మర్చి 16 నుండి యంగ్ హీరో మొదటి షెడ్యూల్ !
Published on Mar 4, 2018 6:06 pm IST

నితిన్ శ్రీనివాస కళ్యాణం సినిమా ఈరోజు పూజా కార్యక్రమాలతో ప్రారంభం అయ్యింది. దిల్ రాజు నిర్మిస్తోన్న ఈ సినిమాను సతీష్ వేగ్నేష్ దర్శకత్వం వహించబోతున్నాడు. రాజేంద్ర ప్రసాద్, ప్రకాష్ రాజ్ ఈ సినిమాలో ముఖ్య పాత్రల్లో కనిపించబోతున్నారు. రాశిఖాన్న , నందిత శ్వేతా ఈ సినిమాలో హీరోయిన్స్. సమీర్ రెడ్డి సినిమాటోగ్రఫి అందిస్తోన్న ఈ సినిమా మర్చి 16 నుండి రెగ్యులర్ షూటింగ్ జరుపుకోబోతోంది.

మిక్కి జె మేయర్ ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నాడు. జులై చివరికంత షూటింగ్ పూర్తి చేసి ఆగుస్ట్ మొదటివారంలో సినిమాను విడుదల చేసే ఆలోచనలో చిత్ర యూనిట్ ఉన్నారు. ఫ్యామిలి ఎంటర్టైనర్ గా తెరకేక్కబోతున్న ఈ సినిమాకు సంభందించిన మోషన్ పోస్టర్ ఈరోజు విడుదల చెయ్యడం జరిగింది. రాశిఖాన్న, నితిన్ భార్య భర్తలుగా ఆకట్టుకున్నారు.

 
Like us on Facebook