టీడీపీకి రాజీనామా చేసిన సీనియర్ నాయకుడు

టీడీపీకి రాజీనామా చేసిన సీనియర్ నాయకుడు

Published on Feb 27, 2024 12:51 PM IST

రానున్న 2024 ఏపీ అసెంబ్లీ ఎన్నికల కోసం పలు పార్టీలు ఇప్పటికే అన్ని విధాలా సన్నద్ధం అవుతున్నాయి. ఇక గత ఎన్నికల్లో ఘోరంగా పరాజయం పాలయిన టిడిపి పార్టీ ఈసారి ఎలాగైనా అధికారాన్ని అందుకోవాలని గట్టిగా ప్రయత్నాలు చేస్తోంది. రానున్న ఎన్నికల్లో జనసేనతో కలిసి టిడిపి పోటీ చేయనున్న విషయం తెలిసిందే. అయితే ఇప్పటికే పలువురు నాయకులు టిడిపి పార్టీని వీడగా తాజాగా సీనియర్ నాయకుడు గొల్లపల్లి సూర్యారావు టిడిపికి రాజీనామా చేసారు. 

తెలుగుదేశం రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా, రాజోలు నియోజకవర్గ ఇంచార్జిగా పనిచేసిన గొల్లపల్లి సూర్య రావు పార్టీ పదవులకు మరియు పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేస్తూ టిడిపి పార్టీ కి సవిరంగా ఒక లేఖ రాసారు. 1981వ సంవత్సరం నుండి కొత్తపేట సమితి అధ్యక్షునిగా క్రియాశీల రాజకీయాలలో ప్రవేశించాను. దరిమిలా రెండు దఫాలు స్వర్గీయ యన్టిఆర్ మరియు వైయస్ఆర్ మంత్రివర్గాలలో సభ్యునిగా రాష్ట్ర ప్రజలకు సేవలందించాను. 

2014 నుండి 2019 వరకు శాసన సభ్యునిగా మీకు గానీ, పార్టీకి గాని ఏవిధమైన ఇబ్బంది కలిగించకుండా తెలుగుదేశంపార్టీ గౌరవాన్ని నిలిపిన విషయం మీకు తెలుసు. 2019 నుండి తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షునిగా, రాజోలు నియోజకవర్గ ఇన్ఛార్జ్ ప్రతికూల పరిస్థితిలో కూడా రాష్ట్ర పార్టీ ఇచ్చిన ప్రతి కార్యక్రమాన్ని నిబద్ధతతో, క్రమశిక్షణతో అనుసరించి పార్టీ ప్రతిష్టను నిలబెట్టాను. బాధ్యతా నిర్వహణలో ఏవిధమైన చిన్న పొరపాటు కూడా లేని పరిస్థితిలో మీరు ప్రకటించిన మొదటి 94 యంఎస్ఏ స్థానాలలోనే నన్ను అభ్యర్ధిగా ప్రకటించే అర్హతలు ఉన్నప్పటికీ నా పేరును పరిగణలోనికి తీసుకోకపోవడం నాకు అత్యంత బాధ కలిగించింది. 

నా ఆత్మగౌరవానికి భంగం కలిగిన ఇటువంటి పరిస్థితిలో పార్టీలో కొనసాగలేనని, నేను తెలుగుదేశం పార్టీ పదవులకు మరియు పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నాను. నా రాజీనామాను వెంటనే ఆమోదించవలసినదిగా కోరుచున్నానని తన లేఖలో తెలిపారు గొల్లపల్లి సూర్యారావు. ఒకరకంగా ఇది టిడిపి కి దెబ్బె అంటున్నాయి రాజకీయ వర్గాలు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు