మెగా హీరోతో యువ దర్శకుడు !
Published on Nov 8, 2017 1:09 pm IST

నాని తో ‘నిన్ను కోరి’ సినిమాను తెరకెక్కించి మంచి విజయం అందుకున్న యువ దర్శకుడు శివ నిర్వాణం ప్రస్తుతం రెండో సినిమా స్క్రిప్ట్ పనుల్లో ఉన్నాడు. ప్రముఖ నిర్మాత డివివి దానయ్య ఈ ప్రాజెక్ట్ ను నిర్మించబోతున్నాడు. వరుణ్ తేజ్ కోసం ఈ కథను సిద్దం చేస్తున్నాడు శివ నిర్వాణం. త్వరలోనే ఈ ప్రాజెక్ట్ ను అధికారికంగా ప్రకటించబోతున్నారు.

శివ గతంలో ‘వన్ మోర్ స్మైల్’ ‘ఆల్ జిబ్రా’ షార్ట్స్ ఫిలిమ్స్ తో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. ‘నిన్ను కోరి’ సినిమాతో సూపర్ హిట్ ఇవ్వడంతో ఈ దర్శకుడికి వరుస అవకాశాలు వస్తున్నాయి. ప్రస్తుతం వరుణ్ తేజ్ వెంకి అట్లూరి దర్శకత్వంలో నటిస్తోన్న సంగతి తెలిసిందే. ఈ సినిమా తరువాత శివ సినిమా మొదలయ్యే అవకాశాలు ఉన్నాయి.

 
Like us on Facebook