అంబేద్కర్ విగ్రహావిష్కరణ సభలో ఆకట్టుకున్న వైయస్ జగన్ ప్రసంగం

అంబేద్కర్ విగ్రహావిష్కరణ సభలో ఆకట్టుకున్న వైయస్ జగన్ ప్రసంగం

Published on Jan 19, 2024 2:00 AM IST

మొన్న విజయవాడ నడిబొడ్డున డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి స్టాట్యూ ఆఫ్ సోషల్ జస్టిస్ విగ్రహ ప్రతిష్ఠా కార్యక్రమం వేలాదిమంది ప్రజలు, పలువురు నాయకులు, ప్రముఖుల సమక్షంలో ఎంతో వైభవంగా జరిగింది. ఈ సందర్భంగా సీఎం వైయస్ చేసిన ప్రసంగం ఆలోచనాత్మకంగా ఉంది. ఒకనాడు మానసమాజంలో ప్రబలంగా ఉండే అంటరానితనం ఇప్పుడూ ఉంది. కాకుంటే అది రూపు మార్చుకుంది వేరే రూపంలో అది సమాజాన్ని కాల్చుకుతింటోంది అంటూ సీఎం వైయస్ జగన్ ప్రసంగం ఆహుతులను ఆకట్టుకుంది. పేదలు చదివే స్కూళ్లను పట్టించుకోకపోవడం అంటరానితనమే. పేదలకు ఇళ్లు ఇస్తుంటే అడ్డుకోవడం కూడా అంటరానితనమే. 

పేదలు ప్రయాణించే ఆర్టీసీని పేదప్రజలు వచ్చే ప్రభుత్వ ఆస్పత్రులను నిర్వీర్యం చేయడం కూడా అంటరానితనమే అంటూ రాష్ట్రంలో పెత్తందారి వ్యవస్థను ఆయన ఎండగట్టారు. పేద పిల్లలకు ట్యాబ్‌లు ఇస్తుంటే వికృత వార్తలు రాయడం అంటరానితనమే. మీడియా సంస్థలు ఈ వెనుకబడిన వర్గాల ప్రజలు ఎదగడాన్ని సహించడంలేదు. పేద పిల్లలు ఎప్పటికీ పనివాళ్లుగా ఉండిపోవాలా ఇలాంటి ఆలోచనలు కూడా అంటరానితనమే అని చెప్పవచ్చు అంటూ ఎల్లో మీడియా రాస్తున్న రాతలపై ఆయన విరుచుకుపడ్డారు. ఇకమీదట వారి పోకడలు చెల్లవు. మీకోసం నేనున్నాను మీకు అండగా నేనుంటాను. బడుగు వర్గాల కోసం సామాజిక న్యాయ మహా శిల్పం కింద మహనీయుడు అంబేదర్కర్ విగ్రహాన్ని ఏర్పాటు  చేసుకున్నామని అణగారిన వర్గాలకు సీఎం జగన్ భరోసా ఇచ్చారు. 

మన ప్రభుత్వం వచ్చాకనే బలహీనవర్గాలకు రాజకీయ ప్రాధాన్యం దక్కింది. శాసన మండలిలో 29 మంది సభ్యులు బలహీన వర్గాలకు చెందిన వారే. ఎనిమిది మందిని రాజ్యసభకు పంపింతే అందులో సగం ఎస్సీ, బీసీలే. 13 జడ్పీ ఛైర్మన్లలో 9 మంది బలహీన వర్గాల వారేనని వైసీపీ ప్రభుత్వం ఎస్సీ, ఎస్టీ బిసీ, మైనార్టీ వర్గాలకు ఇస్తున్న ప్రాధాన్యం గురించి సీఎం జగన్ వివరించారు. అంబేద్కర్ అంటే పెత్తందారులకు అసహ్యం. దళిత, బలహీన వర్గాలపై చంద్రబాబుకు ప్రేమే లేదు. పెత్తందారి పార్టీలకు,పెత్తందారీ నేతలకు దళితులంటే చులకన, అంబేద్కర్ స్ఫూర్తితోనే అందరినీ ఒక్కతాటిపై నిలబెడుతున్నాం. స్టాట్యూ ఆఫ్‌ సోషల్‌ జస్టిస్‌ అంటే ఇకపై విజయవాడ గుర్తొస్తుంది. మరోపక్క సామాజిక చైతన్యవాడలా విజయవాడ కనిపిస్తోందని సీఎం వైయస్ జగన్ చేసిన ప్రసంగంపై ప్రశంసల జల్లులు కురుస్తున్నాయి. దళితజాతికి, బహుళజనులకు అభినందనలు తెలియజేస్తూ జగన్ చేసిన ప్రసంగం ఆహుతులను ఉర్రూతలూగించింది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు