డబ్బింగ్ కార్యక్రమాలు పూర్తిచేసిన యువ హీరో !

డబ్బింగ్ కార్యక్రమాలు పూర్తిచేసిన యువ హీరో !

Published on Feb 8, 2018 12:41 PM IST

రాహుల్‌ రవీంద్రన్‌ డైరెక్టర్‌గా మారి చేస్తోన్న సినిమా ‘చి౹౹ల౹౹సౌ౹౹’ (చిరంజీవి లక్ష్మీ సౌభాగ్యవతి). సుశాంత్ హీరోగా నటిస్తోన్న ఈ సినిమా షూటింగ్ పూర్తయ్యింది. ఈ ఏడాది వేసవిలో ఈ చిత్రం విడుదలకానుంది. ఇటీవల డబ్బింగ్ కార్యక్రమాలు మొదలుపెట్టిన హీరో సుశాంత్ ఈరోజుటితో వాటిని పూర్తిచేసాడు.

తేజ్‌వీర్ నాయుడు స‌మ‌ర్ప‌ణ‌లో తెరకెక్కుతున్న ఈ చిత్రానికి భరత్ కుమార్ మలశాల, హరి పులిజల, జస్వంత్ నాడిపల్లి నిర్మాత‌లుగా వ్యవహరిస్తున్నారు. లవ్ స్టోరీగా తెరకెక్కుతున్న ఈ సినిమాకు ఎం.సుకుమార్ సినిమాటోగ్రఫి అందిస్తున్నాడు. ప్రశాంత్ విహారి స్వరాలు సమకూరుస్తున్నాడు. పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటున్న ఈ సినిమా ఫస్ట్ లుక్, రిలీజ్ డేట్ త్వరలో అనౌన్స్ చెయ్యనున్నారు. హరీష్ కోయిల గుండ్ల ఎగ్జిక్యూటీవ్ ప్రొడ్యూసర్ గా వ్యవహరిస్తోన్న ఈ సినిమాకు చోటా కె ప్రసాద్ ఎడిటర్.

తాజా వార్తలు

వీక్షకులు మెచ్చిన వార్తలు