“ఓదెల2” సెకండ్ షెడ్యూల్ షురూ…శివ శక్తిగా తమన్నా మేకింగ్ వీడియో రిలీజ్!


సూపర్‌హిట్ OTT చిత్రం ఓదెల రైల్వే స్టేషన్‌కి సీక్వెల్ అయిన ఓదెల 2 చిత్రం ను కాశీలో ప్రకటించారు మేకర్స్. అశోక్ తేజ దర్శకత్వంలో సంపత్ నంది రూపొందించిన ఈ చిత్రాన్ని మధు క్రియేషన్స్, సంపత్ నంది టీమ్‌వర్క్స్ బ్యానర్‌లపై డి మధు నిర్మిస్తున్నారు. మహా శివరాత్రి సందర్భంగా తమన్నా శివశక్తి పాత్రలో నటిస్తున్న చిత్రం యొక్క ఫస్ట్ లుక్ పోస్టర్‌ను మేకర్స్ రిలీజ్ చేయగా, చాలా మంచి స్పందన లభించింది.

తమన్నా పాత్రకి సంబందించిన వీడియో ను మేకర్స్ రిలీజ్ చేశారు. ఈ మేకింగ్ వీడియో చాలా బాగుంది. ఎలక్ట్రిఫైయింగ్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ తో ఆకట్టుకుంటుంది. అంతేకాక ఈ చిత్రం కి సంబందించిన సెకండ్ షెడ్యూల్ స్టార్ట్ అయినట్లు వీడియో లో మేకర్స్ వెల్లడించారు. సౌందర్ రాజన్ ఎస్ కెమెరామెన్ గా వ్యవహరిస్తుండగా, కాంతార ఫేమ్ అజనీష్ లోక్ నాథ్ సంగీతం అందిస్తున్నారు. రాజీవ్ నాయర్ ఆర్ట్ డైరెక్టర్. తమన్నా భాటియా, హెబ్బా పటేల్, వశిష్ట ఎన్ సింహ, యువ, నాగ మహేష్, వంశీ, గగన్ విహారి, సురేందర్ రెడ్డి, భూపాల్, మరియు పూజా రెడ్డి లు నటిస్తున్న ఈ చిత్రం పై ప్రేక్షకుల్లో ఆసక్తి నెలకొంది.

వీడియో కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి

ఈ ఓటిటి ప్లాట్ ఫామ్ లో “ఆపరేషన్ వాలెంటైన్” హిందీ వెర్షన్


విజయాపజయాలుతో సంబంధం లేకుండా ఎప్పుడు కొత్త ప్రయత్నం చేస్తూ వస్తున్నా మెగా యంగ్ హీరో వరుణ్ తేజ్ హీరోగా బాలీవుడ్ నటి మానుషీ చిల్లర్ టాలీవుడ్ కి డెబ్యూ ఇస్తూ చేసిన లేటెస్ట్ సినిమానే “ఆపరేషన్ వాలెంటైన్”. దర్శకుడు శక్తి ప్రతాప్ సింగ్ వాయు దళ నేపథ్యంలో తెరకెక్కించిన ఈ చిత్రం తెలుగు సహా హిందీలో థియేట్రికల్ గా ప్లాన్ చేశారు. అయితే ఈ సినిమా అనుకున్న రేంజ్ లో విజయాన్ని అందుకోలేదు.

మరి అలానే ఓటిటిలో మొదటగా తెలుగులో స్ట్రీమింగ్ కి వచ్చిన ఈ చిత్రం ఇప్పుడు హిందీలో కూడా ఫైనల్ గా అందుబాటులోకి వచ్చేసింది. ఈ సినిమా ఈరోజు నుంచి తెలుగు, తమిళ్ లో ప్రసారం అవుతున్న అమెజాన్ ప్రైమ్ వీడియో లోనే స్ట్రీమింగ్ కి వచ్చింది. మరి నార్త్ ఆడియెన్స్ ఈ సినిమా చూసి ఏమంటారో చూడాలి. ఇక ఈ చిత్రానికి మిక్కీ జే మేయర్ సంగీతం అందించగా సందీప్ ముద్ద సోనీ పిక్చర్స్ వారు నిర్మాణం వహించారు.

టీవీ ప్రీమియర్ కి డేట్ ఫిక్స్ చేసుకున్న “అంబాజీపేట మ్యారేజి బ్యాండు”


టాలెంటెడ్ యాక్టర్ సుహాస్ ప్రధాన పాత్రలో, డైరెక్టర్ దుష్యంత్ కటికనేని దర్శకత్వం లో తెరకెక్కిన చిత్రం అంబాజీపేట మ్యారేజి బ్యాండు. ఈ చిత్రం ఫిబ్రవరి నెలలో థియేటర్ల లో రిలీజ్ అయ్యి ప్రేక్షకులను విశేషం గా ఆకట్టుకుంది. బాక్సాఫీస్ వద్ద కూడా మంచి వసూళ్లను రాబట్టిన ఈ సినిమా, డిజిటల్ ప్రీమియర్ గా కూడా మంచి రెస్పాన్స్ ను సొంతం చేసుకుంది. ఇప్పుడు ఈ సినిమా వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్ కి రెడీ అయిపోయింది.

ఈ చిత్రం యొక్క శాటిలైట్ హక్కులను ను ప్రముఖ టీవీ ఛానల్ అయిన స్టార్ మా సొంతం చేసుకున్న సంగతి అందరికీ తెలిసిందే. స్టార్ మా లో ఈ చిత్రం ఏప్రిల్ 28, 2024 న మధ్యాహ్నం 1:00 గంటలకు ప్రసారం కానుంది. శివాని నాగారం, శరణ్య ప్రదీప్, గోపరాజు రమణ కీలక పాత్రల్లో నటించిన ఈ చిత్రానికి శేఖర్ చంద్ర సంగీతం అందించారు. బుల్లితెర పై ఈ చిత్రం ఎలాంటి రెస్పాన్స్ ను సొంతం చేసుకుంటుందో చూడాలి.

దళపతి 69 : ఒకవేళ ఇలా అయితే ఇండియా లోనే సెన్సేషనల్ మల్టీస్టారర్


ఇళయ దళపతి విజయ్ హీరోగా మీనాక్షి చౌదరి (Meenakshi Chaudhary) హీరోయిన్ గా దర్శకుడు వెంకట్ ప్రభు కాంబినేషన్ లో చేస్తున్న భారీ చిత్రం “ది గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైం” అనే సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. మరి ఈ సినిమా విజయ్ కెరీర్ లో 68వ సినిమాగా వస్తుండగా ఈ సినిమా తర్వాత విజయ్ మరొక్క సినిమా మాత్రం చేసి సినిమాలకి స్వస్తి చెప్పనున్నాడు అని కన్ఫర్మ్ చేసాడు.

అయితే ఇది విజయ్ కెరీర్ లో 69వ సినిమా కోసం పెద్ద సస్పెన్స్ నెలకొనగా ఈ సినిమాని ఎవరు డైరెక్ట్ చేస్తారు అనేది ప్రశ్నగా మారింది. అయితే ఈ ప్రాజెక్ట్ విషయంలో విజయ్ తో “బీస్ట్”, రజినీతో “జైలర్” సినిమాలు చేసిన దర్శకుడు నెల్సన్ దిలీప్ కుమార్ చేసిన లేటెస్ట్ స్టేట్మెంట్ ఇప్పుడు కేజ్రీగా మారింది.

తనకి కానీ విజయ్ 69వ సినిమా (Thalapathy 69) చేసే ఛాన్స్ వస్తే సూపర్ స్టార్ మహేష్ బాబు (Mahesh Babu), బాలీవుడ్ నుంచి షారుఖ్ ఖాన్ (Shah Rukh Khan) అలాగే మళయాళం నుంచి మమ్ముట్టి (Mammootty) లని విజయ్ తో ఆ సినిమాలో చూపిస్తానని చెప్పుకొచ్చాడు. దీనితో ఈ కాంబినేషన్ కానీ పడితే మాత్రం ఇండియా లోనే ఒక సెన్సేషనల్ మల్టీ స్టారర్ అవుతుంది అని చెప్పాలి. మరి ఈ ప్రాజెక్ట్ విషయంలో ఏమవుతుందో అనేది మాత్రం కాలమే నిర్ణయించాయి.

ఓటిటిలో స్ట్రీమింగ్ కి వచ్చేసిన ‘కోటబొమ్మాళి పీఎస్’ ఒరిజినల్ వెర్షన్

ప్రస్తుతం సౌత్ ఇండియా సినిమా దగ్గర మళయాళ సినిమాలు ఏ రేంజ్ లో ఆకట్టుకుంటున్నాయో చూస్తూనే ఉన్నాం. అయితే ఎప్పుడు నుంచో సాలిడ్ కంటెంట్ తో అదరగొడుతూ వస్తున్నా మళయాళ సినిమా ఇప్పుడు బాక్సాఫీస్ పరంగా కూడా పికప్ అవ్వడం స్టార్ట్ చేసింది. అలా ఉన్న కొన్ని సూపర్ హిట్ చిత్రాల్లో “నాయట్టు” కూడా ఒకటి.

వెర్సటైల్ నటుడు జోజు జార్జ్ ప్రధాన పాత్రలో నటించిన ఈ చిత్రాన్ని తెలుగులో తేజ మార్ని దర్శకత్వంలో శ్రీకాంత్, శివాని రాజశేఖర్, రాహుల్ విజయ్ లు “కోటబొమ్మాళి పీఎస్” గా రీమేక్ చేసి తెలుగులో కూడా హిట్ అందుకున్నారు.

అయితే దీని ఒరిజినల్ వెర్షన్ నాయట్టు ఈరోజు నుంచి తెలుగులో “చుండూరు పోలీస్ స్టేషన్” గా అందుబాటులోకి వచ్చేసింది. మన తెలుగు స్ట్రీమింగ్ యాప్ ఆహా లో ఈ సినిమా రిలీజ్ కి వచ్చింది. మరి ఈ ఒరిజినల్ వెర్షన్ ని చూడాలి అనుకునేవారు ఆహాలో ఇప్పుడు ట్రై చేయవచ్చు.

అధునాతన టెక్నాలజీతో శ్రీ సారథీ స్టూడియోస్!

హైదరాబాద్ లో తెలుగు సినిమాకు ఐకాన్ గా, ఇంకా చెప్పాలంటే మొట్ట మొదటి స్టూడియోగా శ్రీ సారథీ స్టూడియోస్ కు ఓ ప్రత్యేక గుర్తింపు ఉంది. అలనాటి సినిమాలు మొదలుకుని, నేటి సినిమాల వరకు ఎన్నెన్నో సినిమాలు ఇక్కడ షూటింగ్ జరుపుకున్నవే. మారుతున్న కాలానికి తగట్టు అధునాతన టెక్నాలజీతో అన్ని రకాల హంగులతో, ఈ స్టూడియోస్ ను తీర్చిదిద్దారు. ఈ నేపథ్యంలో తెలుగు రాష్ట్రాలలోనే అధునాతన డాల్బీ మిక్సింగ్, సౌండ్ డిజైన్ స్టూడియోలను శ్రీ సారథీ స్టూడియోస్ ప్రారంభించింది. కాగా శుక్రవారం ఆహ్లాదభరిత వాతావరణంలో పలువురు సినీ ప్రముఖుల సమక్షంలో ఈ స్టూడియోలో జరిగిన కార్యక్రమంలో డాల్బీ మిక్సింగ్ స్టూడియోను ప్రముఖ సినీ సంగీత దర్శకుడు ఎం.ఎం.కీరవాణి ప్రారంభించగా, సౌండ్ డిజైన్ స్టూడియోను ప్రముఖ సినీ సంగీత దర్శకుడు శేఖర్ చంద్ర ప్రారంబించారు.

ఈ సందర్భంగా శ్రీ సారథీ స్టూడియోస్ చైర్మన్ ఎం.ఎస్ ఆర్.వి. ప్రసాద్ మాట్లాడుతూ, “లోగడ ఈ స్టూడియోని మల్టీఫ్లెక్స్ థియేటర్స్ గా మార్చాలన్న ఆలోచన చేసి, ఆ తర్వాత విరమించుకున్నాం. సినీ స్టూడియోస్ గానే కొనసాగించాలని నిర్ణయించుకున్న అనంతరం షూటింగులకు కావలసిన అన్ని రకాల హంగులు, అలాగే నేటి కాలానికి పోటీపడేవిధంగా పోస్ట్ ప్రొడక్షన్స్ కు కావలసిన అధునాతన టెక్నాలజీని మా స్టూడియోలో అందుబాటులోకి తీసుకునివచ్చాం. మేము ఈ రోజు ఆరంభించిన డాల్బీ మిక్సింగ్, సౌండ్ డిజైన్ లు చాలా చాలా అధునాతనమైనవి. ఈ టెక్నాలజీని ఉపయోగించుకుంటూ మా స్టూడియోలో మొదలైన మొదటి సినిమా యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న క్రేజీ సినిమా కల్కి అని చెప్పడానికి ఎంతో సంతోషిస్తున్నాం” అని అన్నారు.

శ్రీ సారథీ స్టూడియోస్ డైరెక్టర్ కె.వి.రావు మాట్లాడుతూ, మా స్టూడియోలో షూటింగ్ ప్రారంభిస్తే,, పోస్ట్ ప్రొడక్షన్స్ తో సహా సినిమా మొదటి కాపీని సిద్ధం చేసుకునేంతవరకు కావలసిన ఎక్విప్ మెంట్ అంతా ఉందని అన్నారు. సినిమా అనగానే సౌండింగ్ కు ఉన్న ప్రాధాన్యం అంతా ఇంతా కాదు. అందుకే అధునాతన టెక్నాలజీని మేము ప్రవేశపెట్టామని చెప్పారు.
ఈ కార్యక్రమంలో ప్రముఖ నిర్మాతలు కె.ఎస్.రామారావు, కె.ఎల్.నారాయణ, రచయిత విజయేంద్రప్రసాద్, తెలుగు ఫిలిం ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ ప్రెసిడెంట్ దామోదర్ ప్రసాద్, సంగీత దర్శకుడు భీమ్స్, స్టూడియో జనరల్ మేనేజర్ బాలచంద్ర, ఇంకా పలువురు సినీ ప్రముఖులు, మీడియా ప్రముఖులు పాల్గొని, స్టూడియో యాజమాన్యానికి అభినందనలు తెలియజేశారు.

ఓటిటి రిలీజ్ డేట్ ఫిక్స్ చేసుకున్న నిద్రమత్తు డ్రామా “డియర్”


రీసెంట్ గా కోలీవుడ్ సినిమా దగ్గర రిలీజ్ కి వచ్చిన చిత్రాల్లో టాలెంటెడ్ సంగీత దర్శకుడు అలాగే హీరోగా కూడా చేసిన లేటెస్ట్ చిత్రం “డియర్” కూడా ఒకటి, టాలెంటెడ్ హీరోయిన్ ఐశ్వర్య రాజేష్ హీరోయిన్ గా దర్శకుడు ఆనంద్ రవిచంద్రన్ తెరకెక్కించిన ఈ చిత్రం నిద్ర సంబంధించిన సినిమాగా వచ్చింది. మరి తమిళ్ సహా తెలుగులో కూడా రిలీజ్ కి వచ్చిన ఈ చిత్రం పెద్దగా పెర్ఫామ్ చేయలేదు.

అయితే ఇప్పుడు ఈ సినిమా ఓటిటి రిలీజ్ డేట్ ని ఫిక్స్ చేసుకుంది. ఈ సినిమా స్ట్రీమింగ్ హక్కులు నెట్ ఫ్లిక్స్ సొంతం చేసుకోగా అందులో ఈ ఏప్రిల్ 28 నుంచి స్ట్రీమింగ్ కి ఫిక్స్ అయ్యింది. మరి తమిళ్, తెలుగు రెండు భాషల్లో వస్తుందా లేదా అనేది ఇంకా కన్ఫర్మ్ కాలేదు. ఇక ఈ చిత్రానికి జివి ప్రకాష్ నే సంగీతం అందించగా వరుణ్ త్రిపురనేని, అభిషేక్ రామిశెట్టి, జి పృథ్వీరాజ్ లు నిర్మాణం వహించారు.

జైపూర్ ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్ ఆధ్వర్యంలో ఇంటర్నేషనల్ టార్చ్ కాంపెయిన్ ప్రారంభం

సినిమాకు ఎల్లలు, హద్దులు లేవని తెలుగు సినిమాతో పాటు భారతీయ సినిమా, అలాగే ప్రపంచ సినిమాను ప్రోత్సహించడానికి,
జైపూర్ ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్ సంస్థ ఫౌండర్ డైరెక్టర్ హను రోజ్ విశేషంగా కృషి చేస్తున్నారని పలువురు వక్తలు కొనియాడారు. గురువారం (25th) సాయంత్రం హైదరాబాడ్ లోని ప్రసాద్ మల్టీఫ్లెక్స్ లో ఆ సంస్థ నిర్వహించిన కార్యక్రమంలో తెలుగు సినిమాతో పాటు, ఇండియన్ ప్రపంచ సినిమాలకు మరింత ప్రచారం, మార్కెటింగ్ కల్పించడం కోసం ఆ సంస్థ ఇంటర్నేషనల్ టార్చ్ కాంపెయిన్ ను ప్రారంభించింది. దీనికి వేదికతో పాటు హోస్ట్ గా ప్రసాద్ మల్టీఫ్లెక్స్ సహకారాన్ని అందించింది.

పలువురు సినీ ప్రముఖులు పాల్గొన్న ఈ కార్యక్రమంలో జ్యోతి ప్రజ్వలనతో ఇంటర్నేషనల్ టార్చ్ కాంపెయిన్ ను ప్రారంబించారు. ముందుగా జైపూర్ ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్ ఫౌండర్ డైరెక్టర్ హను రోజ్ మాట్లాడుతూ, “2009వ సంవత్సరం నుంచి మేము మా సంస్థ తరపున రెగ్యులర్ గా ఫిలిం ఫెస్టివల్స్ ను దేశవిదేశాలలో నిర్వహిస్తూ, అవార్డులను అందజేస్తూ వస్తున్నాం. జాతీయ, అంతర్జాతీయ సినిమాను ప్రమోషన్ చేయడానికి ఎంతో కృషి చేస్తున్నాం. ఇందుకు ప్రభుత్వం కూడా మాకెంతో సహకరించింది. ప్రపంచస్థాయిలో చాలా పెద్ద సినిమా లైబ్రరీని ఏర్పాటు చేశాం. దానిని నేటితరం, భవిష్యత్ తరం ఉపయోగించుకునే విధంగా తీర్చిదిద్దుతున్నాం. ఈ టార్చ్ కాంపెయిన్ ను ప్రపంచ సినిమా స్థాయిలో నిలబడిన తెలుగు సినిమా కేంద్రం అయిన హైదరాబాద్ లో తొలుత ప్రారంభించడం ఆనందంగా ఉంది” అని అన్నారు

అతిథిగా విచ్చేసిన తెలుగు ఫిలిం ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ ప్రెసిడెంట్ దామోదర్ ప్రసాద్ మాట్లాడుతూ, “సినిమా మీద ఎనలేని ప్రేమతో ప్రపంచ సినిమాను ఒక్కటి చేస్తున్న హను రోజ్ ఒక వ్యక్తి కాదు ఒక శక్తి. ఆయన చేస్తున్న అవిరళ కృషి మరపురానిది. ఈ రోజు ఇంటర్నేషనల్ టార్చ్ కాంపెయిన్ ను ఆయన హైదరాబాద్ లో మొదలు పెట్టడం అభినందనీయం” అని అన్నారు.

మరో అతిథి గా పాల్గొన్న తెలుగు ఫిలిం ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ జనరల్ సెక్రటరీ టి.ప్రసన్నకుమార్ మాట్లాడుతూ, “తెలుగు సినిమా ఎప్పుడో పాత తరం సినిమాల నుంచి ప్రపంచస్థాయికి ఎదిగింది. నేటి సినిమాలే కాదు అప్పట్లో తీసిన పాతాళ భైరవి, చండీరాణి, మోసగాళ్లకు మోసగాడు వంటి తెలుగు సినిమాలు ప్రపంచస్థాయిలో పేరు సంపాదించుకున్నాయి. ఎన్ఠీఆర్ సీఎంగా ఉన్న రోజులలో హైదరాబాద్ లో ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్ నిర్వహించి, తెలుగు సినిమా ఖ్యాతిని ప్రపంచానికి చాటారు. తెలుగు రెండు రాష్ట్ర ప్రభుత్వాలు నంది అవార్డులు ఇవ్వడం లేదు. ముందు ముందు అయినా ఇస్తాయని ఆశిస్తున్నాం” అని అన్నారు.

ఈ కార్యక్రమానికి సీనియర్ ఫిలిం జర్నలిస్ట్ ప్రభు వ్యాఖ్యాతగా వ్యవహరించగా, ఇంకా నిర్మాతలు లక్ష్మణరేఖ గోపాలకృష్ణ, నాగులపల్లి పద్మిని, ఎమ్మెస్ ప్రసాద్, రామ్ కిషోర్ ,,వై.అనిల్, సీనియర్ జర్నలిస్ట్ ఉమామహేశ్వర రావు తదితరులు పాల్గొన్నారు.

మెగా హీరోతో “హను మాన్” మేకర్స్ సాలిడ్ ప్రాజెక్ట్?


ప్రస్తుతం టాలీవుడ్ లో సూపర్ సక్సెస్ అయ్యిన నిర్మాణ సంస్థ ప్రైమ్ షో ఎంటర్టైన్మెంట్స్. తమ తాజా చిత్రం “హను మాన్” తో ఒక ఊహించని పాన్ ఇండియా విజయాన్ని తాము అందుకోగా ఇప్పుడు తమ నుంచి మరిన్ని ఆసక్తికరమైన సినిమాలు ఒకొకటి సిద్ధం చేస్తున్నారు. అయితే ఈ లైనప్ లో ఓ మెగా యంగ్ హీరోతో సినిమా ఓకే చేసినట్టుగా ఇప్పుడు బజ్ వినిపిస్తోంది. మరి దీని ప్రకారం హను మాన్ మేకర్స్ సుప్రీం హీరో సాయి ధరమ్ తేజ్ తో ఓ క్రేజీ ప్రాజెక్ట్ ని లాక్ చేసారని వినిపిస్తోంది.

