యాత్ర లేటెస్ట్ కలెక్షన్స్

Published on Feb 11, 2019 3:58 pm IST

రైతుల నేత దివంగత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి జీవిత చరిత్రతో తెరకెక్కించిన సినిమా ‘యాత్ర’. ప్రపంచవ్యాప్తంగా గత శుక్రవారం ఈ సినిమాను 970 థియేటర్లలో విడుదల చేశారు. మొత్తానికి ప్రేక్షకుల మనసును వైఎస్సార్ బయోపిక్ బాగానే గెలుచుకుంది. పైగా ఈ చిత్రానికి మంచి పాజిటివ్ టాక్ వచ్చింది.

అయితే బాక్సాఫీస్ వద్ద ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా రెండు రోజుల్లో 4.43కోట్ల షేర్ వసూళ్లను రాబట్టింది. కాగా మూడోరోజు కలెక్షన్స్ ని ఒకసారి చూద్దాం.
తమిళ, మలయాళ భాషల్లో కూడా మమ్ముట్టికి మంచి ఫ్యాన్ బేస్ ఉండటంతో అక్కడ కూడా మంచి వసూళ్లును కలెక్ట్ చేసింది.

ఏరియాల వారీగా యాత్ర కలెక్షన్ల వివరాలు :

యాత్ర సీడెడ్ లో మూడో రోజు షేర్ – 28.32 లక్షలు – ఇప్పటివరకూ అక్కడ మొత్తం కలెక్ట్ చేసిన షేర్ 95.63 లక్షలు

యాత్ర నెల్లూరులో మూడో రోజు షేర్ – 6 లక్షలు – ఇప్పటివరకూ అక్కడ మొత్తం కలెక్ట్ చేసిన షేర్ 28.75 లక్షలు

యాత్ర కృష్ణాలో మూడో రోజు షేర్ – 11,40,030 /- ఇప్పటివరకూ అక్కడ మొత్తం కలెక్ట్ చేసిన షేర్ 40,78,751/-

సంబంధిత సమాచారం :