మిస్టర్ మజ్ను కూడా ఆ ఛానల్ చేతికే !

Published on Dec 9, 2018 5:29 pm IST

అఖిల్ అక్కినేని నటిస్తున్న మూడవ చిత్రం ‘మిస్టర్ మజ్ను’ యొక్క శాటిలైట్ మరియు డిజిటల్ రైట్స్ మంచి ధరకు అమ్ముడయ్యాయి. ప్రముఖ టెలివిజన్ ఛానల్ జీ తెలుగు మరియు జీ 5 ఈ హక్కులను 5కోట్లకు దక్కించుకున్నాయి. ఇక ఇంతకుముందు అఖిల్ నటించిన ‘అఖిల్, హలో’ చిత్రాల శాటిలైట్ హక్కులు కూడా ఈ ఛానలే దక్కించుకుంది.

‘తొలిప్రేమ’ ఫేమ్ వెంకీ అట్లూరి తెరకెక్కిస్తున్న ఈ ‘మిస్టర్ మజ్ను’ ఫై మంచి అంచనాలే వున్నాయి. ఇక మొదటి రెండు సినిమాలు నిరాశపరచడం తో ఈ యూత్ ఫుల్ ఎంటర్టైనర్ ఫై అఖిల్ భారీ ఆశలే పెట్టుకున్నాడు. అతి త్వరలోనే ఈ చిత్రం నుండి అప్ డేట్స్ వెలుబడనున్నాయి.

సంబంధిత సమాచారం :