ఈ సినిమాని కొత్త దర్శకుడు టేకాఫ్ చేయనుండగా ఇదొక పీరియాడిక్ జానర్ లో ఉండబోతుంది అని తెలుస్తోంది. దాదాపు 1940ల దశకంలో సినిమా ఉంటుంది అని టాక్. మరి ఈ తరహా కాన్సెప్ట్ లో తేజు చేసింది లేదు. మరి చూడాలి ఈ సాలిడ్ ప్రాజెక్ట్ ఎలా ఉంటుంది అనేది. ఇక ప్రస్తుతం విరుపాక్ష, బ్రో సినిమాలతో హిట్స్ అందుకున్న తేజు గాంజా శంకర్ సినిమాలో బిజీగా ఉన్నాడు. మరి హను మాన్ మేకర్స్ తో ప్రాజెక్ట్ సంబంధించి మరిన్ని వివరాలు బయటకు రావాల్సి ఉంది.

ప్రతాని రామకృష్ణగౌడ్‌ స్వీయ దర్శకత్వంలో “ధీక్ష” ప్రారంభం

ఆర్‌.కె. ఫిలింస్‌, స్నిగ్ధ క్రియేషన్స్‌ బ్యానర్స్‌పై ప్రముఖ దర్శకనిర్మాత, తెలంగాణ ఫిలిమ్‌ ఛాంబర్‌ అధ్యక్షుడు ప్రతాని రామకృష్ణగౌడ్‌ స్వీయ దర్శకత్వంలో రూపొందిస్తున్న చిత్రం ధీక్ష. పినిశెట్టి అశోక్‌ కుమార్‌ సహ నిర్మాత కాగా, పూర్ణ వెంకటేష్‌ కో`ప్రొడ్యూసర్‌. కిరణ్‌కుమార్‌, భవ్యశ్రీ జంటగా నటిస్తున్న ఈ చిత్రం శుక్రవారం హైదరాబాద్లోని ఫిలిం ఛాంబర్‌లో పూజా కార్యక్రమాలతో ఘనంగా ప్రారంభమైంది. ఈ కార్యక్రమానికి సిద్ధిపేట జిల్లా కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షులు, మాజీ ఎమ్మెల్యే తూముకుంట నర్సారెడ్డి, బ్రహ్మంగారి ఉపాసకులు బ్రహ్మశ్రీ డా. యోగానంద కృష్ణమాచార్య ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ముహూర్తపు షాట్‌కు ఆర్‌.కె. గౌడ్‌ క్లాప్‌ను ఇవ్వగా, తూముకుంట నర్సారెడ్డి కెమెరా స్విచ్ఛాన్‌ చేశారు. డా. యోగానంద కృష్ణమాచార్య తొలిషాట్‌కు దర్శకత్వం వహించారు. జెవిఆర్‌ & గురురాజ్‌లు స్క్రిప్ట్‌ను అందించారు.

ఈ సందర్భంగా జరిగిన పాత్రికేయుల సమావేశంలో బ్రహ్మశ్రీ డా. యోగానంద కృష్ణమాచార్య మాట్లాడుతూ, “ఆర్కే గౌడ్‌ గారితో నాకు మంచి పరిచయం ఉంది. ఈరోజు చాలా మంచి రోజు ఈ సందర్భంగా ప్రారంభోత్సవం జరుపుకున్న ధీక్ష చిత్రం ఖచ్చితంగా మంచి విజయం సాధిస్తుంది. ఈ చిత్రం రామకృష్ణగౌడ్‌ గారికి, నటీనటులు, టెక్నీషియన్‌లకు మంచి పేరు తీసుకు వస్తుంది” అని అన్నారు.

ఆర్‌.కె.గౌడ్‌ మాట్లాడుతూ, “ఇటీవల దర్శకత్వం వహించడంలో నేను కొంత గ్యాప్‌ తీసుకున్నాను. మంచి కథ కుదరడంతో మళ్లీ ఈ చిత్రం ద్వారా దర్శక, నిర్మాతగా మీ ముందుకు వస్తున్నాను. మమ్మల్ని ఆశీర్వదించటానికి విచ్చేసిన నర్సారెడ్డి గారికి, యోగానందకృష్ణమాచార్యులు గారికి, ఇతర మిత్రులు, శ్రేయోభిలాషులకు నా ధన్యవాదాలు. ధీక్ష మంచి కథాబలం ఉన్న సినిమా. అవార్డులు కూడా గెలుచుకునే అవకాశం ఉన్న కథ. మే 1వ తేదీ నుంచి షూటింగ్‌ జరుగుతుంది. హైదరాబాద్‌తో పాటు దుబాయ్‌లో కూడా ఒక షెడ్యూల్‌ ఉంటుంది. దీక్ష, పట్టుదలతో ఏపని చేసినా తప్పకుండా సక్సెస్‌ అవుతుంది. ఇది ప్రతి మనిషి విషయంలోనూ జరిగేదే. ఈ విషయాన్ని బేస్‌గా తీసుకుని ఈ సినిమా చేస్తున్నాం. ప్రతి మగాడి విజయం వెనకాల ఒక ఆడది ఉంటుంది అంటారు. అలాగే ఒక ఆడదాని విజయం వెనకాల కూడా ఒక మగాడు ఉంటాడు. పాటల రికార్డింగ్‌ కూడా పూర్తయ్యింది. ఈ సినిమా తర్వాత స్పోర్ట్స్‌ బ్యాక్‌గ్రౌండ్‌లో మరో సినిమా చేయబోతున్నా. అందులో హీరో తేజ నెగెటివ్‌ రోల్‌ చేస్తున్నారు. సాంగ్స్‌ కూడా కంప్లీట్‌ అయ్యాయి. మంచి క్వాలిటీతో ఎక్కడా కాంప్రమైజ్‌ కాకుండా తీస్తాము. యూనిట్‌ అందరికీ మంచి పేరు తెచ్చే చిత్రమిది. ఇకపై మా ఆర్‌.కె. ఫిలింస్‌ బ్యానర్‌పై కంటిన్యూగా సినిమాలు చేయాలనే సంకల్పంతో ఉన్నాం” అని అన్నారు.

తూముకుంట నర్సారెడ్డి మాట్లాడుతూ, “ఆర్‌.కె. గౌడ్‌ గారు రాజకీయాల్లో కూడా ఉన్నారు. మంచి ప్రజాసేవకుడిగా పేరు తెచ్చుకున్నారు. ఇప్పుడు కళామతల్లి సేవలో ఉండిపోయారు. ఆయన మళ్లీ అటు ప్రజా సేవలో కూడా పాలుపంచుకోవాలని కోరుకుంటున్నాను. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి గారు చిత్ర పరిశ్రమ అభివృద్ది కోసం చాలా తపన పడుతున్నారు. కాబట్టి రామకృష్ణగౌడ్‌ గారు ఆయన జత కలిస్తే పరిశ్రమకు మరింత మేలు జరుగుతుందని నా ఆశ. ఈరోజు ప్రారంభోత్సవం జరుపుకున్న ఈ ధీక్ష తప్పకుండా విజయం సాధించాలని కోరుకుంటున్నాను” అని అన్నారు.

టి.ఎఫ్‌.సి.సి వైస్‌ ప్రెసిడెంట్‌ గురురాజ్‌ మాట్లాడుతూ, “ఇంతమంది శ్రేయోభిలాషుల మధ్య ప్రారంభోత్సవం జరుపుకున్న ఈ చిత్రం విజయం తధ్యం. ఇప్పటికే ఎంతోమంది నటులు, టెక్నీషియన్‌లను పరిశ్రమకు పరిచయం చేశాం. వారు ఇప్పడు మంచి పొజిషన్‌లో ఉన్నారు. ఈ సినిమా ద్వారా కూడా మరింత మంది టాలెంటెడ్‌ వ్యక్తులు పరిశ్రమకు పరిచయం అవుతారు. అందరి ఆశీర్వాదాలు కావాలి” అని అన్నారు.

టి.ఎఫ్‌.సి.సి వైస్‌ ప్రెసిడెంట్‌ జె.వి.ఆర్‌ మాట్లాడుతూ, “మంచి నటీనటులు, టెక్నీషియన్స్‌తో ఆర్‌.కె. గౌడ్‌గారు చేస్తున్న ఈ ధీక్ష విజయవంతం కావాలి. సినిమాకు ప్రజల నుంచి రివార్డులతో పాటు, ప్రభుత్వాల నుంచి అవార్డులు కూడా రావాలి. ఇది మరిన్ని చిన్న సినిమాల నిర్మాణానికి మార్గదర్శి కావాలి” అని అన్నారు.

హీరో, హీరోయిన్‌లు కిరణ్‌, భవ్యశ్రీలు మాట్లాడుతూ, “మంచి కంటెంట్‌ ఉన్న సినిమా ఇది. ఇంత మంచి సినిమాకు మమ్మల్ని సెలక్ట్‌ చేసుకున్న ఆర్‌.కె. గౌడ్‌ గారికి, ఇతర నిర్మాతలకు థ్యాంక్స్‌. నటనకు స్కోప్‌ ఉన్న పాత్రలు కావడం మా అదృష్టం. అందరికీ మంచి పేరు, పేరుతో పాటు అవార్డులు తెచ్చే సినిమా ధీక్ష అని కాన్ఫిడెంట్‌గా చెపుతున్నాం” అని అన్నారు.

ఇంకా ఈ కార్యక్రమంలో పాల్గొన్న జేవీఆర్‌, నిర్మాత వెంకటేశ్వర్లు, చిత్తజల్లు ప్రసాద్‌, రచయిత మేడ ప్రసాద్‌, నిర్మాత గిరి తదితరులు ప్రతాని రామకృష్ణగౌడ్‌ గారి దర్శకత్వ ప్రతిభ ఈ చిత్రంతో మరోసారి టాలీవుడ్‌కు రికార్డుల పంట పండిరచాలని కోరుకున్నారు. ధీక్ష చిత్రానికి సంబంధించి టెక్నీషియన్స్‌, నటీనటుల వివరాలో అతి త్వరలో ప్రకటించనున్నారు.

ఓటీటీలో స్ట్రీమింగ్ కి వచ్చేసిన క్రేజీ ఎంటర్టైనర్ “టిల్లు స్క్వేర్”


యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో స్టార్ బాయ్ సిద్ధూ జొన్నలగడ్డ హీరోగా అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్ గా నేహా శెట్టి అలాగే ప్రియాంక జవల్కర్ లు ఇంట్రెస్టింగ్ కామియో లో దర్శకుడు మల్లిక్ రామ్ తెరకెక్కించిన సాలిడ్ ఎంటర్టైనర్ చిత్రమే “టిల్లు స్క్వేర్”. మరి ఇది సిద్ధూ కెరీర్ లోనే భారీ వసూళ్ళని అందుకోగా ఒక్క తెలుగు రాష్ట్రాల లోనే కాకుండా యూఎస్ మార్కెట్ లో కూడా స్టార్ హీరోస్ రేంజ్ లో వసూళ్లు సాధించింది.

మరి ఎట్టకేలకు ఈ సినిమా ఇప్పుడు ఓటీటీ లో స్ట్రీమింగ్ కి వచ్చేసింది. మరి ఈ సినిమా హక్కులు దిగ్గజ సంస్థ నెట్ ఫ్లిక్స్ సొంతం చేసుకున్న విషయం తెలిసిందే. ఇప్పుడు ఇందులో ఈ క్రేజీ రైడ్ చిత్రం పాన్ ఇండియా భాషల్లో అందరిని ఎంటర్టైన్ చేయడానికి వచ్చేసింది. మరి ఈ సినిమాని చూడాలి అనుకునేవారు తప్పకుండా నెట్ ఫ్లిక్స్ లో ట్రై చేయవచ్చు. ఇక ఈ చిత్రానికి అచ్చు, రామ్ మిర్యాల, భీమ్స్ లు సంగీతం అందించారు అలాగే సితార ఎంటర్టైన్మెంట్స్ అలాగే ఫార్చూన్ ఫోర్ సినిమాస్ వారు నిర్మాణం వహించారు.

సమీక్ష కోసం ఇక్కడ క్లిక్ చేయండి

ఓటిటిలో స్ట్రీమింగ్ కి వచ్చేసిన ‘ఫ్యామిలీ స్టార్’

రౌడీ హీరో విజయ్ దేవరకొండ, మృణాల్ ఠాకూర్ జంటగా నటించిన లేటెస్ట్ మూవీ ఫ్యామిలీ స్టార్. ఈ మూవీని శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై దిల్ రాజు గ్రాండ్ గా నిర్మించగా పరశురామ్ పెట్ల తెరకెక్కించారు. అయితే ఇటీవల మంచి అంచనాలతో థియేటర్స్ లో రిలీజ్ అయిన ఈ మూవీ పర్వాలేదనిపించే విజయం మాత్రమే అందుకుంది.

విషయం ఏమిటంటే, నేటి నుండి ఫ్యామిలీ స్టార్ ఓటిటి ఆడియన్స్ ముందుకి వచ్చింది. ప్రముఖ ఓటిటి మాధ్యమం అమెజాన్ ప్రైమ్ ద్వారా ప్రస్తుతం ఈ మూవీ తెలుగు, తమిళ భాషల్లో అందుబాటులో ఉంది. గోపి సుందర్ సంగీతం అందించిన ఈ ఫ్యామిలీ లవ్ యాక్షన్ ఎంటర్టైనర్ మూవీకి ఓటిటి ఆడియన్స్ నుండి ఏ స్థాయి రెస్పాన్స్ లభిస్తుందో చూడాలి.

రివ్యూ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

మీకు తెలుసా? : కమల్ తో సౌందర్య చేయాల్సిన మొదటి సినిమా ఇదని


యూనివర్సల్ హీరో కమల్ హాసన్ హీరోగా ఇప్పుడు పలు భారీ చిత్రాలు చేస్తున్న సంగతి తెలిసిందే. మరి కమల్ హాసన్ ఇప్పుడు వరకు ఎన్నో భాషల్లో ఎన్నో చిత్రాలు చేశారు. అలా మన తెలుగులో కూడ పలు చిత్రాలు చేయగా వాటిలో దిగ్గజ దర్శకులు దివంగత కే విశ్వనాథ్ గారితో చేసిన ఆణిముత్యం లాంటి సినిమా “శుభ సంకల్పం” కూడా ఒకటి.

అయితే ఈ సినిమాలో ఆమని అలాగే మరో నటి ప్రియా రామన్ లు కనిపిస్తారు. మరి ఈ ఇద్దరిలో ఒకరి పాత్ర అలనాటి స్టార్ నటి సౌందర్య చేయాల్సింది అని మీకు తెలుసా? అవును వారిద్దరిలో మొదటిగా ప్రియా రామన్ పాత్రకి సౌందర్యనే అనుకున్నారట. అంతే కాకుండా ఇదే కమల్ తో సౌందర్యకి మొదటి సినిమా కావాల్సి ఉండేది. కానీ పలు కారణాలు చేత అప్పట్లో సాధ్యం కాలేదు.

దీనితో వీరి కాంబినేషన్ లో మొదటి సినిమాగా “నవ్వండి లవ్వండి” కుదిరింది. తెలుగులో శుభ సంకల్పం చిత్రం మంచి విజయాన్ని సాధించిన సంగతి తెలిసిందే. ఆ సినిమాకి కీరవాణి ఇచ్చిన ఆల్బమ్ కూడా ఒక ఎవర్ గ్రీన్ ఆల్బమ్స్ లో ఒకటిగా నిలిచింది. మరి ఈ చిత్రాన్ని బాల సుబ్రహ్మణ్యం నిర్మించడం విశేషం.

నెక్స్ట్ ప్రాజెక్ట్స్ పై అల్లరి నరేష్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్

అల్లరి నరేష్ తాజాగా ఆ ఒక్కటీ అడక్కు మూవీ ద్వారా ఆడియన్స్ ముందుకి వచ్చేందుకు సిద్ధమయ్యారు. ఈ మూవీని మల్లి అంకం తెరకెక్కించగా చిలక ప్రొడక్షన్స్ బ్యానర్ పై రాజీవ్ చిలక నిర్మించారు. ఇక ఈ మూవీ మే 3న విడుదల కానుంది. ఈ సందర్భంగా ఒక మీడియా ఇంటర్వ్యూలో తన నెక్స్ట్ ప్రాజక్ట్స్ గురించి అల్లరి నరేష్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసారు. ప్రస్తుతం సుబ్బు దర్శకత్వంలో బచ్చల మల్లి మూవీ చేస్తున్నారు నరేష్

ఈ సినిమాలో తాను ఒకింత సీరియస్ పాత్రలో నటించనున్నానని అన్నారు. తనది మూర్ఖత్వానికి పేరుగాంచిన పాత్ర అని, ఒక రకంగా ఆ ఛాలెంజింగ్ పాత్రలో ఆడియన్స్ ని అలరించేలా నటిస్తున్నట్లు నరేష్ చెప్పారు. ఈ సినిమా 90వ దశకం నేపథ్యంలో ఉండనుందట. ఇక దీని అనంతరం మరొక రెండు ప్రాజక్ట్స్ లైన్ లో ఉన్నాయని, త్వరలోనే వాటి పూర్తి డిటైల్స్ కూడా వెల్లడి కానున్నట్లు తెలిపారు. కాగా అవి రెండు కూడా మంచి కామెడీ, ఎంటర్టైన్మెంట్ తో సాగుతాయని తెలిపారు అల్లరి నరేష్.

‘అఖండ – 2’ : ఆ రోజున అనౌన్స్ మెంట్ రానుందా ?

నటసింహం నందమూరి బాలకృష్ణ హీరోగా బోయపాటి శ్రీను దర్శకత్వంలో తెరకెక్కిన యాక్షన్ మాస్ ఎంటర్టైనర్ మూవీ అఖండ. 2021 లో గ్రాండ్ లెవెల్లో రిలీజ్ అయి బాక్సాఫీస్ వద్ద పెద్ద విజయం అందుకున్న ఈమూవీలో బాలకృష్ణ డ్యూయల్ రోల్ పోషించగా వాటిలో అఘోర పాత్రలో ఆయన నటనకు విశేషమైన ప్రశంసలు దక్కాయి. ఇక ఆ తరువాత అఖండ సీక్వెల్ కూడా ఉంటుందని దర్శకుడు బోయపాటి ప్రకటించారు.

అయితే గత కొన్నాళ్లుగా ఈ మూవీ గురించి పలు మీడియా మాధ్యమాల్లో కథనాలు ప్రచారం అవుతున్నాయి. ఇక లేటెస్ట్ టాలీవుడ్ బజ్ ప్రకారం ప్రస్తుతం బోయపాటి శ్రీను ఆ మూవీ యొక్క స్క్రిప్ట్ ని వేగంగా పూర్తి చేసే పనిలో నిమగ్నమై ఉన్నట్లు చెప్తున్నారు. అలానే బాలకృష్ణ పుట్టిన రోజైన జూన్ 10న ఈ మూవీ యొక్క అనౌన్స్ మెంట్ రానుందని అంటున్నారు. అయితే దీని పై మేకర్స్ నుండి అధికారికంగా క్లారిటీ రావాల్సి ఉంది.

బజ్ : ‘ఖైదీ’ మాదిరిగా విజయ్ – గౌతమ్ తిన్ననూరి మూవీ కూడా ?

యువ నటుడు విజయ్ దేవరకొండ ఇటీవల పరశురామ్ పెట్ల తెరకెక్కించిన ఫ్యామిలీ స్టార్ మూవీ ద్వారా ఆడియన్స్ ముందుకి వచ్చారు. యావరేజ్ విజయం అందుకున్న ఈ మూవీ అనంతరం ప్రస్తుతం జెర్సీ దర్శకుడు గౌతమ్ తిన్ననూరితో ఒక యాక్షన్ స్పై మూవీ చేస్తున్నారు విజయ్. ఈ మూవీలో మిస్టర్ బచ్చన్ ఫేమ్ భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్ గా నటిస్తున్నట్లు టాక్. సితార ఎంటర్టైన్మెంట్స్, శ్రీకర స్టూడియోస్, ఫార్చూన్ ఫోర్ సినిమాస్ ఈ మూవీని గ్రాండ్ లెవెల్లో నిర్మిస్తున్నయి.

ప్రస్తుతం షూటింగ్ జరుపుకుంటున్న ఈ మూవీకి సంబంధించి ప్రస్తుతం ఒక ఇంట్రెస్టింగ్ న్యూస్ బజ్ గా ప్రచారం అవుతోంది. దానిని బట్టి ఈ మూవీలో సాంగ్స్ ఉండవని అంటున్నారు. ఇంట్రెస్టింగ్ కథ, కథనాలతో సాగనున్న ఈమూవీ తప్పకుండా ఆడియన్స్ ని ఆకట్టుకునేలా దర్శకుడు గౌతమ్ అద్భుతంగా తెరకెక్కిస్తున్నట్లు చెపుతున్నారట మేకర్స్. ఇక ఇటీవల కార్తీ నటించిన ఖైదీ మూవీ కూడా ఒక్క సాంగ్ లేకుండా రిలీజ్ అయి సక్సెస్ సాధించింది. కాగా విజయ్, గౌతమ్ ల మూవీ గురించిన మరిన్ని అప్ డేట్స్ త్వరలో ఒక్కొక్కటిగా రానున్నాయి.

అనుపమ నెక్స్ట్ మూవీ కాన్సెప్ట్ వీడియో లాంచ్ చేయనున్న సమంత

ఇటీవల ఈగిల్, టిల్లు స్క్వేర్ సినిమాల ద్వారా ఆడియన్స్ ముందుకి వచ్చి మంచి విజయాలు సొంతం చేసుకున్న యువ నటి అనుపమ పరమేశ్వరన్ తాజాగా సినిమా బండి దర్శకుడు ప్రవీణ్ కండ్రేగుల దర్శకత్వంలో ఒక మూవీ చేసేందుకు సిద్ధమయ్యారు. ఇటీవల మలయాళంలో జయ జయ జయ జయ హే మూవీ ద్వారా మంచి విజయం అందుకున్న నటి దర్శన రాజేంద్రన్ ఈ మూవీ ద్వారా టాలీవుడ్ కి ఎంట్రీ ఇవ్వనున్నారు.

అలానే సంగీత, రాగ్ మయూరి ఇందులో కీలక పాత్రలు చేయనున్నారు. విషయం ఏమిటంటే ఈ క్రేజీ ప్రాజక్ట్ యొక్క కాన్సెప్ట్ వీడియోని దర్శకులు రాజ్ అండ్ డీకే తో కలిసి స్టార్ నటి సమంత రేపు సాయంత్రం 4 గం. 56 ని. లకు రిలీజ్ చేయనున్నారు. ఇక ఈ మూవీని శ్రీనివాసులు. పి, విజయ్ డొంకాడ, శ్రీధర్ మక్కువ కలిసి గ్రాండ్ గా నిర్మిస్తున్నారు. గోపి సుందర్ సంగీతం అందిస్తున్న ఈమూవీ గురించిన పూర్తి వివరాలు రేపు వెల్లడి కానున్నాయి.

‘ఆ ఒక్కటీ అడక్కు’ లో కామెడీ, డ్రామా, ఫ్యామిలీ ఎమోషన్స్ ప్రేక్షకులని ఆకట్టుకుంటాయి – నిర్మాత రాజీవ్ చిలక

టాలీవుడ్ కామెడీ కింగ్ అల్లరి నరేష్ లేటెస్ట్ గా ఔట్ అండ్ ఔట్ ఫ్యామిలీ కామెడీ ఎంటర్టైనర్ ఆ ఒక్కటీ అడక్కు తో రాబోతున్నారు. మల్లి అంకం దర్శకుడిగా పరిచయమవుతున్న ఈ చిత్రాన్ని చిలక ప్రొడక్షన్స్ బ్యానర్‌పై రాజీవ్ చిలక నిర్మిస్తున్నారు. ఫరియా అబ్దుల్లా హీరోయిన్ గా నటిస్తున్నారు. అల్లరి నరేష్ చాలాకాలం తర్వాత చేస్తున్న కామెడీ ఎంటర్ టైనర్ కావడంతో ఈ సినిమాపై ప్రత్యేక ఆసక్తి నెలకొంది. ఈ సినిమా టీజర్‌, ట్రైలర్‌ హ్యుజ్ బజ్ క్రియేట్ చేశాయి. మే 3న ఈ సినిమా గ్రాండ్ గా విడుదల కానున్న నేపధ్యంలో నిర్మాత రాజీవ్ చిలక విలేకరులు సమావేశంలో చిత్ర విశేషాలని పంచుకున్నారు.

‘ఆ ఒక్కటీ అడక్కు’ సినిమాని నిర్మించడానికి మిమ్మల్ని ఆకర్షించిన అంశాలు ఏమిటి?
సినిమాలు నిర్మించాలనే దీర్గకాలిక ప్రణాళికతో పరిశ్రమలోకి వచ్చాను. మంచి కథ కోసం చూస్తున్నపుడు దర్శకుడు మల్లి ఈ కథ చెప్పారు. పెళ్లి అనేది అందరూ రిలేట్ చేసుకునే అంశం. ఈ కథలో కామెడీ, ఎంటర్ టైన్మెంట్, ఎమోషన్స్, ఫ్యామిలీ ఇలా అన్ని ఎలిమెంట్స్ వున్నాయి. ఈ జోనర్ సినిమా మా మొదటి సినిమాగా సెట్ అవుతుందని భావించాం.

యానిమేషన్ రంగంలో చాలా కాలంగా వున్నారు కదా సినిమా రంగంలోకి రావడానికి ఇంతకాలం ఎందుకు పట్టింది?
యానిమేషన్ రంగం చాలా కష్టంతో కూడుకున్నది. ముందు కంపెనీని సుస్థిరం చేసే దిశగా పని చేశాం. మా దగ్గర దాదాపు ఎనిమిది వందల మంది ఉద్యోగులు పని చేస్తారు. వారందరికీ జీతాలు ఇవ్వడం మామూలు విషయం కాదు. అయితే సినిమాలు చేయాలని ఎప్పటినుంచో వుంది. దాదాపు ఆరు యానిమేషన్ చిత్రాలు చేశాం. కంపెనీ స్థిరపడిన తర్వాత సినిమాల్లోకి రావాలని భావించాం. ఈ క్రమంలో కొంత సమయం పట్టింది. ఇకపై వరుసగా సినిమాలని నిర్మిస్తాం.

చిలక ప్రొడక్షన్స్ బ్యానర్‌ గురించి ?
నా పూర్తి పేరు రాజీవ్ చిలకలపూడి. 2018లో పేరుని రాజీవ్ చిలక అని కుదించాను. ఆ పేరు బాగా కలిసొచ్చింది. ఛోటా భీమ్ పెద్ద హిట్ అయ్యింది. బ్యానర్ కి ఏం పేరు పెట్టాలనే ప్రశ్న వచ్చినప్పుడు చాలా పేర్లు సూచనలుగా వచ్చాయి. అయితే చిలక పేరు పాజిటివ్ గా వుందని అదే పేరుతో చిలక ప్రొడక్షన్స్ ని ప్రారంభించడం జరిగింది.

ఈ కథ విన్నాకా మొదట నరేష్ గారినే అనుకున్నారా?
ఫస్ట్ అల్లరి నరేష్ గారినే అనుకున్నాం. ఈ కథ విన్నాక మొదట మైండ్ లోకి వచ్చిన రాజేంద్రప్రసాద్ గారు. యంగ్ గా వుంటే ఆయన పర్ఫెక్ట్. ఇప్పుడైతే ఈ కథ నరేష్ గారికే యాప్ట్. నరేష్ గారికి ఈ కథ చాలా నచ్చింది. మేము కథ చెప్పినపుడు ఆయన రెండు సినిమాలతో బిజీగా వున్నారు. ఆయన కోసం వెయిట్ చేసి తీశాం.

మీ మొదటి సినిమాకే పెళ్లి సబ్జెక్ట్ ని ఎంచుకోవడానికి కారణం ?
-ఇది అందరూ రిలేట్ అయ్యే సబ్జెక్ట్. రిలేట్ చేసుకునే ప్రాబ్లం. పెళ్లి అనేది నేటి రోజుల్లో తన ఒక్కడికే సమస్య, తనకే పెళ్లి కావడం లేదనే ధోరణితో చాలా మంది మానసికంగా క్రుంగుబాటుకి గురౌతున్నారు. ఈ రోజుల్లో సెటిల్ అవ్వడం కంటే పెళ్లి అవ్వడం పెద్ద టాస్క్ గా మారింది. ఒకప్పుడు బంధవులు, చుట్టాలు చుట్టుపక్కల ఉంటూ వాళ్ళే పెళ్లి సంబధాలు చూసే వారు. కానీ ఇప్పుడు రోజులు మారిపోయాయి. ఒకొక్కరూ ఒకొక్క రాష్ట్రంలో, దేశంలో వుంటున్నారు. పెళ్లి కోసం వెబ్ సైట్స్ పై ఆధారపడుతున్నారు. మ్యాట్రీమొనీ సైట్స్ ద్వారానే లక్షల్లో పెళ్ళిళ్ళు జరుగుతున్నాయి. పైగా ఇందులో ఒకరిగురించి ఒకరికి తెలీయదు కూడా. జీవితానికి సంబధించిన పెద్ద నిర్ణయాన్ని ఇలా తీసుకుంటున్న పరిస్థితి వుంది. ఇది నేడు యువత ఎదుర్కొంటున్న సమస్య. అందరూ కనెక్ట్ అయ్యే సబ్జెక్ట్. ఈ కథ చాలా వినోదాత్మకంగా చెప్పాం. కామెడీ, డ్రామా, హ్యుమర్ , సాంగ్స్ ఇలా అన్నీ ఎలిమెంట్స్ అద్భుతంగా వచ్చాయి.

‘ఆ ఒక్కటీ అడక్కు’ టైటిల్ గురించి ?
కొన్ని టైటిల్స్ అనుకున్నాం కానీ సరిగ్గా సెట్ కాలేదు. అలాంటి సమయంలో నరేష్ గారే ఆ ఒక్కటీ అడక్కు టైటిల్ సూచించారు. నిజానికి ఈ కథకు యాప్ట్ టైటిల్ ఇది. ఇందులో హీరోని అందరూ పెళ్లి ఎప్పుడని అడుగుతుంటారు. దీంతో ఇరిటేషన్ లో హీరో పలికే సహజమైన డైలాగ్ ఆ ఒక్కటీ అడక్కు. ఈ టైటిల్ పెట్టడం పెద్ద బాధ్యత. నరేష్ నాన్నగారి క్లాసిక్ సినిమా అది. నరేష్ గారికి ఇంకా భాద్యత వుంది. కథ, అవుట్ పుట్ అన్నీ చూసుకున్నాక సినిమా టైటిల్ డిసైడ్ చేయమని కోరాం. నరేష్ గారు సినిమా చూసి చాలా హ్యాపీగా ఫీలై టైటిల్ వాడుకోవచ్చని పర్మిషన్ ఇచ్చారు.

ఈ కథలో ట్విస్ట్ లు ఉన్నాయా ?
ఇందులో కొన్ని ఆసక్తికరమైన ట్విస్ట్ లు వున్నాయి. స్క్రీన్ ప్లే కథలో లీనం చేస్తుంది. ఆద్యంతం ప్రేక్షకులని హోల్డ్ చేస్తుంది.

దర్శకుడిగా మల్లి అంకంను ఎంపిక చేయడానికి కారణం?
తను చాలా హార్డ్ వర్కింగ్ పర్సన్. దాదాపు ఇరవై ఏళ్ళుగా పరిశ్రమలో వున్నారు. నాకు ముందు నుంచి పరిచయం వుంది. తను అనుకున్న కథని చాలా అద్భుతంగా తీశాడు.

హీరోయిన్ ఫరియా అబ్దుల్లా గురించి ?
నరేష్ గారు హైట్ ఎక్కువ వుంటారు. నిజానికి ఆయన ఎత్తుకి చాలా మంది హీరోయిన్స్ సరిపోరు. ఆయన హైట్ ని మ్యాచ్ చేయడానికి ఫరియా అయితే బావుంటుందనిపించింది. అలాగే ఫరియా కామెడీ టైమింగ్ కూడా బావుటుంది. ఈ కథ నచ్చి ఫరియా ప్రాజెక్ట్ లోకి వచ్చారు. అలాగే జానీ లీవర్ గారి అమ్మాయి జెమి లివర్ ఇందులో కీలక పాత్రలో కనిపిస్తారు. దీంతో పాటు మురళి శర్మ, వెన్నెల కిషోర్, వైవా హర్ష వీరందరి పాత్రలు వినోదాత్మకంగా వుంటాయి.

గోపిసుందర్ మ్యూజిక్ గురించి ?
మ్యూజిక్ కు చాలా ప్రాధాన్యత ఇస్తాం. అందుకే గోపి సుందర్ గారిని ఎంపిక చేశాం. సాంగ్స్ చాలా బాగా ఇచ్చారు. నేపధ్య సంగీతంలో ఎమోషన్ అద్భుతంగా పండింది.

యానిమేషన్స్ లో కొత్త ప్రాజెక్ట్స్ ?
ఛోటా భీమ్ ని రియల్ పిల్లలతో చేయబోతున్నాం. అలాగే డిస్నీలో ఒక యానిమేషన్ షో లాంచ్ కాబోతుంది. అది ఛోటా స్టార్ట్ అఫ్ గా చేస్తున్నాం. చాలా ఫన్ గా వుంటుంది. మే6న లాంచ్ కాబోతుంది.

నిర్మాతగా ఎలాంటి సినిమాలు చేయాలని వుంది ?
మంచి ఫ్యామిలీ సినిమాలు తీయాలని వుంది. అలాగే ఫాంటసీ, హిస్టారికల్, కామెడీ జోనర్స్ చేయాలని వుంది.

థాంక్యూ
అల్ ది బెస్ట్

‘కుబేర’ లేటెస్ట్ షెడ్యూల్ డీటెయిల్స్

శ్రీ వెంకటేశ్వర సినిమాస్ ఎల్ ఎల్ పి, అమిగోస్ క్రియేషన్స్ సంస్థల పై గ్రాండ్ లెవెల్లో నిర్మితం అవుతున్న లేటెస్ట్ పాన్ ఇండియన్ మూవీ కుబేర. ఈమూవీని శేఖర్ కమ్ముల తెరకెక్కిస్తుండగా కీలక పాత్రల్లో నాగార్జున, ధనుష్ నటిస్తున్నారు.

ఇప్పటికే కొంత మేర షూటింగ్ జరుపుకున్న ఈ మూవీ యొక్క తాజా షెడ్యూల్ ముంబైలో ప్రారంభం కాగా ఈ షెడ్యూల్ లో ప్రధాన పాత్రధారుల పై కొన్ని కీలక సన్నివేశాలు భారీ ఎత్తున చిత్రీకరించనుంది టీమ్.

నేషనల్ క్రష్ రష్మిక మందన్న హీరోయిన్ గా నటిస్తున్న ఈమూవీకి రాక్ స్టార్ దేవిశ్రీప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. ఇటీవల రిలీజ్ చేసిన కుబేర టైటిల్ గ్లింప్స్ కి అందరి నుండి మంచి రెస్పాన్స్ లభించింది. కాగా అందరిలో మంచి అంచనాలు ఏర్పరిచిన ఈ క్రేజీ ప్రాజక్ట్ గురించిన మరిన్ని అప్ డేట్స్ త్వరలో ఒక్కొక్కటిగా రానున్నాయి.

‘సత్యభామ’ : మెలోడియస్ గా ఆకట్టుకుంటోన్న ‘కళ్లారా’ సాంగ్

టాలీవుడ్ స్టార్ నటీమణుల్లో ఒకరైన కాజల్ అగర్వాల్ తాజాగా యువ దర్శకుడు సుమన్ చిక్కాల దర్శకత్వంలో నటిస్తున్న యాక్షన్ ఎంటెర్టైనర్ మూవీ సత్యభామ. ఇప్పటికే రిలీజ్ అయిన ఫస్ట్ లుక్ పోస్టర్స్, గ్లింప్స్ టీజర్ తో అందరినీ ఆకట్టుకున్న ఈ మూవీ మే 17న ఆడియన్స్ ముందుకి రానుంది.

విషయం ఏమిటంటే, నేడు ఈమూవీ నుండి కళ్లారా అనే పల్లవితో సాగె మెలోడియస్ సాంగ్ ని యూట్యూబ్ లో రిలీజ్ చేసారు. శ్రేయ ఘోషల్ అద్భుతంగా పాడిన ఈ సాంగ్ ని రాంబాబు గోసాల రచించారు. ఈ మెలోడియస్ సాంగ్ ప్రస్తుతం శ్రోతలను ఆకట్టుకంటూ మంచి వ్యూస్ రాబడుతోంది. కాగా సత్యభామ మూవీని బాబీ తిక్క, శ్రీనివాసరావు తక్కలపెల్లి గ్రాండ్ గా నిర్మిస్తున్నారు.

వీడియో కోసం ఇక్కడ క్లిక్ చేయండి