వైఎస్ వివేకా హత్య పై కడప కోర్టు మధ్యంతర ఉత్తర్వులు

వైఎస్ వివేకా హత్య పై కడప కోర్టు మధ్యంతర ఉత్తర్వులు

Published on Apr 18, 2024 12:43 AM IST

ఐదేళ్ల క్రితం జరిగిన వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసుని టార్గెట్ గా చేసుకుని కొన్నాళ్లుగా టీడీపీ మరియు వారి అనుయాయులు వైసిపి అలానే జగన్, అవినాష్ రెడ్డి వంటి వారి పై నిందలు మోపుతున్న సంగతి తెలిసిందే. అయితే ప్రస్తుతం కేసు కోర్టులో ఉన్నప్పటికీ కూడా ఎన్నికల సమయం కావడంతో టిడిపి నాయకులు, జనసేన, బిజెపి వారు సైతం ఆ కేసు విషయమై నానా రకాలుగా మాట్లాడుతూ జగన్ కుటుంబాన్ని మరింతగా టార్గెట్ చేస్తూ దానిని రాజకీయంగా వాడుకుంటున్నారు. 

ఇక ఎన్నికలకు మరికొద్ది రోజులు మాత్రమే మిగిలి ఉండడంతో ఆ హత్యపై కోర్టు తాజాగా కడప కోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. అయితే వైఎస్ వివేకా హత్య ప్రస్తావనపై కడప కోర్టును వైసీపీ నేత సురేష్‌బాబు ఆశ్రయించడం,  ఆయన తరుపున వాదనలు వినిపించిన న్యాయవాది నాగిరెడ్డి వాదనలు విన్న జడ్జి ఇకపై వైఎస్‌ షర్మిల, సునీత, చంద్రబాబు, పవన్‌ లతో పాటు లోకేష్‌, పురందేశ్వరిని వివేకా హత్యపై ప్రస్తావించొద్దని ఆదేశాలు జరీ చేసింది. కాగా ఆ కేసులో ప్రతివాదులుగా షర్మిల, సునీత, చంద్రబాబు, లోకేష్‌, పురందేశ్వరి, పవన్‌, రవీంద్రనాథ్‌రెడ్డి ఉన్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు