తాడా ?

మెగా హీరో సాయి ధరమ్ తేజ్ గత చిత్రాలు ‘జవాన్, తిక్క, విన్నర్’ వంటి సినిమాలు బాక్సాఫీస్ వద్ద భారీ పరాజయాన్ని చవిచూశాయి. దీంతో తేజ్ అన్ని జాగ్రత్తలు తీసుకుని స్టార్ డైరెక్టర్ వివి. వినాయక్ దర్శకత్వంలో ‘ఇంటిలిజెంట్’ అనే సినిమా చేశాడు. మాస్, కామెడీ ఎంటర్టైనర్ గా రూపొందిన ఈ చిత్రం ఈ నెల 9వ్ రిలీజ్ కానుంది.

పాటలు, ట్రైలర్ ఆకట్టుకోవడం ఈ సినిమాపై ప్రేక్షకులు ఆసక్తిగా ఉన్నారు. ఇక అభిమానులైతే ‘ఖైదీ నెం 150’ లాంటి బ్లాక్ బస్టర్ తర్వాత వినాయక్ చేస్తున్న సినిమా కాబట్టి ఖచ్చితంగా బాగుంటుందని, ఈ సినిమాతో తేజ్ కెరీర్ ఇంకో మెట్టు పైకెక్కుతుందని భావిస్తున్నారు. మరి వాళ్ళ నమ్మకాలను వినాయక్, తేజ్ లు ఎంత మాత్రం నిలబెడతారో చూడాలి. సి. కళ్యాణ్ నిర్మిస్తున్న ఈ చిత్రంలో తేజ్ కు జోడీగా లావణ్య త్రిపాఠి నటించగా థమన్ సంగీతాన్ని అందించారు.