‘ఆ ఒక్కటీ అడక్కు’ కథ, కాన్సెప్ట్ తో ఆడియన్స్ ఎంజాయ్ చేస్తారు – హీరోయిన్ ఫరియా అబ్దుల్లా

కామెడీ కింగ్ అల్లరి నరేష్ ఔట్ అండ్ ఔట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ ఆ ఒక్కటీ అడక్కు తో రాబోతున్నారు. మల్లి అంకం దర్శకుడిగా పరిచయమవుతున్న ఈ చిత్రాన్ని చిలక ప్రొడక్షన్స్ బ్యానర్‌పై రాజీవ్ చిలక నిర్మిస్తున్నారు. ఫరియా అబ్దుల్లా హీరోయిన్ గా నటిస్తున్నారు. అల్లరి నరేష్ చాలా కాలం తర్వాత చేస్తున్న కామెడీ ఎంటర్ టైనర్ కావడంతో ఈ సినిమాపై ప్రత్యేక ఆసక్తి నెలకొంది. ఈ సినిమా టీజర్‌, ట్రైలర్‌ హ్యుజ్ బజ్ క్రియేట్ చేశాయి. మే 3న ఈ సినిమా గ్రాండ్ గా విడుదల కానున్న నేపధ్యంలో హీరోయిన్ ఫరియా అబ్దుల్లా విలేకరుల సమావేశంలో చిత్ర విశేషాలని పంచుకున్నారు.

‘ఆ ఒక్కటీ అడక్కు’ లో మీ పాత్ర ఎలా వుండబోతుంది? ఈ కథలో మిమ్మల్ని ఆకర్షించిన అంశాలు ఏమిటి ?
ఇందులో నా పాత్ర పేరు సిద్ధి. నా పాత్ర చాలా స్వేఛ్చగా వుటుంది. అన్ని ప్లాన్ చేసి, నిబంధనలు పెట్టుకొని అందులోనే బ్రతకడం తనకి ఇష్టం వుండదు. హీరో పాత్ర నా పాత్రకు భిన్నంగా వుంటుంది. తను అన్నీ ప్లాన్ ప్రకారం వుంటారు. ఈ రెండు పాత్రల మధ్య మంచి సంఘర్షణ వుంటుంది. అదే సమయంలో మంచి ఆకర్షణ కూడా వుంటుంది. కథ పెళ్లి అనే అంశం చుట్టూ ఉంటూ అందరినీ ఆకట్టుకునేలా వుంటుంది. ఆ ఒక్కటీ అడక్కు కథ, కాన్సెప్ట్ బ్యూటీఫుల్ గా వుంటుంది.

ఈ పాత్ర చేయడం సవాల్ గా అనిపించిందా ?
సవాల్ గా అనిపించలేదు. ఎందుకంటే నేను కూడా ఫ్రీ ఫ్లో లోనే వుంటాను. నాకు చాలా కనెక్ట్ అయిన పాత్ర ఇది. దర్శకుడు కథ చెప్పినపుడు కంటెంట్ చాలా నచ్చింది. ఈ రోజుల్లో అందరికీ అవసరమయ్యే కంటెంట్ ఇది.

‘జాతిరత్నాలు’ లో మంచి హ్యుమర్ వున్న పాత్ర చేశారు కదా ఇందులో కామెడీ ఎలా వుంటుంది ?
ఇందులో కామెడీ చాలా డిఫరెంట్ గా వుంటుంది. పరిస్థితుల నుంచే పుట్టే హాస్యం వుంటుంది. అలానే కామెడీ సీన్స్ చాలా నేచురల్ గా ఉంటాయి. ముఖ్యంగా కంటెంట్ ప్రేక్షకులని సహజంగా నవ్విస్తుంది.

నరేష్ గారు లాంటి అద్భుతమైన కామెడీ టైమింగ్ వున్న హీరోతో వర్క్ చేయడం ఎలా అనిపించింది?
నరేష్ గారితో వర్క్ చేయడం చాలా మంచి ఎక్స్ పీరియన్స్. షూటింగ్ చాలా సరదాగా జరిగింది. నరేష్ గారి కామెడీ టైమింగ్ ఎక్స్ ట్రార్డినరీ గా వుంటుంది. ఈ సినిమాతో ప్రేక్షకులని కడుపుబ్బా నవ్విస్తారు. ఇందులో చాలా హిలేరియస్ ఎంటర్ టైన్మెంట్ వుంటుంది.

దర్శకుడు మల్లి అంకంతో వర్క్ చేయడం ఎలా అనిపించింది ?
దర్శకుడు మల్లి గారు నాకు బౌండ్ స్క్రిప్ట్ ఇచ్చారు. అది నాకు చాలా ఎక్సయిటింగ్ గా అనిపించింది. అలాగే కథ గురించి చాలా చర్చించేవారు. అది నాకు చాలా ఆనందంగా అనిపించింది. ఆయన అందరి సలహాలు తీసుకుంటారు. ఎప్పుడూ నవ్వుతూనే వుంటారు. సినిమా షూటింగ్ అంతా ఫన్ గా జరిగింది.

ఇందులో పెళ్లి గురించి ఎలాంటి అంశాలు చర్చించారు ?
పెర్ఫెక్ట్ వైఫ్, పెర్ఫెక్ట్ హస్బెండ్ అంటూ చాలా సెలెక్టివ్ గా మారిపోయిన పరిస్థితులు చూస్తున్నాం. పెళ్లి అంటే రెండు కుటుంబాల కలయిక. ఒకప్పుడు పెళ్లిళ్లకి, ఇప్పటి పెళ్లిళ్లకి చాలా మార్పులు వచ్చేశాయి. మ్యాట్రీమొనీ సైట్స్ లో ఎలా డీల్ చేస్తారనే అంశంతో పాటు పెళ్లికి సంబధించిన అనేక అంశాలు ఇందులో చాలా ఆసక్తికరంగా చూపించాం.

నిర్మాతల గురించి ?
రాజీవ్ చిలక గారు చాలా పాషన్ వున్న నిర్మాత. సినిమాని ఎక్కడా రాజీపడకుండా చాలా గ్రాండ్ గా నిర్మించారు. సినిమాకి కావాల్సిన ప్రతిది సమకూర్చారు. వారి నిర్మాణంలో వర్క్ చేయడం చాలా ఆనందంగా అనిపించింది.

ఒక పాత్ర ఎంపిక చేసుకున్నపుడు ఏ అంశాలు చూస్తారు ?
పాత్ర ప్రాధాన్యత, నిడివి అన్నీ చూస్తాను. కొన్ని క్యామియో రోల్స్ కూడా చేశాను. రవితేజ గారితో వర్క్ చేయాలని ఎప్పటినుంచో అనుకున్నాను. రావణాసురలో అవకాశం వచ్చింది. అది హీరోయిన్ పాత్ర అని చెప్పలేను కానీ ఆ పాత్ర చేయడం చాలా ఎక్సయిటింగ్ గా అనిపించింది.

భవిష్యత్ ఎలాంటి సినిమాలు చేయాలని అనుకుంటున్నారు ?
టిపికల్ హీరోయిన్ గా మాస్ మసాలా సినిమా చేయాలని వుంది. అలాగే హారర్ థ్రిల్లర్ చేయాలని వుంది. అలాగే కామెడీ సినిమా చేయాలని వుంది. ఇప్పుడు పరిశ్రమలో యాక్షన్ సినిమాలు చేసే హీరోయిన్స్ తక్కువగా వున్నారు. ఆ ఖాళీని భర్తీ చేయాలని వుంది. యాక్షన్ సినిమాలు నాకు బాగా నప్పుతాయని భావిస్తున్నాను.

జాతిరత్నాలు 2 ఎప్పుడు ?
ప్రస్తుతం నిర్మాతలు ‘కల్కి 2898 ఏడి’ తో బిజీగా వున్నారు. అది చాలా పెద్ద ప్రాజెక్ట్. కల్కి కోసం నేనూ ఎదురుచూస్తున్నాను. దాని విడుదల తర్వాత జాతిరత్నాలు 2 కోసం ఆలోచిస్తారేమో అనుకుంటున్నాను.

కొత్తగా చేస్తున్న చిత్రాలు ?
మత్తువదలరా 2 చేస్తున్నాను. గోపి దర్శకత్వంలో భగవంతుడు అనే సినిమా చేస్తున్నాను. అలాగే ఓ తమిళ సినిమా విడుదలకు సిద్ధంగా వుంది. కొన్ని తమిళ. మలయాళం కథలు కూడా వింటున్నాను.

థాంక్యూ
ఆల్ ది బెస్ట్

మాస్, యాక్షన్ హంగులతో అదిరిపోయిన ‘గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి’ టీజర్

ఇటీవల యాక్షన్ అడ్వెంచర్ మూవీ గామి ద్వారా ఆడియన్స్ ముందుకు వచ్చిన యువ నటుడు విశ్వక్సేన్ నటిస్తున్న లేటెస్ట్ రూరల్ యాక్షన్ డ్రామా ఎంటర్టైనర్ మూవీ గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి. కృష్ణ చైతన్య తెరకెక్కిస్తోన్న ఈ మూవీలో నేహా శెట్టి హీరోయిన్ గా నటిస్తుండగా సితార ఎంటర్టైన్మెంట్స్, శ్రీకర స్టూడియోస్, ఫార్చూన్ ఫోర్ సినిమాస్ సంస్థల పై సాయి సౌజన్య, నాగ వంశీ గ్రాండ్ లెవెల్లో నిర్మిస్తుండగా యువన్ శంకర్ రాజా సంగీతం అందిస్తున్నారు. ఇటీవల రిలీజ్ అయిన గ్లింప్స్, పోస్టర్స్, సాంగ్స్ తో అందరినీ ఆకట్టుకున్న ఈ మూవీ నుండి నేడు టీజర్ ని రిలీజ్ చేసారు మేకర్స్. మాస్ యాక్షన్ హంగులతో ఈ టీజర్ అదిరిపోయింది.

టీజర్ ని బట్టి చూస్తే తన కెరీర్ లో ఫుల్ మాస్ యాక్షన్ రోల్ లో విశ్వక్సేన్ అదరగొట్టినట్లు తెలుస్తోంది. ముఖ్యంగా తన డైలాగ్స్, యాక్టింగ్, బ్యాక్ గ్రౌండ్ స్కోర్, విజువల్స్ టీజర్ లో అదిరిపోయాయి. ‘అమ్మోరు పూనేసింది రా ఈసారి ఒక్కోక్కడికి శివాలెత్తిపోద్దంతే’ అంటూ విశ్వక్ పలికిన డైలాగ్ ఆకట్టుకుంటుంది. మొత్తంగా గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి టీజర్ మూవీ పై ఇప్పటి వరకు ఉన్న అంచనాలు మరింతగా పెంచిందని చెప్పాలి. కాగా ఈ మూవీని అన్ని కార్యక్రమాలు ముగించి మే 17న గ్రాండ్ గా ఆడియన్స్ ముందుకి తీసుకురానున్నారు.

టీజర్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

బ్రేకింగ్ : “కల్కి 2898ఎడి” రిలీజ్ ఎదురు చూపులకి తెర పడింది..

ప్రస్తుతం ఇండియా అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్న అవైటెడ్ సినిమా ఏదన్నా ఉంది అంటే అది రెబల్ స్టార్ ప్రభాస్ (Prabhas) హీరోగా దీపికా పదుకోణ్ (Deepika Padukone) అలాగే దిశా పటాని (Disha Patani) అలాగే యూనివర్సల్ హీరో కమల్ హాసన్, అమితాబ్ బచ్చన్ లాంటి దిగ్గజాల కలయికలో నటిస్తున్న చిత్రం “కల్కి 2898ఎడి” అని చెప్పాలి. దర్శకుడు నాగ్ అశ్విన్ తెరకెక్కిస్తున్న ఈ చిత్రం ఇండియా నుంచి పాన్ వరల్డ్ లెవెల్ హంగులతో ప్లాన్ చేస్తున్నారు.

ఇక ఈ సినిమా కొత్త రిలీజ్ డేట్ కోసమే గత కొన్ని వారాలుగా అభిమానులు యావత్తు పాన్ ఇండియా ఆడియెన్స్ కూడా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. అయితే ఈ డేట్ పై ఇవాళ ఎట్టకేలకి మేకర్స్ అప్డేట్ ఇస్తున్నట్టుగా కన్ఫర్మ్ చేశారు. ఇప్పుడు అందరి నిరీక్షణకు తెర దించుతూ ఈ చిత్రంని ప్రపంచ వ్యాప్తంగా సరిగ్గా మరో రెండు నెలల్లో అంటే జూన్ 27 న విడుదల చేస్తున్నట్టుగా ప్రభాస్, దీపికా అమితాబ్ లపై ఓ క్రేజీ పోస్టర్ తో ఇప్పుడు మేకర్స్ రివీల్ చేశారు.

మరి ప్రపంచ వ్యాప్తంగా కల్కి (Kalki Rampage in 2 Months) ర్యాంపేజ్ అయితే ఆరోజు నుంచి ఉంటుంది అని చెప్పాలి. ఇక ఈ భారీ ప్రాజెక్ట్ కి సంతోష్ నారాయణన్ (Santosh Narayanan) సంగీతం అందిస్తుండగా వైజయంతి మూవీస్ వారు అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మాణం వహించారు.

ఆనంద్ దేవరకొండ ‘గం గం గణేశా’ రిలీజ్ డేట్ ఫిక్స్

యువ నటుడు ఆనంద్ దేవరకొండ ఇటీవల బేబీ ద్వారా ఆడియన్స్ ముందుకి వచ్చి పెద్ద విజయం సొంతం చేసుకున్నారు. ఇక తాజాగా గం గం గణేశా అనే మూవీ చేస్తున్నారు. దీనిని యువ దర్శకుడు ఉదయ్ బొమ్మిశెట్టి తెరకెక్కిస్తుండగా హైలైఫ్ ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌ పై కేదార్ సెలగంశెట్టి, వంశీ కారుమంచి గ్రాండ్ గా నిర్మిస్తున్నారు. ప్రగతి శ్రీవాస్తవ కథానాయికగా నటిస్తున్న ఈ మూవీలో నయన్ సారిక కీలక పాత్రలో కనిపించనున్నారు.

చైతన్ భరద్వాజ్ స్వరాలు సమకూరుస్తున్న ఈ క్రైమ్ కామెడీ ఎంటర్టైనర్ మూవీ నుండి ఇప్పటికే రిలీజ్ చేసిన ఒక సాంగ్, టీజర్ అందరినీ ఆకట్టుకుని మూవీ పై మంచి అంచనాలు ఏర్పరిచాయి. విషయం ఏమిటంటే, తాజాగా ఈ మూవీ యొక్క రిలీజ్ డేట్ లాక్ అయినట్లు తెలుస్తోంది. కాగా ఈ మూవీని అన్ని కార్యక్రమాలు ముగించి మే 31న గ్రాండ్ గా ఆడియన్స్ ముందుకి తీసుకువచ్చేందుకు మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారట. కాగా దీనిపై త్వరలో వారి నుండి అఫీషియల్ అనౌన్స్ మెంట్ రానుంది.

“హను మాన్” కి లింకప్ తోనే ఆ భారీ సినిమా కూడా!?


ఈ ఏడాది పాన్ ఇండియా సెన్సేషన్ చిత్రం “హను మాన్” (Hanu Man Movie) కోసం అందరికీ తెలిసిందే. యంగ్ హీరో తేజ సజ్జ (Teja Sajja) తో దర్శకుడు ప్రశాంత్ వర్మ తెరకెక్కించిన ఈ భారీ చిత్రం టాలీవుడ్ లో సాలిడ్ లాంగ్ రన్ తో దూసుకెళ్లింది. ఇక ఈ సినిమాతో తన సినిమాటిక్ యూనివర్స్ ని ఆరంభించిన ప్రశాంత్ వర్మ మరింత లెవెల్లోకి దానిని తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నాడు.

మరి రీసెంట్ గానే “జై హనుమాన్” (Jai Hanuman Movie) పై ఓ మాసివ్ అప్డేట్ కూడా తాను అందించగా హను మాన్ 100 రోజుల వేడుకల్లో తన సినిమాటిక్ యూనివర్స్ లో మరింత మంది బిగ్ స్టార్స్ కనిపిస్తారని చెప్పుకొచ్చాడు. అయితే ఈ క్రమంలో తాను బాలీవుడ్ సూపర్ స్టార్ హీరో రణ్వీర్ సింగ్ (Ranveer Singh, Prasanth Varma Movie) తో ఓ సినిమా చేయనున్నాడు అనే అంశం బయటకి వచ్చింది.

అయితే ఇది హను మాన్ తో కనెక్ట్ అయ్యి ఉన్న యూనివర్స్ లో భాగమైన సినిమానా లేక దీనిని సెపరేట్ గా సంబంధం లేకుండా ప్లాన్ చేస్తున్నారా అనేది సస్పెన్స్ గా మారింది. అయితే దీనిపై ఇప్పుడు క్లారిటీ వినిపిస్తుంది. ఈ సినిమా కూడా హను మాన్ తోపాటుగా రానున్న ఇతర సినిమాల్లో భాగమే అని ఇదీ ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్ లోనిదే అని వినిపిస్తుంది. ఇక ఈ క్రేజీ కాంబినేషన్ పై అతి త్వరలోనే క్లారిటీ రానున్నట్టుగా స్ట్రాంగ్ బజ్ కూడా మొదలైంది. మరి చూడాలి ఈ కాంబినేషన్ పై అప్డేట్ ఎప్పుడు వస్తుంది అనేది.

ఇంట్రెస్టింగ్.. “వకీల్ సాబ్” రీరిలీజ్ కి నో చెప్తున్న ఫ్యాన్స్!?


ప్రస్తుతం టాలీవుడ్ స్టార్ హీరో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తన సినిమాలకి తాత్కాలికంగా విరామం ఇచ్చి తన రాజకీయ పనుల్లో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. మరి ఈ గ్యాప్ లో సడెన్ గా పవన్ నటించిన సెన్సేషనల్ కం బ్యాక్ హిట్ చిత్రం “వకీల్ సాబ్” చిత్రాన్ని రీ రిలీజ్ కి తీసుకొస్తున్నట్టుగా మేకర్స్ ఇవాళ అఫీషియల్ గా అనౌన్స్ చేశారు. అయితే ఈ మే 1న రానున్న ఈ సినిమా విషయంలో మెయిన్ గా పవన్ అభిమానులే అంత ఆసక్తిగా లేనట్టు కనిపిస్తుంది.

ప్రస్తుతం పవన్ పొలిటికల్ పరంగా బిజీగా ఉంటూ తమకి కావాల్సిన కిక్ ఇస్తున్నాడని ఈ మూమెంట్ లో అలానే ఉండాలని ఆశిస్తున్నట్టుగా సోషల్ మీడియాలో తెలుపుతున్నారు. దీనితో ఈ సినిమా రీ రిలీజ్ పట్ల వారు ఏమంత ఆసక్తిగా లేరనే అనిపిస్తుంది. మరి సడెన్ గా అనౌన్స్ చేసిన ఈ రీ రిలీజ్ కి ఎలాంటి రెస్పాన్స్ వస్తుందో వేచి చూడాలి. ఇక ఈ చిత్రానికి థమన్ సంగీతం అందించగా ఇది బాలీవుడ్ హిట్ చిత్రం “పింక్” కి రీమేక్ గా తెరకెక్కింది. అలాగే అనన్య నాగళ్ళ, నివేత థామస్, అంజలి లు ముఖ్య పాత్రల్లో నటించారు.

విజయ్ “గోట్” రెండో సాంగ్ పై అప్డేట్ ఇచ్చేసిన దర్శకుడు


ఇళయ దళపతి విజయ్ హీరోగా మీనాక్షి చౌదరి హీరోయిన్ గా దర్శకుడు వెంకట్ ప్రభు తెరకెక్కిస్తున్న ఇంట్రెస్టింగ్ చిత్రం “ది గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైం”. మరి ఈ సినిమా విజయ్ కెరీర్ లో 68వ సినిమాగా తెరకెక్కిస్తుండగా భారీ హైప్ దీనిపై నెలకొంది. ఇక ఆల్రెడీ వచ్చిన ఫస్ట్ లుక్ అలాగే మొదటి పాటకి బాగానే రెస్పాన్స్ వచ్చాయి. ఇక ఈ సినిమా నుంచి రెండో సాంగ్ ఎప్పుడు ఏంటి అనేది క్లారిటీ వచ్చేసింది.

సోషల్ మీడియాలో బాగానే యాక్టీవ్ గా ఉండే దర్శకుడు వెంకట్ ప్రభు విజయ్ ఫ్యాన్ కి రిప్లై ఇచ్చారు. గోట్ రెండో పాట జూన్ లో ఉంటుంది అని కన్ఫర్మ్ చేశారు. జూన్ లో ఎలాగో విజయ్ బర్త్ డే ఉంది కాబట్టి అప్పుడే ఈ సాంగ్ వస్తుంది అని చెప్పవచ్చు. అయితే సంగీత దర్శకుడు యువన్ శంకర్ రాజా ఇచ్చిన ఫస్ట్ సింగిల్ కి పాజిటివ్ అయితే రాలేదు. మరి ఈ సాంగ్ కి అయినా మంచి రెస్పాన్స్ వస్తుందో లేదో చూడాలి. ఇక ఈ చిత్రాన్ని ఏ జి ఎస్ సినిమాస్ వారు నిర్మాణం వహిస్తుండగా పాన్ ఇండియా భాషల్లో ఈ సెప్టెంబర్ 5న సినిమా గ్రాండ్ గా రిలీజ్ కాబోతుంది.

షాకింగ్ : అప్పుడే సాయి పల్లవి రణబీర్ ల “రామాయణ” పిక్స్ లీక్

ప్రస్తుతం బాలీవుడ్ సినిమా అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న పలు భారీ చిత్రాల్లో బాలీవుడ్ సూపర్ స్టార్ రణబీర్ కపూర్ అలాగే నాచురల్ బ్యూటీ సాయి పల్లవి ప్రధాన పాత్రల్లో దర్శకుడు నితీష్ తివారి తెరకెక్కిస్తున్న అవైటెడ్ చిత్రం “రామాయణం” కూడా ఒకటి.

అయితే ఈ పర్టిక్యులర్ కాంబినేషన్ పట్ల అందరిలో మంచి ఆసక్తి నెలకొనగా ఇప్పుడు ఈ సినిమా నుంచి ఊహించని విధంగా లీక్స్ బయటకి వచ్చేసి సోషల్ మీడియాలో వైరల్ అయిపోతున్నాయి. రీసెంట్ గానే సినిమా షూటింగ్ స్టార్ట్ కాగా ఈ గ్యాప్ లోనే సాయి పల్లవి, రణబీర్ ఇద్దరి పిక్స్ కూడా సెట్స్ నుంచి బయటకి వచ్చేసాయి.

దీనితో బాలీవుడ్ వర్గాల్లో అభిమానుల్లో ఈ పిక్స్ వైరల్ గా మారాయి. ఇక ఈ చిత్రంలో కన్నడ రాక్ స్టార్ యష్ కూడా కీలక పాత్ర చేయనున్నాడు అని టాక్ ఉంది. కానీ ఈ గ్యాప్ లో ఆకస్మికంగా ఈ పిక్స్ లీక్ అవ్వడం అనేది ఆశ్చర్యంగా మారింది. రీసెంట్ గానే రణబీర్ “అనిమల్” తో భారీ హిట్ కొట్టిన సంగతి తెలిసిందే. ఆ సినిమా తర్వాత ఈ చిత్రం చేస్తుండడంతో దీనిపైనా భారీ అంచనాలు నెలకొన్నాయి.

ఓటిటి : “మంజుమ్మల్ బాయ్స్” పాన్ ఇండియా ఎంట్రీకి కొత్త డేట్ వచ్చేసింది


ఈ ఏడాదిలో మళయాళ సినిమా అందుకున్న భారీ హిట్స్ ఒకదాన్ని మించి ఒకటి వచ్చాయి. మరి అలా వచ్చిన చిత్రాల్లో మళయాళ ఇండస్ట్రీలో సరికొత్త ఇండస్ట్రీ హిట్ చిత్రం “మంజుమ్మల్ బాయ్స్” కూడా ఒకటి. దర్శకుడు చిదంబరం తెరకెక్కించిన ఈ చిత్రం నిజ జీవిత సంఘటన ఆధారంగా తీశారు.

అయితే ఈ చిత్రంలో సౌబిన్ షాహిర్, శ్రీనాథ్ బాసి, బాలు వర్గీస్, గణపతి ఎస్ పొదువల్, జీన్ పాల్ లాల్ తదితరులు ముఖ్య పాత్రల్లో నటించగా ఈ చిత్రం తెలుగు సహా తమిళ్ లో కూడా డబ్బింగ్ అయ్యి భారీ వసూళ్లు సాధించింది. అయితే ఈ చిత్రం ఓటిటి రిలీజ్ విషయంలో గత కొన్నాళ్ల నుంచి టాక్ నడుస్తుంది.

మే 3న వస్తుంది అని కొన్ని పుకార్లు వచ్చాయి కానీ ఫైనల్ గా డిస్నీ+ హాట్ స్టార్ వారు దీనిపై అఫీషియల్ క్లారిటీ ఇచ్చేసారు. ఈ సినిమా ఓటిటిలో ఈ మే 5 నుంచి స్ట్రీమింగ్ కి వస్తున్నట్టుగా కొత్త డేట్ అందించారు. అలాగే ఈ సినిమా ఒరిజినల్ మళయాళం సహా తెలుగు, తమిళ్, హిందీ, కన్నడ భాషల్లో రాబోతున్నట్టుగా పాన్ ఇండియా ఎంట్రీని ఖరారు చేశారు. మరి ఈ సినిమా కోసం ఎదురు చూస్తున్నవారు అప్పటివరకు ఆగితే సరిపోతుంది.

లేటెస్ట్.. “కల్కి 2898ఎడి” అవైటెడ్ అప్డేట్ కే టైం ఫిక్స్!?


పాన్ ఇండియా రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా లోకనాయకుడు కమల్ హాసన్, బాలీవుడ్ బిగ్ బి అమితాబ్ బచ్చన్ లాంటి దిగ్గజ తారల కలయికలో దర్శకుడు నాగ్ అశ్విన్ తెరకెక్కిస్తున్న పాన్ వరల్డ్ చిత్రం “కల్కి 2898ఎడి” కోసం అందరికీ తెలిసిందే. మరి ఈ సినిమా విడుదల ఎప్పుడు అనేది ఉత్కంఠభరితంగా మారగా ఈ రిలీజ్ డేట్ అప్డేట్ కోసమే ఫ్యాన్స్ చాలా రోజులు నుంచి ఎదురు చూస్తున్నారు.

మరి దీనితో ఫైనల్ గా దీనికి తెరపడనుంది. ఈరోజు సాయంత్రం 5 గంటలకి చిత్ర నిర్మాణ సంస్థ ఓ అప్డేట్ అందిస్తున్నట్టుగా మేకర్స్ కన్ఫర్మ్ చేశారు. దీనితో ఇది రిలీజ్ డేట్ ఎప్పుడు అనేది రివీల్ చేయడమే అన్నట్టుగా తెలుస్తుంది. ఆల్రెడీ ఇవాళ సాయంత్రం 5 గంటలకి ఓ అప్డేట్ ఉంటుంది అని స్ట్రాంగ్ బజ్ ఉంది.

ఇప్పుడు ఎలాగో కన్ఫర్మ్ అయ్యింది కాబట్టి రిలీజ్ డేట్ ని వస్తుంది అని చెప్పవచ్చు. మరి ఆల్రెడీ జూన్ 27ని మేకర్స్ ఫిక్స్ చేసారని సమాచారం ఉండగా దీనినే రివీల్ చేస్తారో లేదో చూడాలి. ఇక ఈ సినిమాలో దీపికా పదుకోణ్ అలాగే దిశా పటాని లు కూడా నటిస్తుండగా సంతోష్ నారాయణన్ సంగీతం అందిస్తున్నాడు అలాగే వైజయంతి మూవీస్ వారు భారీ బడ్జెట్ తో ఈ సినిమాని నిర్మాణం వహించారు.

ఇంట్రెస్టింగ్ గా “క్రిమినల్ ఆర్ డెవిల్” ట్రైలర్.. ఈసారి హారర్ లోకి అదా శర్మ

“ది కేరళ స్టోరీ” సక్సెస్ తో అదా శర్మ ప్రస్తుతం పాన్ ఇండియన్ నటిగా ఫుల్ ఫేమస్ అయ్యిన సంగతి తెలిసిందే. అక్కడ నుంచి మరిన్ని సాలిడ్ కంటెంట్ సినిమాలు చేస్తూ వరుస బ్లాక్ బస్టర్ హిట్లతో అదా శర్మ లేటెస్ట్ గా మరో డిఫరెంట్ కాన్సెప్ట్ తో వచ్చింది. హారర్, యాక్షన్, ఎమోషన్ ఇలా అన్ని రకాల కాన్సెప్ట్‌లతో అదా శర్మ ప్రయోగాలు చేస్తున్నారు. ఇక చాలా గ్యాప్ తరువాత అదా శర్మ తెలుగులో ఓ స్ట్రెయిట్ సినిమాను చేస్తున్నారు. ప్రస్తుతం తెలుగు ప్రేక్షకుల ముందుకు అదా శర్మ “సి డి” (క్రిమినల్ ఆర్ డెవిల్) అనే సినిమాతో రాబోతున్నారు.

“C D” (క్రిమినల్ ఆర్ డెవిల్) అనే టైటిల్‌తో రూపొందుతున్న ఈ సినిమాకు కృష్ణ అన్నం దర్శకత్వం వహిస్తున్నారు. ఎస్ ఎస్ సి ఎం ప్రొడక్షన్స్ బ్యానర్‌పై తెరకెక్కిన ఈ మూవీకి గిరిధర్ ఎగ్జిగూటివ్ ప్రొడ్యూసర్‌గా వ్యవహరిస్తున్నారు. ఆర్ ఆర్ ధృవన్ సంగీతం అందిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ పూర్తయింది. మే 10న చిత్రాన్ని విడుదల చేయనున్నారు. ఈ క్రమంలోనే చిత్ర ప్రమోషన్స్‌లో భాగంగా తాజాగా ట్రైలర్‌ను రిలీజ్ చేశారు.

ఇక ఈ ట్రైలర్ చీకటి, వెలుతురు మధ్య కనిపించని శత్రువు ఎవరో ఉన్నారు.. ఎవరు చేస్తున్నారు ఇదంతా?.. నా చుట్టూ ఏదో జరుగుతోంది.. నాతో పాటు ఇంట్లో ఉంటోంది దెయ్యమా?.. మరణంతో పాటు యుద్దం తప్పదా?.. నన్ను చంపడానికి వచ్చింది ఎవరు క్రిమినల్? ఆర్ డెవిల్?’ అంటూ హీరో విశ్వంత్ వాయిస్ ఓవర్‌తో ట్రైలర్ సాగుతుంది. ఇక ఈ ట్రైలర్‌లో అదా శర్మ యాక్షన్ సీక్వెన్స్, భయపెట్టేలా చూసే చూపులతో ప్రేక్షకులు కచ్చితంగా థ్రిల్ ఫీల్ అవుతారు. ఇక ఈ ట్రైలర్‌ను చూస్తుంటే విజువల్స్, ఆర్ఆర్ అన్నీ కూడా టాప్ నాచ్‌లో ఉన్నాయనిపిస్తోంది.

ఇక ఈ చిత్రానికి ఏ.ముద్దు కృష్ణ డైలాగ్స్ అందించగా.. సతీష్ ముత్యాల సినిమాటోగ్రాఫర్‌గా పని చేశారు. సత్య గిడుతూరి ఎడిటింగ్ బాధ్యతలు నిర్వర్తించారు. ఇటీవలే చిత్రానికి సంబంధించిన పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు పూర్తయ్యాయి. ఈ సినిమాను మే 10న భారీ ఎత్తున విడుదల చేయనున్నారు.

ట్రైలర్ కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి

ఎమోషనల్ టీజర్ ని లాంచ్ చేసిన “రామం రాఘవం” యూనిట్

ప్రముఖ హాస్య నటుడు ధనరాజ్ అలాగే వెర్సటైల్ నటుడు సముద్రఖని కాంబినేషన్ లో చేస్తున్న ఎమోషనల్ చిత్రమే “రామం రాఘవం”. స్కేట్ పెన్సిల్ స్టోరీస్ బ్యానర్ పై ప్రభాకర్ ఆరిపాక సమర్పణలో పృథ్వి పోలవరపు నిర్మాణంలో ధనరాజ్ కొరణాని దర్శకత్వం వహించిన ద్విభాషా చిత్రం ఇది. తాజాగా ఈ సినిమా టీజర్ విడుదల కార్యక్రమం ఘనంగా జరిగింది. ప్రముఖ దర్శకుడు బాలా, పాండిరాజ్, సముద్రఖని, నటులు బాబీ సింహా, తంబి రామయ్య, హాస్య నటుడు సూరి, నటుడు దీపక్, నటుడు హరీష్. తదితరులు పాల్గొన్నారు.

ఇక ఈ సందర్భంగా దర్శకుడు బాలా మాట్లాడుతూ..”రామం రాఘవం టీజర్ బాగుంది. ధనరాజ్ దర్శకుడిగా ప్రేక్షకులను మెప్పిస్తాడు. ముఖ్యంగా సముద్రఖనిని మెచ్చుకోవాలి, ఇలాగే అతను చాలా మందికి సహాయం చేసి.. ప్రోత్సహించాలి, రామం రాఘవం పెద్ద విజయం సాధించి అందరికి మంచి పేరు తెచ్చిపెట్టాలని కోరుకుంటున్నాను” అని తెలిపారు.

అలాగే నిర్మాత, పృథ్వి పోలవరపు మాట్లాడుతూ…”సముద్రకని అన్న సహాయం లేకుండా నేను ఈ సినిమా చేయలేను. ఈ సినిమా తీయడంలో ఖని అన్న చాలా ముఖ్యమైన వ్యక్తి. తండ్రీ కొడుకుల అనుబందాల గురించి చెప్పే ఈ సినిమా బాగా వచ్చింది, జనాలకు నచ్చుతుందని” పేర్కొన్నారు.

నటి మోక్ష మాట్లాడుతూ..”తమిళంలో ఇది నా మొదటి సినిమా. తమిళ సినిమాలను ఇష్టపడే తమిళ అభిమానులు తప్పకుండా నన్ను ఆదరిస్తారని నేను నమ్ముతున్నాను. తమిళ గడ్దలో తొలి అడుగు వేయడం ఆనందంగా ఉందని” చెప్పారు.

అలాగే ప్రముఖ నటుడు బాబీ సింహా మాట్లాడుతూ.. “రామం రాఘవం” దర్శకుడు ధనరాజ్ నా స్నేహితుడు. కష్టపడి పనిచేయడం అతని గొప్పతనం. తండ్రీ కొడుకుల అనుబంధం గురించి ఓ కథ చెప్పాడు. అద్భుతంగా ఉంది. తండ్రి క్యారెక్టర్ ఎవరని అడిగాను ఖని బ్రదర్ అని అన్నారు. ఇకపై ఈ చిత్రం అతనిది, అతను ఈ చిత్రాన్నిపూర్తిగా క్యారీ చేసుకుంటాడు అని చెప్పా. అలాగే ఈ సినిమా కూడా మంచి విజయం సాధించాలని కోరుకుంటున్నాను. ధనరాజ్లో ఉన్న దర్శకుడిని చూసి చాలా ఆశ్చర్యపోయా అని తెలిపాడు.

ఇక తమిళ ప్రముఖ కమెడియన్, “విడుదలై” నటుడు సూరి మాట్లాడుతూ.. “వెన్నిలా కబడ్డీ కులు” చింతంలో నేను నటించిన పాత్రలో తెలుగులో ధనరాజ్ నటించాడు. తమిళం కన్నా తెలుగులో ఆ కామెడీ చాలా పెద్ద హిట్ అయ్యింది. ఒక హాస్యనటుడు దర్శకుడిగా మారడం చాలా ఆనందంగా ఉంది. తండ్రీకొడుకుల బంధం ఉన్న సినిమాలు ఫ్లాప్ అయిన చరిత్ర లేదు. ఈ సినిమా తప్పకుండా పెద్ద హిట్ అవుతుందని” పేర్కొన్నారు.

ఇక దర్శకుడు ధనరాజ్ మాట్లాడుతూ..”నా తల్లిదండ్రులకు ధన్యవాదాలు. రచయిత శివప్రసాద్ కథ ఇది. ఈ కథ గురించి ఖని అన్నకి చెప్పాను. కథను నువ్వే డైరెక్ట్ చేయాలి అని చెప్పాడు. నేను నటించిన చిత్రాలకు పనిచేసిన దర్శకుల నుండి నేను నేర్చుకున్న విషయాల ఆధారంగా నేను దర్శకత్వం వహించాను. ఇప్పటి వరకు 100 చిత్రాల్లో నటించా. ఆ సినిమా దర్శకులు అందరూ నా గురువులే. వారు నేర్పిన పాఠాలతో ఈరోజు దర్శకుడిగా మారా. సముద్రఖని అన్న లేకుంటే ఈ సినిమా పూర్తయ్యేది కాదు, నేను దర్శకుడిని అయ్యే వాడిని కాను. అందరూ వాళ్ళ నాన్నతో కలిసి ఈ సినిమా చూడాలని” చెప్పారు.

మరి ఫైనల్ గా వెర్సటైల్ నటుడు, దర్శకుడు సముద్రఖని మాట్లాడుతూ…”సంతోషకరమైన సమయం ఇది. నేను తండ్రిగా దాదాపు 10కి పైగా సినిమాల్లో నటించా. ఒక్కొక్కటి విభిన్న కథతో. అలాంటి మరో కొత్త కథ ఇది.
ధనరాజీకి తల్లిదండ్రులు లేరు. స్వతహాగా ఎదిగి ఈ స్థాయికి చేరుకున్నాడు. మంచి కథ ఇది.. అందుకు తగ్గ దర్శకుడు ఉండాలి అని అనుకున్నా. ధనరాజ్ పై నాకు పెద్ద నమ్మకం ఉంది. అందుకే, అతన్నే దర్శకత్వం చేయమని చెప్పా. దర్శకుడిగా అతను పెద్ద విజయాన్ని అందుకుంటాడు. ప్రతి తండ్రీ కొడుకుల మధ్య ఉండే బంధాన్ని చాటే చిత్రం ఇది. నిర్మాతను నేనెప్పుడూ కలవలేదు. చిత్రీకరణ సమయంలో మొదటిసారి చూశాను. సినిమా చాలా అద్భుతంగా వచ్చింది. తప్పకుండా విజయం సాధిస్తుందని” చెప్పారు.

టీజర్ కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి

వరలక్ష్మి శరత్ కుమార్ “శబరి” సాంగ్ రిలీజ్ చేసిన ఆస్కార్ విన్నర్ చంద్రబోస్

సౌత్ ఇండియా సినిమా దగ్గర తన నటనతో విలక్షణ నటిగా గుర్తింపు తెచ్చుకున్న వరలక్ష్మీ శరత్ కుమార్ ప్రధాన పాత్రలో నటించిన పాన్ ఇండియా సినిమా ‘శబరి’. మహా మూవీస్ పతాకంపై మహేంద్రనాథ్ కూండ్ల నిర్మించారు. మహర్షి కూండ్ల చిత్ర సమర్పకులు. అనిల్ కాట్జ్ దర్శకుడు. తెలుగు, తమిళ, మలయాళ, హిందీ, కన్నడ భాషల్లో మే 3న సినిమా విడుదల అవుతోంది. ఆల్రెడీ విడుదల చేసిన ‘నా చెయ్యి పట్టుకోవే…’ పాటకు, ప్రచార చిత్రాలకు మంచి స్పందన లభించింది. ఇప్పుడు ‘అనగనగా ఒక కథలా…’ పాటను ఆస్కార్ విన్నర్ చంద్రబోస్ విడుదల చేశారు.

‘అనగనగా ఒక కథలా…’ పాటకు సుచిత్రా చంద్రబోస్ నృత్య రీతులు సమకూర్చారు. తన సతీమణి కొరియోగ్రఫీ చేసిన పాటను చంద్రబోస్ తన చేతుల మీదుగా విడుదల చేయడం ఇదే తొలిసారి కావడం విశేషం.

ఇక ఈ పాటను విడుదల చేసిన తర్వాత చంద్రబోస్ మాట్లాడుతూ… ”ఇప్పుడే నేను ‘శబరి’ సినిమాలోని ‘అనగనగా ఒక కథలా…’ పాటను విడుదల చేశా. గోపీసుందర్ గారి సంగీతంలో రెహమాన్ గారు రాశారు. ఈ పాట చాలా ప్రత్యేకంగా అనిపించింది. ఈ సాంగ్ విడుదల కంటే ముందు నేను విన్నాను. నా భార్య సుచిత్ర కొరియోగ్రఫీ చేయడం కోసం ఇంటికి సాంగ్ తీసుకు వచ్చింది. సాంగ్ విని సాహిత్యం చదువుతానని తీసుకున్నా. చదువుతుంటే నాకు చాలా చాలా సంతోషం కలిగింది. ఈ పాట ఎవరు రాశారు? కథ ఏమిటి? అని ఫోన్ చేసి మాట్లాడాను. చాలా మంచి బాణీకి అంతే అందమైన భావాలతో కూడిన సాహిత్యం రాశారు. నా చేతుల మీదుగా విడుదల చేయించారని మంచిగా చెప్పడం కాదు… పాట విడుదలకు ముందే విని ఎంతో నచ్చే నిర్మాతను, గేయ రచయితను అభినందించా. ఈ పాట తప్పకుండా ఘన విజయం సాధిస్తుంది. చిత్ర గారు ఈ పాటకు తన గాత్రంతో జీవం పోశారు. తల్లి ప్రేమలోని మాధుర్యాన్ని ప్రతి పదంలో చూపించారు. తల్లి కూతుళ్ల అనుబంధం నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమా ఘన విజయం సాధించాలి. నిర్మాత మహేంద్రనాథ్ గారితో పాటు చిత్ర బృందం అందరికీ పేరు తీసుకురావాలని కోరుకుంటున్నా” అని చెప్పారు.

సుచిత్రా చంద్రబోస్ మాట్లాడుతూ… ”నేను కొరియోగ్రఫీ అందించిన పాటను మా ఆయన ఇదే తొలిసారి. చాలా సంతోషంగా ఉంది. ‘శబరి’ సినిమాలో చక్కటి సందర్భంలో వచ్చే గీతమిది. నాకు ఈ అవకాశం ఇచ్చిన మహేంద్రనాథ్ గారికి థాంక్స్” అని‌ చెప్పారు.

ఈ కార్యక్రమం లోనే నిర్మాత మహేంద్రనాథ్ కూండ్ల మాట్లాడుతూ ”తల్లి ప్రేమ నేపథ్యంలో వచ్చిన సినిమాల్లో మా ‘శబరి’ ప్రత్యేకంగా నిలుస్తుంది. కన్న బిడ్డను కాపాడుకోవడం కోసం ఓ తల్లి ఎంత దూరం వెళుతుందనేది చెప్పే చిత్రమిది. బరువైన భావోద్వేగాలతో కూడిన సైకలాజికల్ థ్రిల్లర్ సినిమా. ప్రేక్షకులకు కొత్త అనుభూతి ఇస్తుంది. వరలక్ష్మి గారి నటన ఈ సినిమాకు హైలైట్ అవుతుంది. తల్లీ కూతుళ్లు సరదాగా విహారయాత్రకు వెళ్లే పాట ‘నా చెయ్యి పట్టుకోవే’కు అద్భుతమైన స్పందన లభించింది. ఇప్పుడీ ‘అనగనగా ఓ కథలా…’ విడుదల చేశాం. రెండు పాటలకు రెహమాన్ గారు అద్భుతమైన సాహిత్యం అందించారు. చిత్ర గారు మా సినిమాలో ఈ ‘అనగనగా ఒక కథలా…’ పాట పాడటం మాకు ఎంతో సంతోషంగా ఉంది. సుచిత్రా చంద్రబోస్ గారు ఎంతో సీనియర్. నంది అవార్డ్స్ విన్నర్. నేను కొత్త నిర్మాత అయినా సరే… ఎంతో అంకిత భావంతో సాంగ్ కొరియోగ్రఫీ చేశారు. ఆవిడ డెడికేషన్ చూసి ఆశ్చర్యపోయా. గోపీసుందర్ గారు పాటలే కాదు, నేపథ్య సంగీతం కూడా సూపర్బ్ చేశారు. మే 3న ప్రేక్షకులకు థియేటర్లలో ‘శబరి’ థ్రిల్లింగ్ సినిమాటిక్ ఎక్స్‌పీరియన్స్ ఇస్తుంది” అని చెప్పారు.

ఈ చిత్రానికి గోపీసుందర్ సంగీతం అందించగా ఆయన స్వరపరిచిన బాణీకి ‘అనగనగా ఒక కథలా…’ అంటూ రెహమాన్ సాహిత్యం అందించగా… లెజెండరీ సింగర్ కెఎస్ చిత్ర ఆలపించారు. తెలుగుతో పాటు తమిళ, హిందీ, కన్నడ, మలయాళ భాషల్లో పాటను విడుదల చేశారు.

ఇక ఈ చిత్రానికి సాంకేతిక బృందం రచనా సహకారం: సన్నీ నాగబాబు, పాటలు: రెహమాన్, మిట్టపల్లి సురేందర్, మేకప్: చిత్తూరు శ్రీను, కాస్ట్యూమ్స్: అయ్యప్ప, కాస్ట్యూమ్ డిజైనర్: మానస, స్టిల్స్: ఈశ్వర్, ప్రొడక్షన్ ఎగ్జిక్యూటివ్: లక్ష్మీపతి కంటిపూడి, కో- డైరెక్టర్: వంశీ, ఫైట్స్: నందు – నూర్, కొరియోగ్రాఫర్స్: సుచిత్ర చంద్రబోస్ – రాజ్ కృష్ణ, ఆర్ట్ డైరెక్టర్: ఆశిష్ తేజ పూలాల, ఎడిటర్: ధర్మేంద్ర కాకరాల, డైరెక్టర్ ఆఫ్ ఫోటోగ్రఫీ: రాహుల్ శ్రీవాత్సవ, నాని చమిడి శెట్టి , ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: సీతారామరాజు మల్లెల, సంగీతం: గోపి సుందర్, సమర్పణ: మహర్షి కూండ్ల, ప్రొడ్యూసర్: మహేంద్ర నాథ్ కూండ్ల, కథ – మాటలు – స్క్రీన్ ప్లే – దర్శకత్వం: అనిల్ కాట్జ్ లు అందిస్తున్నారు.

ఓటిటిలో వచ్చాక “ది ఫ్యామిలీ స్టార్” లో ఈ సీన్స్ పై ట్రోల్స్


టాలీవుడ్ సెన్సేషనల్ స్టార్ విజయ్ దేవరకొండ (Vijay Devarakonda) హీరోగా మృణాల్ ఠాకూర్ (Mrunal Thakur) హీరోయిన్ గా దర్శకుడు పరశురామ్ పెట్ల తెరకెక్కించిన అవైటెడ్ సినిమా “ది ఫ్యామిలీ స్టార్”. మరి మేకర్స్ చాలా నమ్మకం పెట్టుకున్న ఈ చిత్రం థియేటర్స్ లో అనుకున్న రేంజ్ రెస్పాన్స్ ని అందుకోలేకపోయింది. అలాగే వసూళ్ల విషయంలో కూడా అంతగా ప్రభావం చూపలేదు.

దీనితో విజయ్ కెరీర్ లో హిట్ మరింత దూరం అవ్వగా లేటెస్ట్ గానే ఓటిటిలో ఈ చిత్రం (The Family Star in OTT) రిలీజ్ కి వచ్చింది. ప్రైమ్ వీడియోలో రిలీజ్ కి వచ్చిన ఈ చిత్రంపై ఇప్పుడు సోషల్ మీడియాలో పలు సీన్స్ విషయంలో ట్రోల్స్ నడుస్తున్నాయి. మొదటిగా రవిబాబుకి విజయ్ దేవరకొండ వార్నింగ్ ఇచ్చే సీక్వెన్స్ బాగా హైలైట్ కాగా నెక్స్ట్ ఇపుడు సినిమా స్టార్టింగ్ లో వచ్చే దోశలు సీన్ కోసం రచ్చ నడుస్తుంది.

ఎంత మిడిల్ క్లాస్ ఫ్యామిలీ అయినా కూడా అలాంటి దోశలు వేసుకోరని ఈ ఐడియా ఎలా వచ్చిందో అంటూ కామెంట్స్ చేస్తున్నారు. అయితే గతంలో ఇదే సీక్వెన్స్ సంబంధించి ట్రైలర్ వచ్చాక కూడా పలు కామెంట్స్ వచ్చిన సంగతి తెలిసిందే. మరి మళ్ళీ అదే సీన్ పై నెగిటివ్ కామెంట్స్ రావడం గమనార్హం. ఇక ఈ చిత్రానికి గోపి సుందర్ సంగీతం అందించగా దిల్ రాజు నిర్మాణం వహించారు.

అక్కడ కొత్త సినిమా కంటే రీరిలీజ్ కే ఎక్కువ ప్రాధాన్యత


మళ్ళీ చాలా కాలం తర్వాత థియేటర్స్ లో సరైన సినిమాలు లేక వాతావరణం అంతా డ్రై నడుస్తుంది. నిజానికి వేసవి రేస్ అంటేనే అనేక చిత్రాల సమ్మేళనం. అలాంటిది ఈ వేసవికి తెలుగు సహా తమిళ్ లో కూడా అంత చెప్పుకోదగ్గ సినిమాలు లేవు పైగా ఆడియెన్స్ కూడా మరీ అంత ఆసక్తిగా కనిపించడం లేదు. అయితే తమిళ నాట ఈ డ్రై వాతావరణంలో దళపతి విజయ్ నటించిన “గిల్లీ” రీ రిలీజ్ చేయగా దీనికి ఒక ఊహించని స్థాయి రెస్పాన్స్ వచ్చింది.

ఆల్రెడీ 3 లక్షలకి పైగా టికెట్స్ ఈ సినిమాకి అమ్ముడుపోయాయి. ఇక మరో పక్క యాక్షన్ హీరో విశాల్ నటించిన “రత్నం” అనే కొత్త సినిమా రిలీజ్ కి రాగా ఇది కూడా ఏమాత్రం ప్రభావం చూపించకపోవడం గమనార్హం. ఇదొక ఎత్తు అయితే అసలు కొత్త సినిమా కంటే రీ రిలీజ్ సినిమాకే ఎక్కువ టికెట్స్ బుక్ అవ్వడం అనేది మరో ఎత్తు. గిల్లీ ఆల్రెడీ చాలా రోజులు నుంచి థియేటర్స్ లో ఉంది.

రత్నం నిన్ననే తమిళ నాట థియేటర్స్ లోకి రిలీజ్ కాగా మొదటి రిలీజ్ దాని కంటే ఎన్నో రోజులు థియేటర్స్ లో ఉన్న గిల్లీ సినిమా బుకింగ్స్ ఎక్కువ ఉండడం విశేషం. రత్నం డే 1 కి 24 గంటల్లో 33 వేలకి పైగా టికెట్స్ బుక్ అయితే గిల్లీ కి మాత్రా 36 వేలకి పైగా బుక్ అవ్వడం విశేషం. దీనితో ఓ కొత్త సినిమా ఉన్నా కూడా రీ రిలీజ్ కే తమిళ ఆడియెన్స్ ప్రాధాన్యత ఇవ్వడం ఆశ్చర్యకరం అని చెప్పాలి.

సుకుమార్ అతిధిగా వచ్చిన సుహాస్ “ప్రసన్న వదనం” ప్రీ రిలీజ్ ఈవెంట్ హైలైట్స్

తన నటనతో టాలీవుడ్ లో మంచి పేరు తెచ్చుకున్న యంగ్ అండ్ టాలెంటెడ్ నటుడు సుహాస్ హీరోగా నటించిన మరో చిత్రం “ప్రసన్న వదనం”. ఒక యూనిక్ సస్పెన్స్ థ్రిల్లర్ గా వస్తున్నా ఈ సినిమా ట్రైలర్ లాంచ్ మరియు ప్రీ రిలీజ్ ఈవెంట్ కి స్టార్ డైరెక్టర్ సుకుమార్ వద్ద అసోసియేట్ గా పని చేసిన అర్జున్ వై కె దర్శకత్వం వహించాడు. ఈ చిత్రాన్ని జెఎస్ మణికంఠ, టి ఆర్ ప్రసాద్ రెడ్డి నిర్మిస్తున్నారు. పాయల్ రాధాకృష్ణ, రాశి సింగ్ హీరోయిన్స్ గా నటిస్తున్నారు.

ఇప్పటికే విడుదల ఈ సినిమా టీజర్, సాంగ్స్ కి మంచి రెస్పాన్స్ వచ్చింది. మే3న సినిమా ప్రేక్షకుల ముందుకు వస్తోంది.ఈ నేపధ్యంలో చిత్ర యూనిట్ ట్రైలర్ లాంచ్, ప్రీరిలీజ్ ఈవెంట్ నిర్వహించింది. స్టార్ డైరెక్టర్ సుకుమార్ ముఖ్య అతిధిగా హాజరైన ఈ వేడుక చాలా గ్రాండ్ గా జరిగింది. దర్శకులు బుచ్చిబాబు, కార్తిక్ దండు, శ్రీనివాస్ అవసరాల, రైటర్ ప్రసన్న ఈ వేడుకలో పాల్గొన్నారు.

ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో పాన్ ఇండియా డైరెక్టర్ సుకుమార్ మాట్లాడుతూ..‘‘సుహాస్‌.. అంటే నాకు, బన్నీకి చాలా ఇష్టం. ‘పుష్ప’లోని హీరో ఫ్రెండ్‌ క్యారెక్టర్ కేశవగా ముందు సుహాస్ ని అనుకున్నాం. కానీ, అప్పటికే సుహాస్ హీరోగా చేయడంతో ఆ రోల్‌కి ఎంపిక చేయడం బాగోదనిపించింది. నాని నటన నాకు బాగా ఇష్టం. సుహాస్‌.. ఫ్యూచర్‌ నానిలా అనిపిస్తున్నాడు. నాని సహజ నటుడు కాబట్టి సుహాస్‌ని మట్టి నటుడు అనాలేమో. అంత ఆర్గానిక్ గా వుంది. తన నటన చూస్తున్నాను. ఆయా పాత్రల్లో ఇమిడిపోతాడు. ఇందులో రాశీసింగ్‌, పాయల్‌ రాధాకృష్ణ చక్కగా నటించారు. విజయ్ బుల్గానిన్ మంచి మ్యూజిక్ ఇచ్చారు. మా అర్జున్ కి సినిమా ఇచ్చిన నిర్మాతలు ధన్యవాదాలు. నేను ‘జగడం’ సినిమా రూపొందిస్తున్న సమయంలో అర్జున్‌ కలిశాడు. ‘మీ ‘ఆర్య’ చిత్రం నాకు బాగా నచ్చింది సర్‌. మీ వద్ద పని చేయాలనుకుంటున్నా’ అని అన్నాడు. టీమ్‌లో జాయిన్‌ చేసుకున్నా. అర్జున్ చాలా అమాయకుడు. కానీ, బోలెడు లాజిక్‌ ఉన్నవాడు. అర్జున్‌, మరో అసిస్టెంట్‌ తోట శ్రీనుతో కలిసి 23 రోజుల్లో ‘100% లవ్‌’ స్టోరీ రాశా. అప్పటి నుంచి నా ప్రతి సినిమాకి వీరిద్దరు పనిచేశారు. వీళ్లతోపాటు ఒక్కో చిత్రానికి ఒక్కొక్కరు యాడ్‌ అవుతూ ఉండేవారు. అర్జున్ కి ఏదైనా సమస్య చెబితే పరిష్కారం సెకన్స్ లో చెబుతాడు. నిజానికి తను హాలీవుడ్ లో వుండివుంటే మరో స్థాయి సినిమా తీసేవాడు. అంత లాజిక్ వున్నవాడు. అర్జున్‌ బిజీగా ఉండడంతో నేను లాజిక్‌ ఉన్న సినిమాలను మానేశా. అంటే మీరు అర్ధం చేసుకోవచ్చు. ఆ లాజిక్ తోనే ప్రసన్న వదనం తీసాడు. తను చాలా నిజాయితీ పరుడు. ఈ సినిమాని చాలా నిజాయితీగా తీశాడు. తన ప్రేమ, నిజాయితీ చాలా ఇష్టం. ఈ సినిమా చూశాను. చాలా బావుంది. ఏ కరెక్షన్ చెప్పలేకపోయాను. అంత చక్కగా తీశాడు. థియేటర్‌కు వెళ్లి సినిమా చూడండి.. నా అర్జున్‌ని సపోర్ట్‌ చేయండి. సినిమా ఖచ్చితంగా మిమ్మల్ని అలరిస్తుంది’ అన్నారు.

ఇక హీరో సుహాస్ మాట్లాడుతూ.. ‘ప్రసన్న వదనం’ మే 3న విడుదలవుతోంది. కలర్ ఫోటో, రైటర్ పద్మ భూషణ్, అంబాజీ పేట.. ఈ సినిమాలన్నీ ప్రేక్షకులని అలరించాయి. ప్రసన్న వదనం కూడా ఖచ్చితంగా ఆడియన్స్ ని అలరిస్తుంది. ప్రేక్షకులు థియేటర్స్ దాక వస్తే చాలు.. అక్కడ మేము చూసుకుంటాం. ఖచ్చితంగా అందరికీ నచ్చుతుంది. అర్జున్ చాలా కష్టపడి ఈ సినిమాని తెరకెక్కించారు. నిర్మాతలు చాలా ప్యాషన్ తో సినిమాని నిర్మించారు. పాయల్, రాశి చక్కగా నటించారు. విజయ్ మంచి మ్యూజిక్ ఇచ్చారు. సుకుమార్ గారు ఈ వేడుకకు రావడం చాలా ఆనందంగా వుంది. సుకుమార్ గారికి వాళ్ళ టీం అంటే చాలా ఇష్టం. చాలా ప్రేమిస్తారు. మా సినిమాకి సపోర్ట్ చేయడానికి వచ్చిన సుకుమార్ గారికి ప్రత్యేక కృతజ్ఞతలు’ తెలిపారు.

అలాగే ‘ఉప్పెన’, ఇప్పుడు గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ తో వర్క్ చేస్తున్న దర్శకుడు బుచ్చిబాబు సాన మాట్లాడుతూ.. “మేమంతా దర్శకులిగా వచ్చాం అంటే కారణం సుకుమార్ గారు. ఆయన నుంచి ఇంకా చాలా మంది దర్శకులు వస్తారు. సుహాస్ ప్రతి సారి కొత్త కంటెంట్ తో వస్తారు. అర్జున్, సుకుమార్ గారి దగ్గర వర్క్ చేస్తునప్పటినుంచి తెలుసు. అర్జున్ నుంచి చాలా విషయాలు నేర్చుకున్నాను. అర్జున్ అన్న చాలా కష్టపడ్డారు. అర్జున్ చాలా పెద్ద డైరెక్టర్ అవుతారు.ఈ సినిమా పెద్ద హిట్ కావాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను” అని తెలిపారు.

అలాగే మరో యువ దర్శకుడు కార్తిక్ దండు మాట్లాడుతూ..”సుకుమార్ గారి విరూపాక్ష కథ చెప్పినపుడు అర్జున్ కి చెప్పు ఇన్ పుట్స్ ఇస్తాడని అన్నారు. అర్జున్ కథ చెప్పిన తర్వాత చాలా విలువైన సలహాలు ఇచ్చారు. నా విజయంలో ఆయన వున్నారు. ఈ సినిమా కథ తెలుసు. తప్పకుండా పెద్ద విజయం సాధిస్తుంది. కొత్త దర్శకులకు సుహాస్ బెస్ట్ ఆప్షన్ అవుతున్నారు. విజయ్ మంచి మ్యూజిక్ ఇచ్చారు. టీం అందరికీ ఆల్ ది బెస్ట్” చెప్పారు.

ఇక నటుడు, దర్శకుడు శ్రీనివాస అవసరాల మాట్లాడుతూ..”అర్జున్ తో కలసి ఓ షార్ట్ ఫిలిం చేశాను. అర్జున్ దర్శకుడు అవుతాడని చాలా ఎదురుచూశాను. ఇప్పుడు అర్జున్ గురించి మాట్లాడటం చాలా ఆనందంగా వుంది. సుకుమార్ గారు అంటే చాలా ఇష్టం. సుకుమార్ గారి దగ్గర పని చేయడం అదృష్టం. ఆయన దగ్గర చాలా నేర్చుకున్నాను. సుహాస్ గారు ప్రతి సినిమాకి ఎదుగుతున్నారు. ఈ సినిమా కూడా పెద్ద విజయం సాధించి, మంచి పేరు తీసుకురావాలని కోరుకుంటున్నాను. టీం అందరికీ ఆల్ ది బెస్ట్” అని తెలిపారు.

ఇక ఈ చిత్ర దర్శకుడు అర్జున్ మాట్లాడుతూ..”సినిమాని అనుకున్నదాని కంటే చాలా గ్రాండ్ గా చేశాం. నిర్మాతలు చాలా అద్భుతంగా సపోర్ట్ చేశారు. సుహాస్ దర్శకుల నటుడు. ఈజీగా పాత్రలోకి వెళ్ళిపోతారు. దర్శకుడి మనసులో ఏముందో తనకి తెలిసిపోతుంది. శ్రీనివాస్ అవసరాల గారి ఓ షార్ట్ ఫిల్మ్ చేశాను. ఆ అనుభవం చాలా పనికొచ్చింది. బుచ్చి, కార్తిక్, ప్రసన్న ఈ వేడుకకు రావడం అనందంగా వుంది. విజయ్ చాలా మంచి మ్యూజిక్ ఇచ్చారు. డైరెక్షన్ టీం చాలా సపోర్ట్ చేసింది. రాశి, పాయల్ చక్కగా నటించారు. ఈ సినిమాలో పని చేసిన అందరికీ పేరుపేరునా ధన్యవాదాలు. సుకుమార్ గారి దగ్గర నుంచి నా జర్నీ మొదలైయింది. ఆయన దగ్గర ల్యాండ్ అవ్వడంతో మొదట నుంచి ఆయన స్థాయిలో ఆలోచించడం మొదలుపెడతాం. ఆయన ఇచ్చిన జ్ఞానం, చనువు మర్చిపోలేను. ఈ సినిమా చూసి ‘శెబాష్’ అన్నారు. అదొక్కటి చాలు నాకు. ఈ సినిమాని పంపిణీ చేస్తున్న మైత్రీ మూవీస్, హంబలే సంస్థలకు ధన్యవాదాలు. ఫేస్ బ్లైండ్ నెస్ కాన్సెప్ట్ తో వస్తున్నాం. చాలా అద్భుతంగా వచ్చింది. అందరం హ్యాపీగా వున్నాం. ప్రేక్షకులు ఖహ్చితంగా ఎంజాయ్ చేస్తారు. మే3న తప్పకుండా చూడండి” అన్నారు.

హీరోయిన్ రాశి సింగ్ మాట్లాడుతూ.. “ప్రసన్న వదనం యూనిక్ కాన్సెప్ట్. కథ వినగానే వర్క్ అవుట్ అవుతుందనిపించింది. దర్శక, నిర్మాతలకు ధన్యవాదాలు. ఇందులో నా పాత్ర కొత్తగా వుంది. ఈ అవకాశం ఇచ్చిన దర్శకుడు అర్జున్ కి ధన్యవాదాలు. సుహాస్ గారు చాలా నేచురల్ యాక్టర్. ఆయనతో పని చేయడం ఆనందంగా వుంది. ఈ సినిమాలో పని చేసిన అందరికీ పేరుపేరునా ధన్యవాదాలు. మే3న తప్పకుండా సినిమా చూడండి” అని తెలిపింది.

మరో హీరోయిన్ పాయల్ రాధాకృష్ణ మాట్లాడుతూ..”ఈ సినిమాలో అవకాశం ఇచ్చిన దర్శక నిర్మాతలకు ధన్యవాదాలు. సుహాస్ , అర్జున్, రాశి ఇలా మంచి టీంతో ఈ సినిమా చేశాం. ఈ సినిమాలో పని చేయడం చాలా ఆనందంగా వుంది. సినిమా తప్పకుండా అందరినీ అలరిస్తుంది” అని తెలిపింది.

నిర్మాత మణికంఠ మాట్లాడుతూ..”సినిమా చాలా అద్భుతంగా వచ్చింది. సినిమా వందశాతం బ్లాక్ బస్టర్. కలర్ ఫోటో తో నా జర్నీ మొదలైయింది. సుహాస్ కెరీర్ లో నా పేరు ఖచ్చితంగా ఓ పేజీ లో వుంటుంది. మా స్నేహం అలానే వుండాలని కోరుకుంటున్నాను. బుచ్చిబాబు, ప్రసన్న, అవసరాల శ్రీనివాస్, కార్తిక్ ఈ వేడుకకు రావడం ఆనందంగా వుంది. మొదట ఈ కథ అరవింద్ గారు విని చేద్దామనుకున్నారు. రవికాంత్, శ్రీనివాస్, మై హోం రామ్ గారికి ధన్యవాదాలు. రాజేష్ గారు చాలా సపోర్ట్ చేశారు. మా డిస్ట్రిబ్యుటర్స్ మైత్రీ, హంబలే ఫిలిమ్స్ కి ధన్యవాదాలు. దర్శకుడు అర్జున్ అద్భుతంగా తీశాడు. మే3న సినిమా ఖచ్చితంగా చూడండి. సినిమా చాలా బావుటుంది” అన్నారు.

అలాగే మరో నిర్మాత ప్రసాద్ రెడ్డి మాట్లాడుతూ..”సుహాస్ గారితో జర్నీ చాలా బావుంది. రాశి, పాయల్ చక్కగా నటించారు. విజయ్ మంచి మ్యూజిక్ ఇచ్చారు.టీం అందరూ చాలా అద్భుతమైన వర్క్ ఇచ్చారు. మే3న సినిమా విదుదలౌతుంది. తప్పకుండా చూడండి” అని తెలిపారు. ఇలా చిత్ర యూనిట్ అంతా పాల్గొన్న ఈ వేడుకు చాలా గ్రాండ్ గా జరిగింది.

మరోసారి థియేటర్స్ లోకి పవర్ స్టార్ “వకీల్ సాబ్”


పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం పలు భారీ సినిమాలు చేస్తున్న సంగతి తెలిసిందే. మరి వీటికి చిన్న బ్రేక్ ఇచ్చి ఇప్పుడు తను రాజకీయ పనుల్లో బిజీగా ఉన్నారు. అయితే సరైన అప్డేట్స్ లాంటివి లేక పవన్ ఫ్యాన్స్ సతమతమవుతున్న ఈ సమయంలో ఓ సాలిడ్ న్యూస్ బయటకు వచ్చింది. పవన్ 2018 తర్వాత సినిమాలు వదిలేసిన చాలా కాలం తర్వాత చేసిన మాస్ కం బ్యాక్ హిట్ చిత్రం “వకీల్ సాబ్” ఇప్పుడు రీ రిలీజ్ కి సిద్ధం అయ్యింది.

దర్శకుడు వేణు శ్రీరామ్ తెరకెక్కించిన ఈ చిత్రం అలాంటి పీక్ కోవిడ్ సమయంలో కూడా భారీ వసూళ్లు అందుకుంది. దీనితో ఈ సినిమాకి ఆ సమయంలో కూడా మాస్ వేడుకలు జరిగాయి. అయితే ఇప్పుడు మళ్లీ ఈ మే 1న సినిమా థియేటర్లు లోకి రానున్నట్టుగా ఇప్పుడు కన్ఫర్మ్ అయ్యింది. మరి ఈసారి రెస్పాన్స్ ఎలా ఉంటుందో చూడాలి. ఇక ఈ సినిమాలో శృతి హాసన్ హీరోయిన్ గా నటించగా అంజలీ, అనన్య నాగళ్ల, నివేత థామస్ లు ముఖ్యపాత్రలు పోషించారు. అలాగే థమన్ సంగీతం అందించగా దిల్ రాజు నిర్మాణం వహించారు.