యాత్ర లో అతిధి పాత్రలో కనిపించనున్న వై ఎస్ జగన్ !

Published on Jan 20, 2019 5:31 pm IST

లెజండరీ పొలిటీషియన్ ,ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి జీవితం ఆధారంగా తెరకెక్కుతున్న చిత్రం యాత్ర. షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం విడుదలకు సిద్దమతుంది. మహి వి రాఘవ్ తెరకెక్కిస్తున్న ఈ చిత్రంలో మలయాళ మెగాస్టార్ మమ్ముట్టి ప్రధాన పాత్రలో నటించారు. అంతేకాకుండా స్వయంగా ఆయనే డబ్బింగ్ చెప్పారు.

ఇక ఈ చిత్రంలో వై ఎస్ రాజశేఖర్ రెడ్డి తనయుడు వైఎస్సార్ పార్టీ అధ్యక్షుడు జగన్ మోహన్ రెడ్డి అతిధి పాత్రలో కనిపించనున్నారు. ఆయన తెర ఫై కూడా నిజ జీవిత పాత్ర లోనే కనిపించనున్నారు. ఇక ఇంతకుముందు జగన్ పాత్రకు సూర్య , కార్తీ , విజయ్ దేవరకొండ ఇలా చాలానే పేర్లు తెర మీదకు వచ్చాయి కానీ ఆ పాత్రలో జగన్ నే చూపించడానికి చిత్ర బృందం మొగ్గు చూపారు.

జగపతి బాబు , అనసూయ , సుహాసిని , ఆశ్రిత ముఖ్య పాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రాన్ని 70ఎమ్ఎమ్ ఎంటర్టైన్మెంట్స్ పతాకంఫై విజయ్ చిల్లా, శశి దేవిరెడ్డిలు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఇక ఈ చిత్రం ఫిబ్రవరి 8న తెలుగు తోపాటు తమిళ , మలయాళ భాషల్లో కూడా విడుదలకానుంది. మమ్ముట్టి కి మళయాలం తో పాటు కోలీవుడ్ లోను మంచి ఫాలోయింగ్ వుండండడంతో ఈ చిత్రం అక్కడ కూడా మంచి వసూళ్లను రాబట్టే అవకాశాలు వున్నాయి.

సంబంధిత సమాచారం :

X
More