‘ధరమ్ తేజ్’ పక్కన ఛాన్స్ కొట్టేసిన ‘వరుణ్ తేజ్’ హీరోయిన్
Published on Aug 17, 2016 3:26 pm IST

Pragya
ఒకప్పుడు సింధూరం, నిన్నే పెళ్లాడతా, మురారి వంటి సినిమాలతో స్టార్ డైరెక్టర్ గా పేరు తెచ్చుకున్న ‘కృష్ణ వంశీ’ ఈ మధ్య కాలంలో ఆ రేంజ్ హిట్ ను అందుకోలేక వెనకబడ్డ విషయం తెలిసిందే. దీంతో ప్రస్తుతం ఆయన ఎలాగైనా హిట్ కొట్టాలన్న ఉద్దేశ్యంతో యంగ్ హీరో హీరోయిన్లు ‘సందీప్ కిషన్, రెజీనా’ జంటగా ‘నక్షత్రం’ పేరుతో ఓ సినిమాను తెరకెక్కిస్తున్నారు. పేరుకు తగ్గట్టే ఈ చిత్రంలో ప్రేక్షకులను థ్రిల్ చేసే పలు అంశాలు ఉండేలా చూస్తున్నాడు కృష్ణ వంశీ.

ఇప్పటికే ఈ చిత్రంలో సుప్రీం హీరో ‘ధరమ్ తేజ్’ 20 నిముషాల పాటు పోలీస్ ఆఫీసర్ పాత్రలో కనిపించనున్నాడని చెప్పి సినిమాపై అంచనాలను పెంచిన కృష్ణ వంశీ ధరమ్ తేజ్ పక్కన హీరోయిన్ గా ‘కంచె’ సినిమాలో ‘వరుణ్ తేజ్’ సరసన మెరిసి బెస్ట్ డెబ్యూట్ హీరోయిన్ గా అవార్డు పొందిన ‘ప్రగ్యా జైస్వాల్’ నటిస్తోందని, ఆమె ఒక పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ గా కనిపిస్తుందని మరో థ్రిల్లింగ్ అంశాన్ని రివీల్ చేశాడు. అలాగే ఆమెకు, సందీప్ కిషన్ కు మధ్య ఓ సూపర్ ఫైట్ కూడా ఉందని తెలిపాడు.

 
Like us on Facebook