ఏపీ అసెంబ్లీ ఎన్నికల పై ఎలెక్సెన్స్ సర్వేలో వైసిపికి మెజారిటీ

ఏపీ అసెంబ్లీ ఎన్నికల పై ఎలెక్సెన్స్ సర్వేలో వైసిపికి మెజారిటీ

Published on Apr 15, 2024 12:11 AM IST

రానున్న ఏపీ అసెంబ్లీ ఎన్నికల పై ప్రస్తుతం అందరిలో ఎంతో ఫోకస్ ఉంది. గడచిన ఐదేళ్లలో చేసిన అభివృద్ధి సంక్షేమం బేస్ చేసుకుని మరొక్కసారి ప్రజల వద్దకు వెళ్లి విజయం అందుకునే దిశగా కొనసాగుతోంది అధికార వైసిపి పార్టీ. ఇక ఎలక్షన్ క్యాంపైన్ లో భాగంగా ఇప్పటికే వైసిపి అధినేత మరియు ప్రస్తుత ఏపీ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి రాష్ట్రవ్యాప్తంగా బస్సు యాత్రకు శ్రీకారం చుట్టారు. 

ఇక ఆయన వెళ్లిన ప్రతి చోట ప్రజల నుండి విశేషమైన స్పందన లభిస్తోంది. మరోవైపు ఇటీవల పలు నేషనల్ సర్వేల ఫలితాల ప్రకారం ఏపీలో మరొక్కసారి వైసిపినే అధికారాన్ని చేపట్టే అవకాశం ఉందని చెప్తున్నాయి .ఇక తాజాగా ఏపీలో వచ్చేది మళ్లీ వైఎస్‌ జగనే అంటూ ఎలెక్సెన్స్ సర్వే తేల్చింది. మార్చి 25 నుంచి ఏప్రిల్ 12 వరకు వారు 86,200 నమూనా పరిమాణాలని తీసుకుని ఏపీలో సర్వే చేయడం జరిగింది. 

వైసిపి 127 సీట్లు (50.38%), టిడిపి, జనసేన, బిజెపి కూటమి 48 సీట్లు (45.58%), ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ 0 సీట్లు (1.38%), ఇతరులు 0 సీట్లు (2.66%) వస్తాయని ఎలెక్సెన్స్ సర్వే తేల్చింది. మొత్తంగా ఈ సర్వే ప్రకారం కూడా ఏపీలో మళ్ళి సీఎం జగన్ రెడ్డి అధికారంలోకి వస్తారని తేల్చడంతో గెలుపు చాలావరకు వారివైపు ఉన్నట్లు స్పష్టం అవుతోందని అంటున్నాయి రాజకీయ వర్గాలు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు