మల్టీ స్టారర్ ప్లాన్ చేస్తున్న యంగ్ డైరెక్టర్ ?
Published on Oct 30, 2017 6:57 pm IST

కమర్షియల్ అంశాల్లో అతి ముఖ్యమైనది కామెడీ. ప్రస్తుతమున్న యువ దర్శకుల్లో ఆ కామెడీ అంశాన్ని విరివిగా వాడుకొని సినిమాలు చేస్తూ సక్సెస్ లు అందుకుంటున్న దర్శకుడు అనిల్ రావిపూడి. ఈయన తీసిన ‘పటాస్, సుప్రీం’ తాజగా వచ్చిన ‘రాజా ది గ్రేట్’ సినిమాలు ఆ కోవలో సక్సెస్ లు అందుకున్న సినిమాలే. అందుకే ఈ దర్శకుడికి డిమాండ్ భారీగా పెరిగింది.

ప్రముఖ నిర్మాత దిల్ రాజు మరోసారి ఆయనతో సినిమా చేసేందుకు సిద్దమవుతున్నాడు. అది కూడా మల్టీ స్టారర్ కావడం విశేషం. ప్రస్తుతం స్క్రిప్ట్ పనుల్లో ఉన్న ఈ ప్రాజెక్టులో హీరోలు ఎవరనేది ఇంకా బయటకు రాలేదు. అయితే ఈ చిత్రం కూడా ఫుల్ లెంగ్త్ ఎంటర్టైనర్ గా ఉంటుందని మాత్రం తెలుస్తోంది. మరి ఇంత సీక్రెట్ గా జరుగుతున్న ఈ ప్రాజెక్ట్ ఎలా ఉంటుందో, నటీనటులెవరో తెలియాలంటే ఇంకొన్నాళ్ళు ఆగాల్సిందే.

 
Like us on Facebook