బాలయ్య సినిమా పై లేటెస్ట్ అప్ డేట్

బాలయ్య సినిమా పై లేటెస్ట్ అప్ డేట్

Published on Apr 15, 2024 8:05 AM IST

నందమూరి బాలకృష్ణ, దర్శకుడు బాబీ కాంబినేషన్‌ లో ఓ సినిమా రాబోతున్న సంగతి తెలిసిందే. ఈ మూవీపై ఇప్పటికే భారీ అంచనాలున్నాయి. ఈ క్రమంలో ఓ యంగ్ హీరో కూడా ఈ సినిమాలో నటించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఈ పాత్ర నెగిటివ్ షేడ్స్ తో ఉంటుందని టాక్. ఈ పాత్రను దర్శకుడు బాబీ చాలా ప్రత్యేకంగా డిజైన్ చేశాడట. మలయాళ నటుడు షైన్ టామ్ చాకోకి తమ్ముడి పాత్ర అట ఇది. మరి ఈ పాత్రలో నటించే ఆ యంగ్ హీరో ఎవరు అనేది తెలియాల్సి ఉంది.

ఇక ఈ సినిమాలోని యాక్షన్ విజువల్స్ కూడా వండర్ ఫుల్ గా ఉంటాయట. ముఖ్యంగా బాలయ్య గెటప్ అండ్ సెటప్ చాలా థ్రిల్లింగ్ గా ఉంటుందట. కాగా ఈ చిత్రంలో ఊర్వశి రౌటేలా, బాబీ డియోల్, చాందిని చౌదరి మరియు ఇతరులు ముఖ్యమైన పాత్రల్లో నటిస్తున్నారు. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌ పతాకంపై నాగ వంశీ, ఫార్చూన్‌ఫోర్ సినిమాపై సాయి సౌజన్య నిర్మిస్తున్న ఈ చిత్రానికి థమన్ సంగీతం అందిస్తున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు