గ్రాండ్ గా “వృష‌భ” ట్రైల‌ర్ & లిరికల్ సాంగ్ లాంఛ్ ఈవెంట్!

వీకే మూవీస్ మరియు శ్రీ జె పి ప్రొడక్షన్స్ ప‌తాకాలపై జీవ‌న్ రెడ్డి, అలేఖ్య జంట‌గా ఉమా శంక‌ర్ రెడ్డి నిర్మాత‌గా, మల్లికా రెడ్డి కో ప్రొడ్యూసర్ గా, అశ్విన్ కామ‌రాజ్ కొప్పాల ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతోన్న చిత్రం వృష‌భ‌. ఈ చిత్రానికి సంబంధించిన ట్రైల‌ర్, లిరికల్ సాంగ్ లాంచ్ కార్య‌క్ర‌మం ఈ రోజు దివంగత నటుడు జయప్రకాష్ రెడ్డిగారి జయంతి సందర్భంగా ప్ర‌సాద్ ల్యాబ్స్ లో ఘ‌నంగా జ‌రిగింది.

ఈ కార్య‌క్ర‌మానికి అతిథిగా విచ్చేసిన సీనియ‌ర్ ద‌ర్శ‌కుడు వి.స‌ముద్ర మాట్లాడుతూ, “ట్రైల‌ర్ తో పాటు ఒక పాట విన్నాం చాలా బాగున్నాయి. హీరో, హీరోయిన్స్ చాలా నేచ‌ర‌ల్ గా ఉన్నారు. ద‌ర్శ‌కుడుకి ఈ చిత్రం మంచి పేరు తేవాల‌ని కోరుకుంటూ నిర్మాత‌కు శుభాకాంక్ష‌లు” అని అన్నారు.

ద‌ర్శ‌కుడు రేలంగి న‌ర‌సింహారావు మాట్లాడుతూ, “ట్రైల‌ర్ చూడ‌గానే ఇది డిఫ‌రెంట్ స‌బ్జెక్ట్ అనిపించింది. విన్న పాట కూడా చాలా బావుంది. సంగీతం, సాహిత్యం, సినిమాటోగ్ర‌ఫీ ఆక‌ట్టుకునే విధంగా ఉన్నాయి. జ‌య‌ప్ర‌కాశ్ రెడ్డి గారి కూతురు నిర్మాత‌గా చేయ‌డం సంతోషం. ఈ చిత్రం ద‌ర్శ‌క నిర్మాత‌ల‌కు నా శుభాకాంక్ష‌లు” అని అన్నారు.

సీనియ‌ర్ నిర్మాత దామోదర్ ప్ర‌సాద్ మాట్లాడుతూ, “ట్రైల‌ర్, విన్న పాట, టైటిల్ చాలా బావున్నాయి. క‌ళ ప‌ట్ల అభిమానంతో ఈ టీమ్ సినిమా చేసిన‌ట్లు అర్థ‌మ‌వుతోంది. టీమ్ అంద‌రికీ నా శుభాకాంక్ష‌లు” అని అన్నారు.

ల‌యన్ సాయి వెంక‌ట్ మాట్లాడుతూ, “జ‌య ప్ర‌కాష్ రెడ్డి గారి కూతురు ఈ సినిమాతో కో ప్రొడ్యూస‌ర్ గా ప‌రిచ‌యం అవుతున్నారు. ట్రైల‌ర్, మ్యూజిక్ బాగుంది. గోమాత మీద సినిమా తీయ‌డం ఇదే ప్ర‌థమం. ఈ సినిమా స‌క్సెస్ కావాల‌ని కోరుకుంటున్నా” అని అన్నారు.

న‌టుడు అజ‌య్ ఘోష్ మాట్లాడుతూ, “జేపీ గారి కుమార్తె మ‌ల్లికా రెడ్డి గారి కోసం ఈ ప్రోగ్రామ్ కి వ‌చ్చాను. మ‌ట్టి వాస‌న‌తో కూడిన క‌థ ఇది. ట్రైల‌ర్ నేచ‌ర‌ల్ గా చాలా బావుంది. ఇలాంటి క‌థ‌లతో సినిమాలు మ‌రెన్నో చేయాల‌ని కోరుకుంటూ ఈ టీమ్ అంద‌రికీ నా శుభాకాంక్ష‌లు” అని అన్నారు.

న‌టుడు శివారెడ్డి మాట్లాడుతూ, “ట్రైల‌ర్ చాలా అద్భుతంగా ఉంది. హీరో, హీరోయిన్స్ చాలా నేచ‌ర‌ల్ గా క‌నిపించారు. మ్యూజిక్, సినిమాటోగ్ర‌ఫీ సూప‌ర్బ్ గా ఉంది. ద‌ర్శ‌కుడు టాలెంట్ ఏంటో ట్రైల‌ర్ చూస్తే అర్థ‌మ‌యింది” అని అన్నారు.

విశ్వ కార్తికేయ మాట్లాడుతూ, “వృష‌భ‌ ట్రైల‌ర్ చాలా కొత్త‌గా అనిపించింది. చాలా నేచ‌ర‌ల్ గా సినిమా చేశారు. యూనిట్ అంద‌రికీ నా శుభాకాంక్ష‌లు” అని అన్నారు.

శ‌బ‌రి నిర్మాత‌ మ‌హేంద్ర మాట్లాడుతూ, “నిర్మాత‌లు ఒక ప్యాష‌న్ తో ఈ సినిమా చేశారు. ట్రైల‌ర్, సాంగ్ చాలా బావుంది” అని అన్నారు.

చిత్ర నిర్మాత ఉమా శంకర్ రెడ్డి మాట్లాడుతూ, “నాలుగేళ్ల పాటు ఈ స్టోరి రాసుకున్నాం. ఎన్నో రాత్రులు ఈ సినిమా కోసం శ్ర‌మించాం. 85 శాతం సినిమా పూర్త‌యంది. ద‌ర్శ‌కుడు ఎక్క‌డా రాజీ ప‌డ‌కుండా సినిమా చేశారు. టీమ్ అంతా ఎంతో స‌పోర్ట్ చేశారు. సినిమా కోసం ఎందాకైనా వెళ్తే వ్య‌క్తి మా హీరో. అలాగే మా హీరోయిన్ కూడా ఎంతో క‌ష్ట‌ప‌డ్డారు. మ్యూజిక్ డైర‌క్ట‌ర్ ఎమ్ ఎల్ రాజా అద్భ‌త‌మైన సంగీతాన్ని స‌మ‌కూర్చారు. త్వ‌ర‌లో సినిమాకు సంబంధించిన మిగ‌తా వివ‌రాలు వెల్ల‌డిస్తాం” అని అన్నారు.

మ్యూజిక్ డైర‌క్ట‌ర్ ఎమ్ ఎల్ రాజా మాట్లాడుతూ, “నాకు ఈ చిత్రాన్ని ఇచ్చి మంచి పాట‌లు చేయ‌డానికి స‌పోర్ట్ చేసిన ద‌ర్శ‌క నిర్మాత‌ల‌కు ధ‌న్య‌వాదాలు” అని అన్నారు.

కో ప్రొడ్యూస‌ర్ మ‌ల్లిక రెడ్డి మాట్లాడుతూ, “మా నాన్న‌గారి బ‌ర్త్ డే రోజు మా సినిమాకు సంబంధించిన పాట‌, ట్రైల‌ర్ రిలీజ్ చేయ‌డం సంతోషం. ఈ సినిమాలో నన్ను భాగ‌స్వామిగా చేసిన ఉమా శంక‌ర్ రెడ్డి గారికి ధ‌న్య‌వాదాలు . ఒక మంచి సినిమాలో పార్ట్ కావ‌డం సంతోషంగా ఉంది” అని అన్నారు.

ద‌ర్శ‌కుడు అశ్విన్ కామ‌రాజ్ కొప్పాల మాట్లాడుతూ, “మా ప్రొడ్యూస‌ర్ ఉమా శంక‌ర్ గారు ఒక మంచి క‌థ రాసుకొని న‌న్ను అప్రోచ్ అయ్యారు. ఈ కాన్సెప్ట్ మీద చాలా హార్డ్ వ‌ర్క్ చేసాం. టీమ్ అంతా ఎంతో బాగా స‌హ‌క‌రించారు. హీరో జీవ‌న్ రెడ్డి గారు సినిమా కోసం ప్రాణం పెట్టారు. హీరోయిన్ కూడా ఎంతో శ్ర‌మించారు. సంగీతం, సినిమాటోగ్ర‌ఫీ బాగా కుదిరింది. ఎమ్ ఎల్ రాజా నాకు మంచి మిత్రుడు. అద్భుత‌మైన పాట‌లిచ్చారు. త్వ‌ర‌లో మిగ‌తా పాట‌లు రిలీజ్ చేస్తాం” అని అన్నారు.

హీరోయిన్ అలేఖ్య మాట్లాడుతూ, “మా సినిమా ట్రైల‌ర్, ఈ రోజు విడుద‌లైన పాట‌ను ప్రేక్ష‌కులు ఆద‌రించాల‌ని కోరుకుంటున్నా” అని అన్నారు.

ప్రభాస్ “కల్కి” లో సూపర్ ఫోర్స్.. ఎంతవరకు నిజం?

ప్రస్తుతం మన ఇండియన్ సినిమా దగ్గర భారీ హైప్ లో ఉన్న బిగ్గెస్ట్ చిత్రాల్లో పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ (Prabhas) హీరోగా దీపికా పదుకోణ్ అలాగే యూనివర్సల్ హీరో కమల్ హాసన్, అమితాబ్ బచ్చన్ లాంటి దిగ్గజాల కలయికలో దర్శకుడు నాగ్ అశ్విన్ తెరకెక్కించిన చిత్రం “కల్కి 2898 ఎడి” కూడా ఒకటి. అయితే ఈ చిత్రం విషయంలో ఓ క్రేజీ రూమర్ గత కొన్ని రోజులు నుంచి వినిపిస్తుంది.

దీని ప్రకారం ఈ చిత్రంలో సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రెజెన్స్ కూడా యాడ్ అవుతుంది అని మొదలైంది. కల్కి లో విష్ణు అవతారంకి మహేష్ వాయిస్ ఓవర్ అందిస్తాడు అంటూ కొన్ని పుకార్లు వైరల్ అవుతున్నాయి. అలాగే నేషనల్ డిజిటల్ మీడియాలో కూడా ప్రచారం అవుతుంది. అయితే అసలు ఇందులో ప్రస్తుతానికి ఎలాంటి నిజం లేనట్టు అనుకోవాలి.

ప్రత్యేకంగా వాయిస్ ఓవర్ ఒక్కటే అంటే ఇది అర్ధరహితం అని చెప్పాలి. ఆల్రెడీ విష్ణు అవతారంలో ప్రభాస్ నే కనిపిస్తాడు అని రూమర్స్ ఉన్నాయి. అంటే ప్రభాస్ కి మహేష్ వాయిస్ ఓవరా అనేది వినేందుకు ఒకింత వింతగా ఉంది. మరి ఇలాంటి స్టెప్ మేకర్స్ తీసుకోరనే చెప్పాలి. మరి వేచి చూడాలి ఈ సినిమా విషయంలో ఏమవుతుంది అనేది.

ఓటిటి : ఈ రెండు ప్లాట్ ఫామ్ లలో విజయ్ ఆంటోనీ లేటెస్ట్ సినిమా

కోలీవుడ్ సినిమా నుంచి ఉన్నటువంటి హీరోస్ లో మన తెలుగులో కూడా మంచి ఆదరణ అందుకున్న వారిలో మల్టీ టాలెంటెడ్, నటుడు, దర్శకుడు, సంగీత దర్శకుడు అయినటువంటి విజయ్ ఆంటోనీ కూడా ఒకరు. మరి “బిచ్చగాడు” తో తెలుగు ఆడియెన్స్ కి దగ్గరైన తాను అక్కడ నుంచి మరిన్ని సినిమాలు తెలుగులో విడుదల చేస్తూ వస్తున్నాడు.

అలా ఇటీవల రిలీజ్ చేసిన తాజా చిత్రమే “లవ్ గురు”. తమిళ్ లో రోమియో గా రిలీజ్ చేసిన ఈ సినిమాలో యంగ్ హీరోయిన్ మిర్నాలిని రవి నటించింది. మరి ఈ చిత్రాన్ని ఓటిటి ప్లాట్ ఫామ్ ఆహా వారు మొదట దక్కించుకున్న సంగతి తెలిసిందే. ఇందులో ఈ సినిమా మే 10 నుంచి స్ట్రీమింగ్ కి వస్తున్నట్టుగా ముందు డేట్ లాక్ అయ్యింది.

అయితే ఇప్పుడు దీనితో పాటుగా మరో స్ట్రీమింగ్ యాప్ అమెజాన్ ప్రైమ్ వీడియో వారు కూడా న్యూస్ తీసుకొచ్చారు. ఈ చిత్రం అదే తేదీ నుంచి ప్రైమ్ వీడియోలో కూడా వస్తున్నట్టుగా కన్ఫర్మ్ చేశారు. సో అప్పుడు మిస్ అయ్యినవారు ఈ మే 10 నుంచి ఈ రెండిటిలో చిత్రాన్ని వీక్షించవచ్చు. ఇక ఈ చిత్రానికి వినాయక్ దర్శకత్వం వహించగా భారత్ ధనశేఖర్ సంగీతం అందించారు.

“భారతీయుడు 2” ఆలస్యానికి ఇది మరొక కారణం?

లోక నాయకుడు కమల్ హాసన్ (Kamal Haasan) హీరోగా కాజల్ అగర్వాల్ (Kajal), రకుల్ ప్రీత్ సింగ్ అలాగే సిద్ధార్థ్ ల కలయికలో దర్శకుడు శంకర్ తెరకెక్కిస్తున్న భారీ చిత్రం “ఇండియన్ 2” కోసం అందరికీ తెలిసిందే. మన తెలుగు ఆడియెన్స్ కి మాత్రం “భారతీయుడు” గా సుపరిచితం అయ్యిన ఈ చిత్రం సీక్వెల్ “భారతీయుడు 2” గా అయితే రాబోతుంది.

ఇక ఈ సినిమా విషయంలో మరోసారి సస్పెన్స్ మొదలైంది. అనుకున్న సమయానికి రిలీజ్ లేకపోవడం వాయిదా పడడంతో అంచనాలు మరింత సన్నగిల్లుతున్నాయి. అయితే ఇప్పుడు సినిమా ఆలస్యానికి ఉన్న మరో కారణాల్లో ఇప్పుడు ఓ సాంగ్ షూట్ కూడా అన్నట్టుగా వినిపిస్తుంది.

షూటింగ్ అంతా ఎప్పుడో అయిపోయింది అని కమల్ ప్రకటించారు. కానీ ఇప్పుడు శంకర్ కమల్ పై మరో సాంగ్ తెరకెక్కించనున్నారని రూమర్స్ వినిపిస్తున్నాయి. దీనితో భారతీయుడు 2 ఆలస్యానికి ఇదొక కారణం కూడా కావచ్చని టాక్. మరి అసలు ఈ సినిమా ఎప్పుడు పూర్తవుతుందో ఎప్పుడు రిలీజ్ అవుతుందో చూడాలి.

క్రేజీ : “సలార్” యూనివర్స్ లోకి ఎన్టీఆర్ అడుగు పెడతాడా!?

పాన్ ఇండియా సెన్సేషనల్ హిట్ చిత్రం “సలార్” తో రెబల్ స్టార్ ప్రభాస్ భారీ హిట్ అందుకున్న సంగతి తెలిసిందే. మరి ఈ సినిమాతో మళయాళ ప్రముఖ నటుడు పృథ్వీరాజ్ కూడా టాలీవుడ్ లో సాలిడ్ డెబ్యూ ఇచ్చాడు. అయితే పృథ్వీ తాజాగా చేసిన స్టేట్మెంట్ ఒకటి ఓ రేంజ్ లో వైరల్ గా మారుతుంది. సలార్ లో తమ మన్నార్ పాత్రకి క్రేజీ క్రాస్ ఓవర్ ఉంటుంది అని స్టేట్మెంట్ ఇచ్చాడు.

అయితే ఈ క్రేజీ క్రాస్ ఓవర్ కి ఛాన్స్ కేజీయఫ్ తో తప్పకుండా ఉండకపోవచ్చు ఎందుకంటే ఆల్రెడీ కేజీయఫ్ లో నటులు చాలా మంది సలార్ లో కూడా ఉన్నారు. సో ఇక మిగిలింది తారక్ తో ప్రశాంత్ నీల్ చేయనున్న భారీ సినిమానే అని చెప్పాలి.

మరి ఇది కానీ నిజం అయితే మాత్రం ఆ ఊహ కూడా మామూలు లెవెల్లో లేదు. మరి వేచి చూడాలి ఏమవుతుంది అనేది. ప్రస్తుతం సలార్ 2 పనులు అయితే జరుగుతూ ఉండగా ఎన్టీఆర్ దేవర (Devara), వార్ 2 (War 2) లలో బిజీగా ఉన్నాడు.

చిరంజీవికి “ఆర్య” 3 గంటల కథ చెప్పా – సుకుమార్!

అల్లు అర్జున్ (Allu Arjun) ప్రధాన పాత్రలో, డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన ఆర్య చిత్రం 20 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా ప్రత్యేక ఈవెంట్ ను చిత్ర బృందం నిర్వహించింది. ఈ వేడుకలో డైరెక్టర్ సుకుమార్ చిత్రం కి సంబందించిన ఎన్నో విషయాలు వెల్లడించారు. దిల్ రాజు, అల్లు అర్జున్, అల్లు అరవింద్ ఇతరులు తనకి ఏ విధంగా సహాయ పడ్డారు అనే దానిపై వివరించారు.

అయితే నిర్మాత అల్లు అరవింద్, మెగాస్టార్ చిరంజీవికి కథ చెప్పమని సుకుమార్ ను అడగడం తో, కథ చెప్పేందుకు అద్దం లో చూసి నెల రోజుల పాటు ప్రాక్టీస్ చేసిన విషయాన్ని వెల్లడించారు. ఎంతో కంగారు పడినట్లు తెలిపారు. చిరంజీవికి 20 నిమిషాల్లో కథ చెప్పాలి అని అనడం తో, సుకుమార్ బాగా ప్రిపేర్ అయినట్లు తెలిపారు. అయితే చిరుకి స్టోరీ నచ్చి, 3 గంటల పాటు కథ విని ఎంజాయ్ చేసిన విషయం ను వెల్లడించారు. అంతేకాక చిరు కథకి గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం పట్ల సుకుమార్ థాంక్స్ తెలిపారు. అల్లు అర్జున్ కెరీర్ లో ప్రత్యేక చిత్రం గా నిలిచిన ఆర్య చిత్ర బృందం రీ యూనియన్ అవ్వడం పట్ల అంతా సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

విజయ్ దేవరకొండ భారీ ప్రాజెక్ట్ పై లేటెస్ట్ అప్డేట్.!

యంగ్ హీరో విజయ్ దేవరకొండ నటించిన లేటెస్ట్ చిత్రం “ది ఫ్యామిలీ స్టార్” తో పలకరించిన సంగతి తెలిసిందే. అయితే ఇది అనుకున్న రేంజ్ లో ఆకట్టుకోక పోయినప్పటికీ తన తదుపరి సినిమాలపై సాలిడ్ హైప్ నెలకొనడం గమనార్హం. ఇక ఈ చిత్రాల్లో టాలెంటెడ్ దర్శకుడు గౌతమ్ తిన్ననూరితో ఓ భారీ చిత్రం చేస్తున్న సంగతి తెలిసిందే.

ఈ సినిమా షూటింగ్ కూడా రీసెంట్ గానే హైదరాబాద్ లో మొదలైంది. హైదరాబాద్ లో ఇంట్రెస్టింగ్ యాక్షన్ సీక్వెన్స్ లని వెరైటీ ప్రాపర్టీ వర్క్స్ తో ప్లాన్ చేయగా ఇప్పుడు ఈ చిత్రంపై లేటెస్ట్ అప్డేట్ తెలుస్తుంది. దీనితో ఈ సినిమా షూట్ ఇపుడు వైజాగ్ కి షిఫ్ట్ అయ్యిందట.

ఇక్కడ మేకర్స్ కొన్ని కీలక సన్నివేశాలని తెరకెక్కిస్తున్నారట. ఇక ఈ భారీ చిత్రంలో విజయ్ సరసన మమిత బైజు, భాగ్యశ్రీ బోర్స్ లలో ఒకరు కనిపిస్తారు అని బజ్ ఉండగా అనిరుద్ సంగీతం అందిస్తున్నాడు అలాగే సితార ఎంటర్టైన్మెంట్స్, ఫార్చూన్ ఫోర్ సినిమాస్ వారు భారీ బడ్జెట్ తో నిర్మాణం వహిస్తున్నారు.

స్క్రీన్ ప్లే కరెక్ట్ గా ఉంటే ఇలాంటివి ఎవరు అడగరు అన్నాడు సుక్కు – దేవి శ్రీ ప్రసాద్

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ప్రధాన పాత్రలో, సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన ఆర్య చిత్రం 20 ఏళ్లు పూర్తి చేసుకోవడం తో మేకర్స్ ప్రత్యేక ఈవెంట్ ను ప్లాన్ చేశారు. ఈ వేడుక కి చిత్ర యూనిట్ హాజరు అయ్యింది. 20 ఏళ్ల క్రితం జరిగిన పలు ఆసక్తికర విషయాలను షేర్ చేసుకున్నారు చిత్ర యూనిట్. మ్యూజిక్ డైరెక్టర్ దేవి శ్రీ ప్రసాద్ చేసిన ఆసక్తికర వ్యాఖ్యలు ఇప్పుడు ఫ్యాన్స్ ను అలరిస్తున్నాయి.

ఆర్య నుండి పుష్ప వరకూ ప్రతి సీన్ ను కొత్తగా చూపించేందుకు ఎంత ప్రాణం పెడతారు అనేది అందరికీ తెలుసు. నెవర్ ఎండింగ్ ప్యాషన్ అది. దిల్ రాజు ఆఫీస్ లో ఫస్ట్ టైమ్ సుకుమార్ ను టెర్రస్ మీద కలిశాం అని, కథ చెప్పడం కోసం వాటర్ ట్యాంక్ ఎక్కి కూర్చున్నాము అని, ఫస్ట్ హాఫ్ కథ చెప్పారు అని, ప్రతీ సీన్ కి షాక్ మీద షాక్, ఇలా కూడా స్క్రీన్ ప్లే రైటింగ్ ఉంటదా అని అనుకున్నా అని, స్క్రీన్ ప్లే లో కొత్త యాంగిల్ చూసా అంటూ చెప్పుకొచ్చారు. కథ వింటూనే క్వశ్చన్ అడిగా, హీరోకి మదర, ఫాదర్, ఫ్యామిలీ బ్యాక్ గ్రౌండ్ చెప్పరు ఏంటి అని అడిగా, తను కథ చెప్తూ ఆగి, సినిమాలో స్క్రీన్ ప్లే కరెక్ట్ గా వెళ్తుంటే ఇలా ఎవరూ అడగరు అని సుక్కు అన్నాడు అని తెలిపారు. సినిమా చూసేప్పుడు ప్రతి సీన్ కు ఆడియెన్స్ క్లాప్స్ కొడుతున్నారు కానీ, నిజం గా ఈ క్వశ్చన్ అడగలేదు అంటూ పాత జ్ఞాపకాలు గుర్తు చేసుకున్నారు.

ఆర్య టాలీవుడ్‌లో గేమ్ ఛేంజర్ – అల్లు అర్జున్

అల్లు అర్జున్ ఆర్య సినిమా 20 ఏళ్లు పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా చిత్ర బృందం హైదరాబాద్‌లో ఓ ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహించింది. ఈ సందర్భంగా అల్లు అర్జున్ మాట్లాడుతూ, ఆ రోజుల్లో సినిమా 10 వారాలు నడిస్తే యావరేజ్ గ్రాసర్‌గా పరిగణిస్తాం. సుకుమార్ గారు, నేనూ రిలీజ్ రోజు ఫస్ట్ షోకి వెళ్లాం. థియేటర్ 40 శాతం ఫుల్ అయింది. ఈ చిత్రం మెల్లగా పుంజుకుంటుందనే నమ్మకంతో, ఇది 10 వారాల సినిమా అని రిపోర్టులు చెబుతున్నాయి.

అల్లు అర్జున్ మాట్లాడుతూ, “అల్లు అరవింద్ గారు 10 వారాలు అంటే చిన్న విజయం కాదు, ఎందుకంటే చాలా మంది నటీనటులు మరియు సిబ్బంది కొత్తవారు అని అన్నారు. నేను చాలా బాధపడ్డాను. నేను చెప్పాను, ఆర్య 125 రోజులు ఆడుతుంది నాన్న అని, నా మాటలు నిజమయ్యాయి. చిరంజీవి గారి నుంచి షీల్డ్ అందుకున్నాను. ఈ సినిమా టాలీవుడ్‌లో గేమ్ ఛేంజర్. అది దిల్ రాజు గారిని స్టార్ ప్రొడ్యూసర్ ని చేసింది. సుకుమార్ గారు నా జీవితంలో పెద్ద పిల్లర్ లలో ఒకరు. గంగోత్రి హిట్‌గా నిలిచినా ఒక్క మార్కు కూడా వదలలేకపోయాను. ఆర్య ద్వారా నేను వెలుగులోకి వచ్చాను. దేవిశ్రీ ప్రసాద్ సినిమాను మరో స్థాయికి తీసుకెళ్లాడు. అతని పాటలు ఆర్యకు కొత్త ఉత్సాహాన్ని ఇచ్చాయి.

ఇప్పుడు సుకుమార్ గారు గేమ్‌లో అగ్రస్థానంలో ఉన్నారు. ఆయన ఇండియాలోనే నెం.1 డైరెక్టర్‌గా ఎదగబోతున్నారు. దిల్ రాజు దేశంలోనే భారీ చిత్రాలను నిర్మిస్తున్నారు. DSP వేలకోట్లు వసూలు చేస్తున్న ఆల్బమ్‌లను ఇస్తున్నారు. నా కెరీర్‌లో ఆర్యను ప్రత్యేక చిత్రంగా తీర్చిదిద్దినందుకు ప్రేక్షకులకి థాంక్స్ అని అన్నారు.

టీవీ ప్రీమియర్ కి రెడీ అయిన “సుందరం మాస్టర్”

ప్రముఖ కమెడియన్ హర్ష చెముడు టైటిల్ రోల్ లో, డైరెక్టర్ కళ్యాణ్ సంతోష్ దర్శకత్వం లో తెరకెక్కిన చిత్రం సుందరం మాస్టర్. ఈ చిత్రం థియేటర్ల లో రిలీజ్ అయ్యి, ప్రేక్షకులను అలరించడం లో విఫలం అయ్యింది. ఈ చిత్రం ఇప్పుడు వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్ గా బుల్లితెర ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ప్రముఖ టీవీ ఛానల్ అయిన ఈటీవీ ఈ చిత్రం యొక్క శాటిలైట్ హక్కులను సొంతం చేసుకుంది.

ఈ ఆదివారం సాయంత్రం 6:30 గంటలకి ఈటీవీ లో సుందరం మాస్టర్ ప్రసారం కానుంది. దివ్య శ్రీపాద, బాలకృష్ణ నీలకంటపు, భద్రం తదితరులు కీలక పాత్రల్లో నటించిన ఈ చిత్రానికి శ్రీ చరణ్ పాకాల సంగీతం అందించారు. ఈ చిత్రానికి టాలీవుడ్ స్టార్ హీరో రవితేజ మరియు సుధీర్ కుమార్ లు నిర్మాతలు గా వ్యవహరిస్తున్నారు. బుల్లితెర పై ఈ చిత్రం ఎలాంటి రెస్పాన్స్ ను సొంతం చేసుకుంటుందో చూడాలి.

“ఆర్య” చిత్రం లోకి బన్నీ ఎలా ఎంటర్ అయ్యాడో తెలిపిన దిల్ రాజు, సుకుమార్!

స్టార్ హీరో అల్లు అర్జున్ ప్రధాన పాత్రలో, స్టార్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన ఆర్య చిత్రం 20 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా చిత్ర యూనిట్ స్పెషల్ ఈవెంట్ ను నిర్వహించడం జరిగింది. ఈ ఈవెంట్ లో 20 ఏళ్ల నాటి జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నారు చిత్ర బృందం. ఈ మేరకు సినిమాలోకి బన్నీ ఎలా ఎంటర్ అయ్యాడో నిర్మాత దిల్ రాజు మరియు డైరెక్టర్ సుకుమార్ లు స్టేజి పై వివరించారు.

దిల్ చిత్రం సక్సెస్ తర్వాత సుకుమార్ స్క్రిప్ట్ తో సినిమా చేసేందుకు రెడీ అయిపోయారు దిల్ రాజు. దిల్ మూవీ స్పెషల్ ప్రీమియర్ రోజున బన్నీని చూసి, సుకుమార్ ఎగ్జైట్ అయిన విషయాన్ని వెల్లడించారు. చాలా ఎనర్జిటిక్ గా బన్నీ ఉండేవాడు అని ఇమిటేట్ చేస్తూ తెలిపారు. ఎన్నో కథలు విన్న బన్నీ, ఆ తర్వాత తను చెప్పడంతో సుకుమార్ కథను నేరేట్ చేశారు అని దిల్ రాజు అన్నారు. బన్నీ కి కథ ఓకే అయిన తర్వాత అల్లు అరవింద్ స్క్రీన్ లోకి ఎంటర్ అయిన విషయాన్ని వివరించారు. అల్లు అరవింద్ కి పలుమార్లు స్క్రిప్ట్ వినిపించడం తో విసుగు చెందిన సుకుమార్, తన ఊరికి వెళ్తా అంటూ చెప్పిన విషయాన్ని వెల్లడించారు.

అయితే ఒక్క పాఠం ను వందసార్లు చెప్పడం అనే చిరాకు తో టీచర్ జాబ్ వదిలేసిన విషయాన్ని సుకుమార్ తెలిపారు. మొత్తం గా ఆల్లు అరవింద్ స్క్రిప్ట్ ను ఓకే చేశాక, బన్నీ ఎంటర్ అయినట్లు తెలిపారు. సినిమా కోసం అందరూ కూడా ఎంతో కష్టపడినట్లు దిల్ రాజు, సుకుమార్ లు తెలిపారు.

ఖమ్మం లో విక్టరీ వెంకటేష్…అసలు కారణం ఇదే!

టాలీవుడ్ స్టార్ హీరో విక్టరీ వెంకటేష్ మంగళవారం సాయంత్రం ఖమ్మంలో ప్రత్యేక పర్యటన చేశారు. ఖమ్మం మరియు పరిసర ప్రాంతాల నుండి వందలాది మంది వెంకీ అభిమానులు తమ అభిమాన హీరోని చూసేందుకు కాంగ్రెస్ ఖమ్మం లోక్‌సభ అభ్యర్థి పి.రఘురామ్ రెడ్డి నివాసానికి తరలివచ్చారు. బాల్కనీ నుండి అభిమానులని పలకరించాడు వెంకీ.

అభిమానులకు శుభాకాంక్షలు తెలిపిన ఫోటోలు మరియు వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. రఘురామ్ రెడ్డి వెంకీ కూతురు ఆశ్రిత దగ్గుబాటి మామ అని అందరికీ తెలిసిందే. పోలింగ్‌కు ముందు నటుడు, రఘురాంరెడ్డి ప్రచారం కోసం పట్టణంలో ఉన్నారు. కొద్ది రోజుల క్రితం ఖమ్మంలో తన మామగారి కోసం ప్రచారం చేసింది ఆశ్రిత. తన మామగారు ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నెరవేరుస్తారని హామీ ఇచ్చారు. రాజకీయాలకు ఎప్పుడూ దూరంగా ఉండే వెంకీ బుధవారం రోజున రోడ్ షోను ఎలా నిర్వహిస్తారనేది ఆసక్తికరంగా మారింది.

సలార్: ప్రశాంత్ చెప్పిన అన్ని కథల్లో, శివ మన్నార్ కథ చాలా బాగుంది – పృథ్వీరాజ్ సుకుమారన్

రెబల్ స్టార్ ప్రభాస్ ప్రధాన పాత్రలో, కన్నడ స్టార్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ దర్శకత్వం లో తెరకెక్కిన యాక్షన్ ఎంటర్టైనర్ సలార్. ఈ చిత్రం గతేడాది థియేటర్ల లో రిలీజ్ అయ్యి ప్రేక్షకులను, అభిమానులని విశేషం గా ఆకట్టుకుంది. బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లను రాబట్టడం జరిగింది. ఈ చిత్రం సెకండ్ పార్ట్ ను కూడా అనౌన్స్ చేసిన సంగతి అందరికీ తెలిసిందే. అయితే ఈ చిత్రం లో ప్రభాస్ కి స్నేహితుడు గా పృథ్వీరాజ్ సుకుమారన్ నటించారు. శివ మన్నార్ గా అధ్బుతమైన నటన కనబరిచి ప్రేక్షకులని అలరించారు. తాజాగా ఈ పాత్ర గురించి పలు ఆసక్తికర విషయాలు వెల్లడించారు.

ప్రశాంత్ తనకు చెప్పిన అన్ని కథల్లో, శివ మన్నార్ కథ చాలా బాగుంది అని అన్నారు. అంతేకాక మరొక యూనివర్స్ తో నమ్మశక్యం కానీ క్రాస్ ఓవర్ ఉంది అంటూ చెప్పుకొచ్చారు. ఈ కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఈ కామెంట్స్ తో సెకండ్ పార్ట్ పై ప్రేక్షకుల్లో మరింత అంచనాలు పెరిగాయి. అయితే కేజీఎఫ్ సిరీస్ చిత్రాలతో ప్రశాంత్ నీల్ కి దేశ వ్యాప్తంగా సూపర్ క్రేజ్ ఏర్పడింది. ఈ శివ మన్నార్ పాత్ర కేజీఎఫ్ తో లింక్ ఉందా లేదా అనేది తెలియాలంటే వేచి చూడాల్సిందే.

సలార్ చిత్రం లో శృతి హాసన్ హీరోయిన్ గా నటిచగా, శ్రియా రెడ్డి, ఈశ్వరి రావు, జగపతి బాబు తదితరులు కీలక పాత్రల్లో నటించారు. హోంబలే ఫిల్మ్స్ బ్యానర్ పై నిర్మించిన ఈ చిత్రానికి రవి బస్రూర్ సంగీతం అందించారు.

బాలీవుడ్ వకీల్ సినిమాపై కేసు.. వివరాలు ఇవే

బాలీవుడ్ సినిమా దగ్గర ఫ్రాంచైజ్ గా ఎప్పుడు నుంచో పలు చిత్రాలు ఉన్నాయి. మరి అలాంటి చిత్రాల్లో స్టార్ హీరో అక్షయ్ కుమార్ అలాగే అర్షద్ వర్షి కాంబినేషన్ లో వచ్చిన వకీల్ సినిమా “జాలీ ఎల్ ఎల్ బి” కూడా ఒకటి. అయితే 2013 లో మొదలైన ఈ సినిమా ఈ ఫ్రాంచైజ్ ఇపుడు మూడో చిత్రానికి చేరుకుంది. అయితే ఇప్పుడు చిత్రీకరణ జరుపుకుంటున్న ఈ సినిమాపై న్యాయ వ్యవస్థ వైపు నుంచి పని చేస్తున్న ఓ ప్రముఖులే కేసు వేసి షాకిచ్చారు.

ఇక మరిన్ని వివరాల్లోకి వెళితే 2013, 2017 లో వచ్చిన రెండు సినిమాలని జిల్లా బార్ అసోసియేషన్ ప్రెసిడెంట్ చంద్రభాన్ చూసారు. చూసిన తర్వాత వెంటనే పార్ట్ 3 షూట్ ని నిలిపివేయాలని కేసు వేసారట. అయితే తాను చూసిన ఈ రెండు సినిమాల్లో కూడా, న్యాయ వ్యవస్థ పట్ల నటీనటులకు కానీ మేకర్స్ కి కానీ ఏమాత్రం గౌరవం లేనట్టుగా అనిపించింది అని అలాగే న్యాయ వ్యవస్థతో పాటుగా తీర్పు చెప్పే న్యాయమూర్తి అన్నా కూడా ఎలాంటి గౌరవం వారికి లేదు అన్నట్టు అనిపించింది అని వారు పేర్కొన్నారు.

ప్రస్తుతం అయితే ఈ సినిమా ఈ కేసు విషయంలో ఇరుక్కుంది. మరి చూడాలి చివరికి ఎవరు గెలుస్తారు అనేది. ఇక ఈ చిత్రాన్ని దర్శకుడు సుభాష్ కపూర్ దర్శకత్వం వహిస్తుండగా ఫాక్స్ స్టార్ స్టూడియోస్ వారు నిర్మాణం వహిస్తున్నారు.

బాహుబలి సిరీస్ ను వదులుకోవడం పై రాజమౌళి కామెంట్స్!

రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన బాహుబలి సిరీస్ చిత్రాలు ప్రపంచ వ్యాప్తంగా ఎంతో క్రేజ్ ను సొంతం చేసుకున్నాయి. తెలుగు సినీ పరిశ్రమ గర్వ పడే విధంగా బాహుబలి ను తెరకెక్కించి జక్కన్న అందరి ప్రశంసలు అందుకున్నారు. అయితే బాహుబలి క్రౌన్ ఆఫ్ బ్లడ్ యానిమేటెడ్ సిరీస్ ను చాలా కష్టంగా వదిలేసినట్లు వెల్లడించారు. నేడు మీడియా తో జరిగిన ఇంటరాక్షన్ లో రాజమౌళి పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

బాహుబలి ను వదులుకోవడం అనే నిర్ణయం చాలా కష్టం గా అనిపించింది అని, అయితే అలా చేయడం తప్పలేదు అని అన్నారు. బాహుబలి సిరీస్ ను తీసేముందు, పాత్రలు, ఆ జర్నీ మరోసారి గుర్తు చేసుకున్న విషయాన్ని వెల్లడించారు. ఇది ప్రీక్వెల్ కాదు. ఇది మీకు ఇప్పటికే తెలిసిన కథ మధ్యలో వచ్చినట్లు అనిపిస్తుంది. మేము ఈ కథను విస్తరించే అవకాశం గురించి ఇందులో మాట్లాడాము అని అన్నారు.

ఇంట్రెస్టింగ్ పాయింట్ తో ఎండ్ కానున్న “బాహుబలి క్రౌన్ ఆఫ్ బ్లడ్”

బాహుబలి చిత్రాలతో భారతీయ చిత్ర పరిశ్రమ ప్రపంచ వ్యాప్తంగా ఎంతో గుర్తింపు తెచ్చుకుంది. బాహుబలి బిగినింగ్ కి ప్రీక్వెల్ ను బాహుబలి క్రౌన్ ఆఫ్ బ్లడ్ పేరిట యానిమేటెడ్ సిరీస్ గా తెరకెక్కించారు మేకర్స్. ప్రముఖ ఓటిటి ప్లాట్ ఫామ్ డిస్నీ ప్లస్ హాట్ లో ఈ యానిమేటెడ్ సిరీస్ మే 17 నుండి స్ట్రీమింగ్ కి అందుబాటులో ఉండనుంది. ఈ సిరీస్ కి సంబందించిన తెలుగు ట్రైలర్ ను విడుదల చేయగా, మంచి రెస్పాన్స్ వచ్చింది. నేడు ఈ సిరీస్ కోసం మీడియా తో మేకర్స్ ఇంటరాక్ట్ అయ్యారు. ఈ మేరకు పలు ఆసక్తికర విషయాలు వెల్లడించారు.

9 ఎపిసోడ్ లు కలిసి ఉన్న ఈ సిరీస్ అత్యంత ఆసక్తికరం గా సాగనుంది. కట్టప్ప, బాహుబలి ను ఎందుకు చంపాడు అనే తరహాలో, సిరీస్ చివరలో ఎలాంటి క్లూ లేని ఒక ఇంట్రెస్టింగ్ పాయింట్ తో ముగియనుంది. దీన్ని బట్టి, సెకండ్ సీజన్ కి ఆస్కారం ఉంది. ఈ సిరీస్ లో బాహుబలి, భళ్లాల దేవ వీరోచిత ప్రదర్శనలు ఉన్నాయి. రక్తదేవ్ అనే పాత్ర ఎంటర్ టైనింగ్ గా సాగనుంది. ది లెజండ్ ఆఫ్ హనుమాన్ ను తెరకెక్కించిన కంగ్ మరియు నవీన్ జాన్ లు ఈ సిరీస్ కి దర్శకత్వం వహించగా, రాజమౌళి, శోభు యార్లగడ్డ, దేవరాజన్ లు నిర్మించారు. ఈ సిరీస్ తెలుగు లో కూడా అందుబాటులోకి రానుండటం తో బాహుబలి ఫ్యాన్స్ సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

బాహుబలి వేరే మీడియా లో కూడా రాబోతుంది – ఎస్.ఎస్.రాజమౌళి!

జక్కన్న రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన బాహుబలి సిరీస్ చిత్రాలు వరల్డ్ వైడ్ గా సూపర్ క్రేజ్ ను సొంతం చేసుకున్నాయి. ఈ చిత్రాలకి ప్రీక్వెల్ గా తెరకెక్కిన బాహుబలి క్రౌన్ ఆఫ్ బ్లడ్ యానిమేటెడ్ సిరీస్ కి సంబందించిన పలు ఆసక్తికర విషయాలు వెల్లడించారు మేకర్స్. నేడు మీడియా తో జరిగిన ఇంటరాక్షన్ లో పలు విషయాలు వెల్లడించారు. ముఖ్యం గా బాహుబలి ను అంతర్జాతీయం గా అందరికీ తెలిసేలా ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది.

బాహుబలి అనేది చాలా ప్లాట్ ఫామ్ లలో రాబోతుంది అని, చాలా రకాలుగా రానుంది అని అన్నారు. అంతేకాక ఈ యానిమేటెడ్ సిరీస్ కేవలం ప్రారంభం మాత్రమే అని అన్నారు అందుకు వేరే ప్లాన్ చేసినట్లు తెలిపారు. వివరాలు వెల్లడించడానికి ఇది సరైన ప్లాట్ ఫామ్ కాదని అన్నారు రాజమౌళి. ఈ యానిమేటెడ్ సిరీస్ పై ప్రేక్షకుల్లో, అభిమానుల్లో క్యూరియాసిటి నెలకొంది. డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో మే 17 నుండి ఈ సిరీస్ ప్రసారం కానుంది.

సెన్సార్ పూర్తి చేసుకున్న “ప్రతినిధి 2”

నారా రోహిత్ ప్రధాన పాత్రలో, ప్రముఖ జర్నలిస్ట్ మూర్తి దర్శకత్వం లో తెరకెక్కిన పొలిటికల్ డ్రామా ప్రతినిధి 2. ప్రతినిధి ఫ్రాంచైజీలో ప్రతినిధి 2 రెండవ చిత్రం. ప్రతినిధి 2 చిత్రం మే 10న థియేటర్ల లోకి రానుంది. ఏపీ అసెంబ్లీ ఎన్నికలకు మూడు రోజుల ముందు ఈ చిత్రం విడుదల కాబోతోంది. మరి ఈ సినిమా ప్రేక్షకులను అలరిస్తుందో లేదో చూడాలి. తాజాగా ఈ చిత్రం సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసుకుంది. సెన్సార్ బోర్డు వారు యూ/ఏ సర్టిఫికెట్ ను ఇచ్చారు. ఈ చిత్రం రన్ టైమ్ ను ఫిక్స్ చేసుకుంది.136 నిమిషాల నిడివి తో సినిమా ఉండనుంది.

చిత్రం నుండి రిలీజైన టీజర్, ట్రైలర్‌కు మంచి ఆదరణ లభించింది. నారా రోహిత్ నిజాయితీ గల న్యూస్ రిపోర్టర్‌గా నటించాడు. సిరీ లెల్లా కథానాయికగా నటించగా, దినేష్ తేజ్, సప్తగిరి, జిషు సేన్‌గుప్తా, సచిన్ ఖేడేకర్ కీలక పాత్రల్లో నటించారు. పొలిటికల్ యాక్షన్ డ్రామాని వానరా ఎంటర్టైన్మెంట్స్ మరియు రానా ఆర్ట్స్ బ్యానర్‌లపై కుమార్ రజ బత్తుల, ఆంజనేయులు శ్రీ తోట మరియు సురేంద్రనాథ్ బొల్లినేని నిర్మించగా, మహతి స్వర సాగర్ ఈ చిత్రానికి సంగీతం అందించారు.

డిజిటల్ ప్రీమియర్ కి సిద్ధమైన “ఆవేశం”

Aavesham

టాలెంటెడ్ యాక్టర్ ఫాహద్ ఫాసిల్ నటించిన లేటెస్ట్ మూవీ ఆవేశం బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లతో దూసుకు పోతుంది. జిత్తు మాధవన్ రచన మరియు దర్శకత్వం వహించిన ఈ చిత్రం 150 కోట్ల రూపాయలకి పైగా వసూళ్లు సాధించి, సెన్సేషన్ క్రియేట్ చేస్తోంది. ఈ చిత్రం ఇప్పుడు డిజిటల్ ప్రీమియర్ కి సిద్ధంగా ఉంది. ఈ చిత్రం యొక్క డిజిటల్ హక్కులని సొంతం చేసుకున్న అమెజాన్ ప్రైమ్ వీడియోలో మే 9, 2024న నుండి ప్రసారం కానుంది .

ప్రైమ్ వీడియో మలేషియా అధికారిక సోషల్ మీడియా హ్యాండిల్స్ ఆ తేదీన ఈ చిత్రం విడుదల కానుందని ధృవీకరించింది. ప్రీమియర్ తేదీ సాధారణంగా అన్ని ప్రాంతాలకు ఒకే విధంగా ఉన్నప్పటికీ, అమేజాన్ ప్రైమ్ వీడియో ఇండియా నుండి అధికారిక ప్రకటన కోసం వేచి ఉండటం మంచిది. మరి తెలుగు డబ్బింగ్ వెర్షన్ అందుబాటులోకి వస్తుందా లేదా అనేది తెలియాలంటే వేచి చూడాల్సిందే.

అన్వర్ రషీద్ ఎంటర్టైన్మెంట్స్ మరియు ఫాహద్ ఫాసిల్ అండ్ ఫ్రెండ్స్ బ్యానర్‌లపై నిర్మించిన ఈ చిత్రం లో హిప్‌స్టర్, రోషన్ షానవాస్, మిథున్ జై శంకర్, సజిన్ గోపు మరియు మన్సూర్ అలీ ఖాన్ కీలక పాత్రల్లో నటించారు. సుశిన్ శ్యామ్ ఈ చిత్రానికి సంగీతం అందించారు.

బాలయ్యతో మరోసారి ఈ స్టార్ హీరోయిన్.. కానీ


ప్రస్తుతం నందమూరి నటసింహం నందమూరి బాలకృష్ణ (Balakrishna) హీరోగా దర్శకుడు బాబీ కొల్లి కాంబినేషన్ లో చేస్తున్న అవైటెడ్ పాన్ ఇండియా సినిమా కోసం అందరికీ తెలిసిందే. ఈ చిత్రం బాలయ్య కెరీర్ లో 109వ సినిమాగా (NBK 109) తెరకెక్కిస్తుండగా ఈ చిత్రం కోసం అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. అయితే ఈ సినిమా షూటింగ్ కూడా చాలానే పూర్తయ్యింది.

అయితే ఈ అన్నిటిలో అసలు బాలయ్య సరసన హీరోయిన్ గా ఎవరు నటిస్తారు అనేది సస్పెన్స్ గా మారింది. బాలీవుడ్ బ్యూటీ ఊర్వశి రౌటేలా(Urvashi Rautela) ఈ సినిమాలో ఓ పోలీస్ పాత్రలో నటిస్తున్నట్టుగా ఆమెనే తెలిపింది కానీ ఆమె హీరోయిన్ గా కాకుండా ముఖ్య పాత్రలో కనిపిస్తుంది అని టాక్. అయితే ఇప్పుడు మరో స్టార్ హీరోయిన్ పేరు ఇప్పుడు వినిపిస్తుంది.

లేటెస్ట్ రూమర్స్ ప్రకారం ఈ చిత్రంలో కాజల్ అగర్వాల్ నటిస్తుంది అని వినిపిస్తుంది. గతంలో ఆల్రెడీ “భగవంత్ కేసరి” లో బాలయ్య సరసన కాజల్ నటించిన సంగతి తెలిసిందే. దీనితో రెండో సారి ఇద్దరూ స్క్రీన్ షేర్ చేసుకోనున్నారని నయా రూమర్స్. కానీ ఇక్కడ ఇంట్రెస్టింగ్ అంశం ఏమిటంటే కాజల్ హీరోయిన్ పాత్రలా కాకుండా నెగిటివ్ షేడ్స్ ఉండేలా కనిపిస్తుంది అంటూ రూమర్స్ వినిపిస్తున్నాయి. మరి ఇందులో ఎంతవరకు నిజం ఉందో వేచి చూడాలి.

క్రేజీ : ఓటిటిలో “ది ఫ్యామిలీ స్టార్” తో విజయ్ స్టార్ పవర్


టాలీవుడ్ రౌడీ హీరో విజయ్ దేవరకొండ హీరోగా మృణాల్ ఠాకూర్ హీరోయిన్ గా దర్శకుడు పరశురామ్ పెట్ల తెరకెక్కించిన లేటెస్ట్ చిత్రం “ది ఫ్యామిలీ స్టార్” కోసం అందరికీ తెలిసిందే. అయితే ఈ చిత్రం థియేట్రికల్ గా అనుకున్న రేంజ్ లో సక్సెస్ కాలేకపోయింది. కానీ ఈ చిత్రం ఓటిటి లోకి వచ్చేసింది. ప్రముఖ సంస్థ అమెజాన్ ప్రైమ్ వీడియోలో రిలీజ్ కి రాగా మొదట్లో కొన్ని ట్రోల్స్ వచ్చాయి కానీ ఈ సినిమా మాత్రం సాలిడ్ రెస్పాన్స్ ని ఓటిటిలో అందుకుంది.

వచ్చిన ఒక్క రోజులోనే ఇండియా వైడ్ గా నెంబర్ 1 స్థానంలో ట్రెండ్ అవుతూ ఉండగా ఇది ఇప్పటికీ కొనసాగుతూ ఉండడం గమనార్హం. ఓటిటిలో అయినా అదే కంటెంట్ ఉంటుంది అయినా కూడా ఇప్పటికీ ఈ సినిమా ఓటిటిలో ట్రెండ్ అవుతూ ఉండడం అనేది విజయ్ స్టార్ పవర్ అనే చెప్పాలి. మరి ఇంకా ఎన్ని రోజులు వరకు ఈ సినిమా ట్రెండ్ లో ఉంటుందో చూడాలి. ఇక ఈ చిత్రానికి గోపి సుందర్ సంగీతం అందించగా దిల్ రాజు నిర్మాణం వహించారు.