షూటింగ్ పూర్తి చేసుకున్న ‘యాత్ర’ !

Published on Oct 31, 2018 2:53 pm IST

దివంగత నేత ఆంధ్ర ప్రదేశ్ మాజీ ముఖ్య మంత్రి వై ఎస్ రాజశేఖర్ రెడ్డి గారి జీవిత చరిత్ర తో తెరకెక్కుతున్న చిత్రం ‘యాత్ర’. ‘ఆనందో బ్రహ్మ’ ఫేమ్ మహి వి రాఘవ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈచిత్రంలో మలయాళ సూపర్ స్టార్ మమ్ముట్టి వైఎస్సార్ పాత్రలో నటించడమే కాకుండా ఆపాత్రకి ఆయనే డబ్బింగ్ చెపుతున్నారు. ప్రస్తుతం ఈ చిత్రం షూటింగ్ ను పూర్తి చేసుకొని నిర్మాణాంతర కార్యక్రమాలు జరుపుకుంటుంది.

జగపతిబాబు, సుహాసిని, రావు రమేష్, అనసూయ, సచిన్ ఖేడేకర్ ముఖ్య పాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రాన్కృష్ణ కుమార్ సంగీతం అందిస్తున్నారు. 70ఎమ్ఎమ్ ఎంటర్టైన్మెంట్స్ పతాకం ఫై విజయ్ చిల్లా, శశి దేవిరెడ్డిలు సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రం డిసెంబర్ 21న ప్రేక్షకులముందుకు రానుంది.

సంబంధిత సమాచారం :